How to Make Custard Apple Ice Cream at Home: ఐస్‌క్రీమ్ అంటే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా చిన్నపిల్లలైతే దీని కోసం ఇంట్లో కొట్లాడుతారు కూడా. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లప్పుడు ఇవి పెట్టడం కామన్. బటర్‌స్కాచ్, వెనీలా, చాక్లేట్, మ్యాంగో.. ఇలా ఒక్కటేమిటి ఎన్నో రకాల ఫ్లేవర్లు ఉన్నాయి ఇందులో. ఇవన్నీ కూడా ఏదో ఒక సందర్భంలో తినే ఉంటారు. అయితే ఎప్పుడూ ఇవే కాకుండా ఈసారి సీతాఫల్ ఐస్‌క్రీమ్ ట్రై చేయండి. టేస్ట్ అద్దిరిపోతుంది. పైగా ప్రస్తుతం సీతాఫలాల సీజన్ కావడంతో ప్రతి ఒక్కరూ దీనిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో తెలుసుకుందాం..
సీతాఫల్ ఐస్‌క్రీమ్ కోసం కావాల్సిన పదార్థాలు:
- సీతాఫలం గుజ్జు - ఒకటిన్నర కప్పు
- విప్పింగ్ క్రీమ్ - 1 కప్పు
- పంచదార పొడి - 1 కప్పు
- చల్లని పాలు - 1 కప్పు
- కండెన్సెడ్ మిల్క్ - ముప్పావు కప్పు
తయారీ విధానం:
- ముందుగా సీతాఫలాల నుంచి గుజ్జును సపరేట్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా ఒకటిన్నర కప్పు పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు మరో బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకోవాలి. ఇక్కడ విప్పింగ్ క్రీమ్ బదులు ఫ్రెష్ క్రీన్ కూడా వాడొచ్చు. ఇప్పుడు హ్యాండ్ బ్లెండర్ సాయంతో విస్క్ చేసుకోవాలి. మొత్తంగా 5 నిమిషాల పాటు విప్పింగ్ క్రీమ్‌ను విస్క్ చేసి అది గట్టిగా అయ్యేవరకు చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ లేకపోతే విస్కర్ సాయంతోనే క్రీమ్‌ను గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి.
- ఇప్పుడు అందులోకి బాగా చల్లగా ఉన్న పాలు, పంచదార పొడి, కండెన్సడ్ మిల్క్ వేసి విస్కర్ సాయంతో బాగా కలుపుకోవాలి. ఇలా ఓ 4 నిమిషాలు ఆగకుండా కలుపుకోవాలి. ఆ తర్వాత సీతాఫలం గుజ్జు వేసి మరో 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి.
- ఇలా మిక్స్ చేసుకున్న మిశ్రమాన్ని బౌల్‌తో సహా ఫ్రీజర్‌లో మూడు గంటల పాటు పెట్టాలి. ఇలా పెట్టే సమయంలో బౌల్‌పై మూత పెట్టాల్సిన అవసరం లేదు.
- మూడు గంటల తర్వాత ఆ బౌల్‌ను తీసి మరోసారి కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని మరో 5 గంటల పాటు ఫ్రీజర్‌లో స్టోర్ చేసుకోవాలి. వీలేతై రాత్రంతా ఉంచుకోవచ్చు. అంతే ఆ తర్వాత తీస్తే ఐస్‌క్రీమ్ రెడీ. దీన్ని స్కూప్ చేసుకుని తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. నచ్చితే మీరూ ఓ సారి ట్రై చేయండి..
ఎన్నో పోషకాలున్న మఖానాతో "టేస్టీ మసాలా కర్రీ"- ఇలా చేస్తే రుచి అద్దిరిపోతుంది!!