ETV Bharat / offbeat

పవర్‌లిఫ్టింగ్‌లో నంద్యాల యువతి సత్తా - ప్రోత్సాహం కోసం ఎదురుచూపు - Anju excelling in Power Lifting - ANJU EXCELLING IN POWER LIFTING

Young Woman Anju Showing Skills in Power Lifting: పుట్టుకతోనే ఆ యువతికి పేదరికంతో పరిచయం ఏర్పడింది. కష్టాలతో చెలిమి చేయాల్సి వచ్చింది. దీంతో కుటుంబలోని కన్నీళ్లను ఎలాగైనా పారద్రోలాలని సంకల్పించింది. అందుకు ఆటలే అనువైనవని భావించి మెళకువలు నేర్చుకుంది. ఇటీవల జరిగిన అంతర్జాతీయ పోటీల్లో పసిడి పతకం సాధించి అదరహో అనిపించింది. ఓ వైపు పేదరికంతో పోరాడుతూనే పతకాల పంట పండిస్తున్న ఆ క్రీడా కుసుమం కథెంటో మీరూ చూడండి.

Young_Woman_Anju_Showing_Skills_in_Power_Lifting
Young_Woman_Anju_Showing_Skills_in_Power_Lifting (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 15, 2024, 1:52 PM IST

Young Woman Anju Showing Skills in Power Lifting: ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలని చిన్ననాడే సంకల్పించిందీ యువతి. అందుకోసం ఆటలపై ఆసక్తిని పెంచుకుంది. కష్టాలను, కన్నీళ్లను తన భవిష్యత్తుకు పునాది రాళ్లుగా వేసుకుంది. అనతికాలంలోనే పవర్‌లిఫ్టింగ్‌లో ప్రావీణ్యం సాధించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన అంతర్జాతీయ పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.

షేక్ అర్షు అంజు తల్లిదండ్రులు దస్తగిరి, రజియాబీలు. నంద్యాల జిల్లా కేంద్రంలో నివాసం ఉంటున్నారు. దస్తగిరి శుభకార్యాలకు వంట చేస్తూ, రజియాబీ మిషన్‌ కుడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ఒక్కతే కుమార్తె కావడంతో అంజు అభిరుచులను, అలవాట్లను బాల్యం నుంచే ప్రోత్సహిస్తూ వస్తున్నారు. చిన్నప్పటి నుంచి కష్టాల కడలిని కళ్లారా చూసిన ఈ యువతి ఆటలనే ఆదరువుగా చేసుకుని అందులోంచి బయటపడాలని భావించింది.

8 తరగతిలోనే వ్యాయామ ఉపాధ్యాయుడి సలహా మేరకు హాకీ క్రీడలో చేరింది. కొద్దిరోజుల్లోనే ఆటపై పట్టు సాధించి గోల్‌ కీపర్‌గా జిల్లా, రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహించి పతకాలు సాధించింది. హాకీ బృంద క్రీడ కావడంతో తగిన గుర్తింపు తెచ్చుకోవడం కష్టమని భావించింది అంజు. వ్యక్తిగత క్రీడలో రాణించాలని నిర్ణయించుకుంది. అందుకోసం పవర్‌లిఫ్టింగ్‌ను ఎంచుకుంది. నంద్యాలలోని హనుమాన్‌ వ్యాయామశాలలో చేరి ఒనమాలు నేర్చుకుంది. 4 సంవత్సరాలు శ్రమించి పవర్‌లిఫ్టింగ్‌ క్రీడలో పరిణతి చెంది జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాల పంట పండిస్తోంది.

ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తూ - తైక్వాండోలో రాణిస్తున్న విజయవాడ అమ్మాయి - Taekwondo pavani sai

డిగ్రీ వరకు ప్రభుత్వ కళాశాలల్లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన అంజు ప్రస్తుతం మధురైలో కామరాజు యూనివర్శిటీలో ఎంఎస్సీలో చేరింది. 2023 విశాఖలో జరిగిన జాతీయస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకంతో మెరిసింది. ఈ ఏడాది నేపాల్‌లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో 57 కేటగిరీలో పసిడి పతకం సాధించినట్లు చెబుతోందీ పవర్‌లిఫ్టర్‌.

ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆత్మస్థైర్యంతో పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో పతకాలు సాధిస్తున్నట్లు అంజు చెబుతోంది. కుటుంబ అండదండలే తనకు కొండంత బలం అని అంటోంది. ఆడపిల్లకు ఆటలేందుకు పెళ్లిచేసి అత్తారింటికి పంపమని ఇరుగుపొరుగు వారు ఎన్ని మాటలన్నా తల్లిదండ్రులు మాత్రం ఏనాడు తనపై ఒత్తిడి పెంచలేదని వివరిస్తోంది. స్నేహితులు, సోదరుల సహకారంతో ముందుకు సాగుతున్నట్లు చెబుతోందీ క్రీడాకారిణి.

జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తున్న ఈ క్రీడాకారిణి పట్ల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నామని వివరిస్తున్నారు. చదివిస్తూ ఆటలు ఆడించడం తమ వల్ల కాదని అంటున్నారు. ఎవరైనా దాతలు సహకరిస్తే సింగపూర్‌లో జరగబోయే అంతర్జాతీయ పోటీలకు పంపిస్తామని చెబుతున్నారు. పవర్‌లిఫ్టింగ్‌ పోటీల్లో ప్రతిభ కనబరచిన ఈ యువ క్రీడాకారిణి ఈ ఏడాది సెప్టెంబర్‌లో సింగర్‌పూర్‌ వేదికగా జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికైంది. కానీ, అక్కడికి వెళ్లేందుకు తగిన ప్రోత్సహం లేదని అంటోంది. ఎవరైనా సహకరిస్తే పోటీల్లో పాల్గొని పతకం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తోంది అంజు.

"నాకు చిన్నప్పటి నుంచి ఆటలపై ఆసక్తి. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఆత్మస్థైర్యంతో పవర్‌లిఫ్టింగ్​లో శిక్షణ తీసుకుంటున్నాను. ఆడపిల్లకు ఆటలెందుకు పెళ్లిచేసి అత్తారింటికి పంపమని ఇరుగుపొరుగు వారు ఎన్ని మాటలన్నా నా తల్లిదండ్రులు నాపై ఒత్తిడి తీసుకుని రాలేదు. నేను సింగర్‌పూర్‌ వేదికగా జరిగే అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యాను. అయితే ఆ పోటీలకు వెళ్లేందుకు నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేవు. ఎవరైనా దాతలు సహాయం చేస్తే పోటీల్లో పాల్గొని పతకం సాధిస్తాను." - షేక్ అర్షు అంజు, పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి

స్టీరింగ్ పట్టిన అనంత అమ్మాయి - ఆర్టీసీలో చేరేందుకు శిక్షణ - Anantapur Lady Driver

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.