ETV Bharat / offbeat

రెగ్యులర్​​ ఆమ్లెట్​ తిని బోర్​ కొట్టిందా? - ఈసారి "స్పానిష్​ ఆమ్లెట్"​ వేయండి! - మస్తు మజా వస్తుంది! - Spanish Omelette

Spanish Omelette : ఆమ్లెట్ అనగానే నోరూరని వారుండరు. సమయంతో సంబంధం లేకుండా దీనిని తినేవారు ఉన్నారు. అయితే ఎప్పుడూ ఒకే రకంగా తింటే ఏదైనా బోర్ కొడుతుంది. అందుకే.. ఈసారి వెరైటీగా స్పానిష్ ఈ ఆమ్లెట్​ ట్రై చేయండి. రుచి అద్దిరిపోతుందంతే!

Spanish Omelette
Spanish Omelette (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 4:09 PM IST

Spanish Omelette Making Process: ఇంట్లో కోడిగుడ్లు ఉన్నాయంటే ఠక్కున గుర్తొచ్చేది ఆమ్లెట్​. కాస్త వెరైటీగా తినాలంటే అప్పుడప్పుడూ బ్రెడ్​ ఆమ్లెట్​ తింటుంటాం. అయితే.. ఆమ్లెట్​ అంటే కేవలం ఎగ్ ఆమ్లెట్, బ్రెడ్​ ఆమ్లెట్ మాత్రమే కాదు. ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అందులో ఒక రెసిపీని మీ కోసం తీసుకొచ్చాం. అదే స్పానిష్​ ఆమ్లెట్​. మరి.. ఈ వెరైటీ ఆమ్లెట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ స్టోరీలో చూద్దాం..

స్పానిష్​ ఆమ్లెట్​:

కావాల్సిన పదార్థాలు:

  • నూనె - 5 టేబుల్​ స్పూన్లు
  • బంగాళదుంప - 1
  • ఉల్లిపాయలు - 1
  • కోడిగుడ్లు - 6
  • ఉప్పు - రుచికి సరిపడా
  • మిరియాల పొడి - అర టీ స్పూన్​

ఎగ్​ దోశ చేయడం ఇప్పుడు చాలా ఈజీ - ఈ టిప్స్ పాటించండి - టేస్ట్​ ఎంజాయ్​ చేయండి!

తయారీ విధానం:

  • ముందుగా ఆలుగడ్డను చెక్కు తీసి సన్నగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే ఉల్లిపాయలను కూడా సన్నగా పొడుగ్గా కట్​ చేసుకోవాలి.
  • ముందుగా స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి 5 టేబుల్​ స్పూన్ల ఆయిల్​ వేసి హీట్​ చేసుకోవాలి.
  • నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఆలుగడ్డ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్​ మీద 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా చీలికలుగా చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని మీడియం ఫ్లేమ్​ మీద మరో 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.
  • ఆ తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలను నూనె లేకుండా వడకట్టి ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
  • ఇప్పుడు మరో బౌల్​ తీసుకుని అందులోకి 6 గుడ్లు పగలకొట్టి వేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బాగా బీట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు కోడిగుడ్డు మిశ్రమంలో ముందే ఫ్రై చేసుకున్న ఆలుగడ్డ, ఉల్లిపాయ ముక్కలు వేసి మరోసారి బాగా కలుపుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్​ నల్ల మిరియాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి.
  • ఇప్పుడు నాన్​స్టిక్​ పాన్​ పెట్టి ఆలు, ఉల్లి వేయించగా ఉన్న మిగిలిన నూనె వేసి కోడిగుడ్డు మిశ్రమం పోసి సమానంగా పర్చాలి.
  • ఆ తర్వాత మూత పెట్టి దానిని స్టవ్​ మీద పెట్టి మీడియం ఫ్లేమ్​లో 10 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత పాన్​ కంటే కొంచెం పెద్దగా ఉన్న ప్లేట్​ తీసుకుని దానికి నూనె రాసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్​ను పాన్​ మీద పెట్టి దానిని ఫ్లిప్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత నెమ్మదిగా ప్లేట్​లోని ఆమ్లెట్​ను కడాయిలోకి వేసుకోవాలి. రెండో వైపు కూడా ఆమ్లెట్​ను మరో మూడు నిమిషాలు కుక్​ చేసుకోవాలి. అయితే ఇక్కడ మూత పెట్టాల్సిన అవసరం లేదు.
  • అంతే ఎంతో టేస్టీగా అండ్​ ప్లఫ్పీగా ఉండే స్పానిష్​ ఆమ్లెట్​ రెడీ. దీనిని టమాటా కెచప్​తో తింటే అద్దిరిపోతుంది.

అద్దిరిపోయే రుచితో "కార్న్​ క్యాప్సికం మసాలా" - ఇలా చేశారంటే మైమరచిపోవాల్సిందే!

తెలుగు వారికి ఎంతగానో నచ్చే సేమియా ఉప్మా - పొడి పొడిగా ఇలా చేసేయండి - పిల్లలు ఇష్టంగా తినేస్తారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.