ETV Bharat / offbeat

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు - నిమిషాల్లో "ఆనియన్ రైస్" ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది! - Onion Rice Recipe

Onion Rice Recipe : పిల్లలు ఇష్టపడే వంటకాల్లో బిర్యానీ కూడా ఒకటి. అలాగని ఎప్పుడూ అదే చేయలేం కాబట్టి.. ఈసారి దానికి బదులుగా ఇలా ఉల్లి రైస్ ప్రిపేర్ చేసి పెట్టండి. అడిగి మరీ తింటారు. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది! మరి.. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Onion Rice Recipe
Onion Rice Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 29, 2024, 12:55 PM IST

How to Make Onion Rice Recipe : రోజూ పప్పు, కూర, పచ్చడి, పెరుగు లాంటివే తినాలంటే పిల్లలకే కాదు.. పెద్దలకీ బోర్​గా అనిపిస్తోంది. అలాగని.. బిర్యానీ, పులావ్​ చేయాలన్నా కాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే.. ఈసారి కాస్త వెరైటీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునేలా సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "ఆనియన్ రైస్". పైగా దీనికోసం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు. వంటింట్లో ఉండే పదార్థాలతోనే నిమిషాల్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు! టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంతకీ, ఈ రెసిపీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • కప్పు - బియ్యం
  • నాలుగు - ఉల్లిపాయలు
  • ఐదు - పచ్చిమిర్చి
  • 2 టీస్పూన్లు - మినప పప్పు
  • 2 టీస్పూన్లు - శనగ పప్పు
  • 1 టీస్పూన్ - జీలకర్ర
  • అర టీస్పూన్ - ఆవాలు
  • రెండు - లవంగాలు
  • రెండు - యాలకులు
  • అర టీస్పూన్ - కారం
  • 2 రెమ్మలు - కరివేపాకు
  • రుచికి సరిపడా - ఉప్పు
  • తగినంత - నూనె

ఉల్లి రైస్ తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయలను సన్నగా కట్​ చేసి పక్కన ఉంచుకోవాలి. అలాగే.. పచ్చిమిర్చిని నిలువుగా తరుక్కొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఒక బౌల్​లో బియ్యాన్ని శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె కాస్త వేడయ్యాక.. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప పప్పు వేసుకొని లో ఫ్లేమ్ మంట మీద కాసేపు వేయించుకోవాలి.
  • ఆవిధంగా వేయించుకున్నాక కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి.
  • ఆపై మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి ఆనియన్స్ రంగు మారి కాస్త మెత్తబడే వరకు వేయించుకోవాలి.
  • అలా వేగాయనుకున్నాక.. లవంగాలు, యాలకులు వేసి ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారం వేసి బాగా మిక్స్ చేసుకొని మరో నిమిషం పాటు వేయించుకోవాలి.
  • ఇక ఆ మిశ్రమం మంచిగా వేగిందనుకున్నాక.. అందులో ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఆపై రెండు కప్పుల వాటర్ పోసుకొని మరోసారి మిశ్రమాన్ని కలిపి మూత పెట్టుకోవాలి.
  • అయితే, ఇక్కడ మనం కప్పు రైస్ తీసుకున్నాం కాబట్టి అవి ఉడికేందుకు రెండు కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
  • అనంతరం మంటను మీడియం ఫ్లేమ్​లో ఉంచి రైస్ ఉడికేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇక చివరగా రైస్ ఉడికిందనుకున్నాక దింపే ముందు ఒకసారి అంతా కలిపి.. మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉంచి దించేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "ఉల్లి రైస్" మీ ముందు ఉంటుంది!

ఇవీ చదవండి :

పిల్లల లంచ్​ బాక్స్​లోకి టేస్టీ "పెప్పర్​ రైస్" - ఇలా చేశారంటే డబ్బా మొత్తం ఖాళీ చేసేస్తారు!

మిగిలిపోయిన అన్నంతో "ఎగ్ ఫ్రైడ్ రైస్" - తిన్నారంటే వారెవ్వా ఏం టేస్ట్​ రా బాబు అంటారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.