ETV Bharat / offbeat

బాదం, కాజు, పిస్తా తింటున్నారా? - మరి "పైన్ నట్స్​" తిన్నారా? - అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం! - Pine Nuts Health Benefits

Pine Nuts Benefits : రోజూ డ్రై ఫ్రూట్స్​ తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతుంటారు. అయితే.. వీటిలో మనకు బాదం, పిస్తా, జీడిపప్పు వంటివే ఎక్కువగా తెలుసు!కానీ, ఈ డ్రై ఫ్రూట్స్​ కంటే ఇంకా ఎక్కువ ఖరీదైనా నట్స్​ కూడా ఉన్నాయి. అవే 'పైన్​ నట్స్​ (చిల్గోజా గింజలు)'. వీటిని తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Pine Nuts
Pine Nuts Benefits (ETV Bharat)
author img

By ETV Bharat Health Team

Published : Sep 13, 2024, 9:48 AM IST

Updated : Sep 18, 2024, 11:59 AM IST

Pine Nuts Health Benefits : డ్రై ఫ్రూట్స్​ అనగానే మనలో చాలా మందికి.. బాదం, పిస్తా, జీడిపప్పు, అంజీర్‌, కిస్‌మిస్‌ వంటివి మాత్రమే గుర్తుకొస్తుంటాయి. కానీ.. "పైన్​ నట్స్​" గురించి మాత్రం పెద్దగా తెలియదు. వీటినే చిల్గోజా గింజలని కూడా అంటారు. వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పోషకాలు అనేకం :
పైన్​ నట్స్​.. (national library of medicine రిపోర్ట్​) తీపీ వెన్న కలగలసినట్టుగా ఎంతో కమ్మని రుచిగా ఉంటాయి. చాలా ఖరీదైన డ్రై ఫ్రూట్స్​ ఇవి​. విటమిన్ ఇ, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక రకాల విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ గింజల్లోని ఒలియాక్‌ మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లం రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

2001లో "బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్"లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. పైన్ గింజలను తీసుకోవడం వల్ల LDL (చెడు) కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే HDL (మంచి) కొలెస్ట్రాల్ పెరుగుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో అమెరికాలోని పెన్ స్టేట్ యూనివర్సిటీ న్యూట్రిషనల్ సైన్సెస్ విభాగానికి చెందిన 'డాక్టర్​ పెన్నీ మార్గరెట్ క్రిస్-ఈథర్టన్' పాల్గొన్నారు.

బరువు తగ్గుతారు! :
పైన్​ నట్స్​లోని పినొలెనిక్‌ ఆమ్లం ఆకలిని తగ్గించే ఎంజైమ్‌ల విడుదలకు తోడ్పడటం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో ప్రొటీన్​, ఫైబర్​ ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఈ నట్స్​లో క్యాలరీలు అధికంగా ఉన్నప్పటికీ మితంగా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్​ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • చిల్గోజా గింజలు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి మూత్రపిండాలు, కాలేయ పనితీరును మెరుగు పరుస్తాయి.
  • మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడేవారు పైన్​ నట్స్​ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు.
  • పైన్​ గింజలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు ఆరోగ్యాంగా, బలంగా ఉండేలా తోడ్పడుతుంది.
  • పైన్ నట్స్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన కొన్ని రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గిస్తాయి.
  • బాదంలో మాదిరిగానే చిల్గోజా గింజల్లోనూ విటమిన్‌-ఇ శాతం ఎక్కువ. ఫలదీకరణ తర్వాత రూపొందిన కంకులు పక్వ దశకు రావడానికి కనీసం రెండుమూడేళ్లు పడుతుందట. అందుకే వీటి ధర చాలా ఎక్కువ.
  • లోపల పప్పులు క్రీమ్‌ కలర్‌లోనూ పైనుండే తొక్క గోధుమ కలర్​లోనూ ఉంటుంది. పశ్చిమ హిమాలయాల్లోని అడవుల్లో పెరిగే చిల్గోజా గింజలైతే సన్నగా పొడవుగా ఉంటాయి.
  • తియ్యని వాసనతో ఉండే పైన్‌నట్‌ ఆయిల్‌ అయిన బోర్నియాల్‌ చర్మాన్ని డ్రై కాకుండా చేస్తుంది. వీటిని సంపద్రాయ వైద్యంలోనూ.. అలాగే బ్యూటీ ఉత్పత్తుల్లోనూ ఎక్కువగా వాడుతుంటారు.

NOTE: ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

ఇవి కూడా చదవండి :

రోజూ వాల్​నట్స్​ తినే అలవాటు ఉందా? - మీ బాడీలో జరిగేది ఇదే!

వయసును తగ్గించే డ్రైఫ్రూట్స్.. మీరు వీటిని తింటున్నారా!

Last Updated : Sep 18, 2024, 11:59 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.