ETV Bharat / offbeat

నెల్లూరు స్టైల్​ "రసం" - ఈ పద్ధతిలో ప్రిపేర్ చేసుకోండి - డైరెక్టుగా రసమే తాగేస్తారు! - Nellore Style Rasam Recipe

Nellore Style Rasam Recipe : కొందరికి పులుసు లేదా చారు లేకపోతే కడుపునిండా తిన్నాననే ఫీలింగ్ కలగదు. అలాగని ఎప్పుడూ ఒకే రుచిలో ఉంటే ఏం బాగుంటుంది.. అందుకే ఈసారి ఇలా 'నెల్లూరు స్టైల్​లో రసం' ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్ సూపర్​గా ఉంటుంది! మరి, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

How to Make Nellore Rasam Recipe
Nellore Style Rasam Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 2, 2024, 4:51 PM IST

How to Make Nellore Rasam Recipe : వేడి వేడి అన్నంలో కారంకారంగా, ఘాటుఘాటుగా ఏదైనా రసం వేసుకుని తింటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది. ఇలా తినడం చిన్నా, పెద్దా అందరికీ ఇష్టమే. అలాంటి వారికోసమే ఒక సూపర్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. నెల్లూరు స్టైల్ రసం. టేస్ట్ అద్దిరిపోతుంది! అంతేకాదు.. నచ్చితే ఎంచక్కా నేరుగానూ తాగేయొచ్చు. పైగా ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇంతకీ.. ఈ టేస్టీ, హెల్దీ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు :

  • చింతపండు - నిమ్మకాయ సైజంత
  • పండిన టమాటా - 1
  • నూనె - 2 టేబుల్ స్పూన్లు
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు - 1 రెమ్మ
  • పసుపు - అర టీస్పూన్
  • ఉప్పు - రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

పొడి కోసం :

  • మిరియాలు - 1 టీస్పూన్
  • జీలకర్ర - ఒకటిన్నర టీస్పూన్
  • ధనియాలు - 1 టీస్పూన్
  • మెంతులు - చిటికెడు
  • ఎండుమిర్చి - 3
  • వెల్లుల్లి రెబ్బలు - 10

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా ఒక బౌల్​లో చింతపండును తీసుకొని శుభ్రంగా కడిగి.. ఆపై అందులో ఒక గ్లాసు వాటర్ పోసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
  • ఆలోపు రెసిపీలోకి కావాల్సిన మిరియాల పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం మిక్సీ జార్​ తీసుకొని అందులో మిరియాలు, జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు.. వేసుకొని కాస్త కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు బౌల్​లోకి పండిన టమాటాను తీసుకొని దాన్ని చేతితో మెత్తగా అయ్యే వరకు బాగా క్రష్ చేసుకోవాలి.
  • ఆపై రెండింటినీ కలుపుకొని రసంలా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
  • అనంతరం.. స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడయ్యాక.. ఎండుమిర్చిని తుంచి వేసుకోవాలి. ఆపై కరివేపాకు, ముందుగా మిక్సీ పట్టుకున్న మిరియాల పొడిని అందులో వేసుకొని మంటను లో ఫ్లేమ్​లో ఉంచి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. అలా వేయించుకునేటప్పుడే పసుపు యాడ్ చేసుకొని వేయించుకోవాలి.
  • ఇక ఆ మిశ్రమం బాగా వేగిందనుకున్నాక.. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా చింతపండు రసాన్ని అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఉప్పుతో పాటు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే, ఈ వాటర్ అనేవి ఒకసారి టేస్ట్ చూసుకొని పులుపుకి తగ్గట్టుగా పోసుకోవాలి.
  • ఆ తర్వాత స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి మిశ్రమం ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. అంతేకానీ.. మరీ ఎక్కువగా మరిగించుకోవద్దు.
  • ఆవిధంగా మరిగించుకున్నాక స్టౌ ఆఫ్ చేసి చివరగా కొత్తిమీర తరుగు వేసి కలుపుకొని దింపుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా, స్పైసీగా ఉండే నెల్లూరు స్లైల్ రసం రెడీ!
  • దీన్ని వేడి వేడి అన్నంలో పోసుకొని తింటుంటే ఆ ఫీలింగ్ సూపర్​గా ఉంటుంది!

ఇవీ చదవండి :

"మైసూర్​ స్టైల్​ టమాటా రసం" - రుచి అమోఘంగా ఉంటుంది! - ఇలా ప్రిపేర్ చేయండి!

నిమిషాల్లో ప్రిపేర్​ అయ్యే 'పెసరపప్పు చారు'- ఇలా చేస్తే టేస్ట్​ నెక్ట్స్​ లెవల్​ అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.