Remove Stains From Plastic Containers : ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో పప్పులు, ఉప్పు, చింతపండు, కారం, పచ్చళ్లు వంటి వివిధ రకాల ఆహార పదార్థాలను స్టోర్ చేసేందుకు ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువగా వాడుతున్నారు. అలాగే మరికొంతమంది లంచ్ బాక్స్‌లకు సైతం వీటినే వాడుతున్నారు. ఇలా ప్లాస్టిక్ డబ్బాలు మన జీవితంలో ఒక భాగమై పోయాయి. అయితే, తరచూ ప్లాస్టిక్ బాక్సులను క్లీన్ చేస్తున్నా.. చాలా రోజుల నుంచి వాడుతుంటే వాటిపై మరకలు ఏర్పడుతుంటాయి. ఇవి ఎంత క్లీన్ చేసినా కూడా తొలగిపోవు. అయితే, ప్లాస్టిక్ డబ్బాలపైన ఉన్న మరకలను మాయం చేయడానికి కొన్ని చిట్కాలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెనిగర్ :
ఒక వంతు నీళ్లకు, రెండు వంతుల వెనిగర్ కలపండి. ఈ మిశ్రమంలో మృదువైన స్క్రబ్బర్ ముంచి ప్లాస్టిక్ డబ్బాలను క్లీన్ చేయండి. ఇలా చేస్తే డబ్బాలపైన ఉన్న మరకలు తొలగిపోయి.. కొత్తవాటిలా కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
హ్యాండ్ శానిటైజర్ :
ప్రస్తుత కాలంలో చాలా మంది ఇంట్లో హ్యాండ్ శానిటైజర్ ఉంటుంది. బయట నుంచి ఇంట్లోకి వచ్చిన తర్వాత అలాగే, వివిధ రకాల ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి దీనిని ఉపయోగిస్తున్నారు. అయితే, హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించడం ద్వారా ఈజీగా ప్లాస్టిక్ డబ్బాలపైన ఉన్న మరకలను తొలగించవచ్చు. అది ఎలా అంటే గోరువెచ్చని నీటిలో కొద్దిగా హ్యాండ్ శానిటైజర్ కలిపి ప్లాస్టిక్ బాక్స్‌లను అందులో గంటసేపు ఉంచాలి. తర్వాత సోప్‌తో రుద్ది క్లీన్ చేస్తే సరిపోతుంది. మరకలు మొత్తం మాయమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
నిమ్మరసం, బేకింగ్ సోడా :
ప్రతి ఇంట్లో బేకింగ్ సోడా, నిమ్మకాయ తప్పకుండా ఉంటాయి. అయితే, వీటిని ఉపయోగించి ప్లాస్టిక్ డబ్బాలపైన ఉన్న మరకలను ఈజీగా మాయం చేయవచ్చు. అది ఎలా అంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి.. మృదువైన స్క్రబ్బర్ సహాయంతో ఆ మిశ్రమాన్ని ప్లాస్టిక్ డబ్బాలపైన రుద్దాలి. ఇలా చేసిన తర్వాత నీటితో క్లీన్ చేస్తే అవి కొత్త వాటిలా మెరుస్తాయి. ఇక్కడ మీరు బేకింగ్ సోడాకి బదులుగా ఉప్పుని కూడా ఉపయోగించవచ్చు. 2019లో 'జర్నల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ హెల్త్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. బేకింగ్ సోడా, నిమ్మరసం మిశ్రమం ప్లాస్టిక్ డబ్బాలపైన ఉన్న పసుపు మరకలను తొలగించడానికి బాగా పనిచేసిందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీకి చెందిన 'డాక్టర్ ప్రమోద్ కుమార్ సింగ్' పాల్గొన్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
ఇవి కూడా చదవండి :
ప్లాస్టిక్ బాక్సులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్ పాటించి క్లీన్ చేస్తే బ్యాడ్ స్మెల్ పరార్!
వామ్మో - గ్యాస్ స్టవ్ పక్కన నూనె డబ్బా పెడితే ఇంత డేంజరా? ఎందుకో తెలుసుకోండి!