ETV Bharat / offbeat

సూపర్ క్రంచీ "పల్లీ కొబ్బరి పట్టిలు"- ఈ విధంగా చేస్తే​ అద్భుతంగా వస్తాయి!

-అందరూ ఎంతో ఇష్టంగా తినే పల్లీ కొబ్బరి పట్టిలు -ఇలా చేస్తే నెల రోజుల పాటు తాజా

Peanut Coconut Chikki
Peanut Coconut Chikki (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : 2 hours ago

Peanut Coconut Chikki: ఆరోగ్యంగా ఉండడానికి.. మన ఆహారంలో డ్రైఫ్రూట్స్, బెల్లంతో చేసిన వంటకాలను.. భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా పిల్లలు, గర్భిణులు బలంగా ఉండడానికి బెల్లంతో చేసిన పల్లీ పట్టిలు తినాలని సూచిస్తుంటారు. అయితే ఎప్పుడూ పల్లీ పట్టి మాత్రమే కాకుండా అందులోకి కొబ్బరిని కలిపి "పల్లీ కొబ్బరి చిక్కీలు" తయారు చేయండి. ఇవి కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లం, పల్లీలు, కొబ్బరి.. ఈ మూడింటిలో కూడా పోషకాలు అధికంగా ఉంటాయి. పైగా వీటిని ఈ పద్ధతిలో చేస్తే కనీసం నెల రోజులపాటు ఎంతో కరకరలాడుతూ సూపర్​ టేస్టీగా ఉంటాయి. మరి ఇక లేట్​ చేయకుండా పల్లీ కొబ్బరి పట్టి ఇంట్లోనే ఎలా చేయాలో ఓ లుక్కేయండి..

కావాల్సిన పదార్థాలు..

  • పల్లీలు-200 గ్రాములు
  • తెల్ల బెల్లం -250 గ్రాములు
  • నెయ్యి-2 టేబుల్​స్పూన్లు
  • వంట సోడా -చిటికెడు
  • ఎండుకొబ్బరి తురుము-50 గ్రాములు
  • రోజ్​ ఎసెన్స్​- అరటీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా స్టౌపై పాన్​ పెట్టి పల్లీలు వేసుకోండి. పల్లీలను గరిటెతో కలుపుతూ బాగా వేయించుకోండి.
  • పల్లీలు వేగిన తర్వాత వాటిపైన ఉన్న పొట్టు తీసేయండి.
  • ఇప్పుడు ఒక వస్త్రంలో పొట్టు తీసిన పల్లీలను వేసుకుని చపాతీ కర్రతో రోల్​ చేసుకోండి. ఇలా చపాతీ కర్రతో రోల్​ చేయడం వల్ల పల్లీలు చిన్నగా విగిపోయి.. చిక్కీ చాలా బాగుంటుంది.
  • ఇప్పుడు స్టౌపై మూకుడు పెట్టండి. ఇందులో తెల్ల బెల్లం వేయండి. (పల్లీ పట్టిలు చేసుకోవడానికి తెల్ల బెల్లం ఉపయోగిస్తే మంచిది.)
  • బెల్లంలో ఒక్క చుక్క నీరు కూడా పోయకూడదు. బెల్లం వేడికి కరిగిపోతుంది.
  • బెల్లం పూర్తిగా కరిగి పాకంలా మారిన తర్వాత అర టేబుల్​ స్పూన్​ నెయ్యి వేసి కలపండి. (నెయ్యి వేస్తే చిక్కీకి మంచి రంగు వస్తుంది)
  • పాకం ముదురు రంగులోకి వచ్చాక.. కాస్త ఘాటు వాసన వస్తుంది. ఇప్పుడు స్టౌ లో ఫ్లేమ్​లో పెట్టుకోండి. ఈ సమయంలో వంట సోడా వేసి బాగా కలపండి.
  • వంటసోడా వేయడం వల్ల పాకం కాస్త పొంగుతుంది. తర్వాత పాకంలో పల్లీలు, ఎండు కొబ్బరి తురుము, రోజ్​ ఎసెన్స్ వేసి బాగా కలపండి. (రోజ్​ ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చు)
  • పాకానికి బెల్లం బాగా పట్టేలా కలపాలి.
  • ఇప్పుడు బటర్​ రాసి పెట్టిన ఒక ప్లేట్లోకి పల్లీ పట్టి మిశ్రమం వేసుకుని మొత్తం స్ప్రెడ్​ చేసుకోవాలి.
  • తర్వాత పైన కొద్దిగా కొబ్బరి తురుము చల్లుకుని మరొకసారి గిన్నెతో ప్రెస్​ చేయండి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బయటకు తీయండి. నెయ్యి రాసిన చపాతీ కర్రతో మొత్తం సమానంగా రోల్ చేసుకోండి.
  • అలాగే చాక్​తో పైన మీకు ఎంత సైజ్​లో కావాలో సగం కట్​ చేసుకోండి. గంట తర్వాత చూస్తే ఎంతో రుచికరంగా ఉండే పల్లీ కొబ్బరి చిక్కీలు మీ ముందుంటాయి.
  • నచ్చితే మీరు కూడా ఇలా చిక్కీలను ఓసారి ట్రై చేయండి. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

దసరా స్పెషల్​ : పండగ రోజున అందరికీ నచ్చే "కమ్మటి పరమాన్నం" ఇలా చేసేయండి!

అమ్మవారికి పెట్టే నైవేద్యాలతో ఆరోగ్యానికి ఎంతో మేలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.