ETV Bharat / offbeat

వెకేషన్ తర్వాత ఇలా సింపుల్​గా బ్యాగులు సర్దేయండి - నిమిషాల్లో ఎక్కడివక్కడ అన్​ప్యాక్!

వెకేషన్​కి వెళ్లొచ్చాక బ్యాగులు సర్దడం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా? - మీకోసమే ఈ సూపర్ టిప్స్!

Tips to Unpacking Bags after Vacation
Unpacking Bags after Vacation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : 10 hours ago

Simple Tips to Unpacking Bags after Vacation : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో పని నుంచి కాస్త విరామం తీసుకొని ఏదైనా పర్యాటక ప్రదేశం లేదంటే వెకేషన్‌కి వెళ్లడమంటే ఎవరికైనా సరదానే! ఈ క్రమంలోనే చాలా మంది ఎంతో ఉత్సాహంగా బ్యాగులు సర్దుకుంటారు. అయితే, అలా వెళ్లేటప్పుడు బ్యాగులు సర్దుకోవడం ఒకెత్తయితే.. తిరిగొచ్చాక వాటిని ఎక్కడివక్కడ నీట్​గా సర్దడం మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు.

ముఖ్యంగా చాలా మంది రోజువారీ బిజీ లైఫ్​స్టైల్లో పడిపోయి వెకేషన్ నుంచి తిరిగిరాగానే ఈ పనిని వాయిదా వేస్తూ ఉంటారు. మీరూ ఏదైనా వెకేషన్​కి వెళ్లొచ్చాక బ్యాగులు సర్దడం వాయిదా వేస్తున్నారా? అయితే, మీకోసమే కొన్ని సింపుల్ టిప్స్ తీసుకొచ్చాం. వాటిని ఫాలో అయ్యారంటే నిమిషాల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈజీగా లగేజీ బ్యాగుల్ని అన్​ప్యాక్​ చేయవచ్చంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ఏదైనా వెకేషన్​కి వెళ్లేటప్పుడు కొంతమంది లగేజీ బ్యాగులో యాక్సెసరీస్‌, ఇతర బ్యూటీ ఉత్పత్తులు.. అవసరమైనవన్నీ డైరెక్ట్​గా వేసేస్తుంటారు. తద్వారా అవసరమైనప్పుడు అవి వెంటనే దొరక్కపోవడం అటుంచితే.. తిరిగొచ్చాక వాటిని ఒక్కొక్కటిగా తీసి సర్దడమూ చిరాకే. అందుకే అలాంటి వస్తువుల్ని వేటికవే సెపరేట్​గా చిన్న చిన్న జిప్​లాక్ బ్యాగుల్లో వేసుకొని తీసుకెళ్లడం మంచిది. ఫలితంగా ఇంటికొచ్చాక ఆ బ్యాగుల్ని నేరుగా ఎక్కడివక్కడ సర్దుకుంటే పని ఈజీ అవుతుందంటున్నారు నిపుణులు.
  • ఇంకొందరు వెకేషన్​కి వెళ్లేటప్పుడు బ్యాగుల్లో అవసరం ఉన్నవి, లేని వస్తువులను పెట్టుకొని తీసుకెళ్తుంటారు. దీనివల్ల లగేజీ తడిసి మోపెడవడం తప్ప మరే ఉపయోగం ఉండదనే విషయాన్ని గమనించాలి. పైగా ఇంటికొచ్చాక వాటిని సర్దడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా టూర్ లేదా వెకేషన్​లో బాగా యూజ్ అవుతాయన్న వస్తువులు, దుస్తులు మాత్రమే తీసుకెళ్లేలా చూసుకోవాలి. ఈ క్రమంలో వచ్చాక వాటిని సర్దుకోవడమూ తేలిక అవుతుందంటున్నారు.
  • కొన్ని సందర్భాల్లో ఇల్లు, ఆఫీస్‌ హడావిడితో తీసుకెళ్లిన లగేజీని ఒకేసారి నీట్​గా సర్దుకోవడం కుదరకపోవచ్చు. అలాంటి టైమ్​లో రోజుకు కొన్ని వస్తువుల చొప్పున సర్దేయాలి. ఈ క్రమంలో ఓరోజు వెకేషన్‌ నుంచి కొని తెచ్చిన వస్తువుల్ని సరైన ప్రదేశంలో సెట్ చేసుకోవడం, ఇంకో రోజు బట్టలు వాష్ చేసుకోవడం.. ఇలా రోజుకో పని చేస్తే సర్దడం ఈజీగా కంప్లీట్ అవుతుందని చెబుతున్నారు నిపుణులు.
  • కొందరు పర్యటక ప్రాంతానికి వెళ్లిన చోట అది బాగుంది.. ఇది బాగుంది అంటూ కనిపించిన వస్తువునల్లా కొనేస్తుంటారు. దీనివల్ల లగేజీ బరువు పెరిగిపోవడమే కాదు.. తెచ్చినవి సర్దడానికి కూడా నీరసం వచ్చేస్తుంది. అలాగే.. ఇంట్లోనూ చెత్త పేరుకుపోతుంది. అందుకే టూర్​కి వెళ్లినప్పుడు మీకు నచ్చిన ఒకటి లేదా రెండు వస్తువుల్ని వెంట తెచ్చుకోవడం బెటర్ అంటున్నారు.
  • వెకేషన్​కి వెళ్లొచ్చాక దుస్తుల వాషింగ్ పెద్ద పని అని చెప్పచ్చు. దీంతో టైమ్​ కూడా వృథానే! అయితే టూర్​లోనే ఈ పనిని కంప్లీట్ చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అదెలా అంటే.. మీరుండే హోటల్‌లో మీ బట్టల్ని లాండ్రీకి పంపిస్తే.. ఇంటికొచ్చాక ఆ పని చాలావరకు తగ్గుతుందంటున్నారు.
  • టూర్​కి వెళ్లొచ్చాక లగేజీని తిరిగి ఒక్కరే సర్దేయాలంటే కాస్త కష్టమైన పనే. కాబట్టి, ఈ పనుల్లో మీవారిని, పిల్లల్ని భాగం చేస్తే పని ఈజీ అవుతుంది. పైగా మీపై ఒత్తిడి కూడా తగ్గుతుంది. ఈవిధంగా అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ, వెకేషన్‌ అనుభవాల్ని/సరదాల్ని నెమరు వేసుకుంటూ పని చేస్తే అసలు సమయమే తెలియకుండా సులభంగా పనులూ పూర్తవుతాయి.
  • వెకేషన్​కి వెళ్లొచ్చాక ఇలా లగేజీని తిరిగి ఎక్కడివక్కడ సర్దడం పూర్తయ్యాక ఇల్లు నీట్‌గా కనిపిస్తుంది. తద్వారా మనసుకూ ఒక రకమైన రిలాక్సేషన్‌ లభిస్తుంది. ఇదే తిరిగి ఉత్సాహంగా కెరీర్‌లో కొనసాగేలా, వ్యక్తిగత జీవితంలో ముందుకు సాగేలా చేస్తుందని సూచిస్తున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

అలర్ట్ : కారులో లగేజీ ఇలా స్టోర్ చేస్తే - ప్రయాణమే ప్రమాదంలో పడొచ్చని మీకు తెలుసా?

ప్రెగ్నెన్సీలో ప్రయాణాలు చేస్తున్నారా? - ఈ జాగ్రత్తలు తీసుకుంటేనే సేఫ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.