ETV Bharat / offbeat

మీ ఇంట్లో బ్రకోలీ తినట్లేదా? - పాలకూరతో కలిపి దోశ వేయండి - మొత్తం లాగిస్తారు! - SPINACH BROCCOLI DOSA IN TELUGU

- ఎంతో రుచికరమైన దోశలు సిద్ధం - రుచితోపాటు ఆరోగ్యం మీ సొంతం

Spinach Broccoli Dosa Recipe
Spinach Broccoli Dosa Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

Spinach Broccoli Dosa Recipe : ఆకుకూరలు మన హెల్త్​కి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలిసిందే. తరచూ వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల జీర్ణప్రక్రియ మెరుగుపడడంతోపాటు, కంటి చూపు బాగుంటుందని నిపుణులు చెబుతుంటారు. అలాగే బరువు అదుపులో ఉంటుందని కూడా సూచిస్తుంటారు. అయితే.. బరువు తగ్గడానికి చేసే ప్రయత్నాల్లో బ్రకోలీ చాలా బాగా సహాయం చేస్తుంది. వీటిలో ఎన్నో రకాల పోషకాలు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

అయితే.. బ్రకోలి తినడానికి చాలా మంది ముఖం విరుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలు నో చెప్తుంటారు. అందుకే.. మీకోసం ఓ సూపర్ రెసిపీ తీసుకోచ్చాం. ఈ బ్రకోలీతో అద్భుతమైన దోశలు తయారు చేసుకోవచ్చు. పాలకూరతో కలిపి రుచికరమైన దోశలు తయారు చేసుకోవచ్చు. ఈ దోశలు తినడం వల్ల రుచితోపాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది. షుగర్​, బీపీతో బాధపడే వారికి ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ బ్రకోలీ, పాలకూర దోశలను ఎలా చేయాలి? వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర - 1 కట్ట
  • బ్రకోలీ -కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు -4
  • జీలకర్ర పొడి- టీస్పూన్
  • గరం మసాలా - అరటీస్పూన్
  • నల్ల మిరియాల పొడి -అరటీస్పూన్
  • ఉప్పు -రుచికి సరిపడా
  • పచ్చి మిర్చి-2
  • శనగ పిండి-కప్పు

తయారీ విధానం:

  • ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి సన్నగా ముక్కలు కట్​ చేసుకోవాలి.
  • అలాగే బ్రకోలీ శుభ్రంగా కడిగి.. ముక్కలుగా కట్ చేసుకోవాలి.
  • ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి పాలకూర తరుగు, బ్రకోలీ ముక్కలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి.. కొద్దికొద్దిగా వాటర్​ యాడ్​ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్​ చేసుకోవాలి.
  • ఈ పేస్ట్​ని ఒక మిక్సింగ్​ బౌల్లోకి తీసుకోండి. ఆపై శనగ పిండి, జీలకర్ర, గరం మసాలా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • పిండి దోశల పిండిలా ఉండే విధంగా నీళ్లను పోస్తూ కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టుకొని వేడిచేసుకోవాలి. పాన్ వేడయ్యాక కాస్త ఆయిల్​ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని దోశ మాదిరిగా వేసుకోవాలి.
  • అనంతరం అంచుల వెంబడి కొద్దిగా నూనె అప్లై చేసుకొని దోరగా కాల్చుకొని సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీ అండ్​ హెల్దీ 'బ్రకోలీ, పాలకూర దోశలు' రెడీ!
  • ఇక ఈ దోశలను పల్లీ, టమాటా చట్నీతో తింటే ఎంతో రుచికరంగా ఉంటాయి.
  • ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ఓసారి ట్రై చేయండి.

అధిక బరువుకు ఈ రెసిపీ సూపర్ ఆప్షన్ - ఇలా ప్రిపేర్ చేసుకుంటే కేక!

నోరూరించే "మ్యాగీ ఆమ్లెట్​" - టేస్ట్​ అద్దిరిపోతుందంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.