ETV Bharat / offbeat

బీపీ తగ్గించే బచ్చలితో "అద్దిరిపోయే పచ్చడి" - వేడివేడి అన్నంలోకి అమృతమే! - MALABAR SPINACH PACHADI IN TELUGU

- నిమిషాల్లోనే సిద్ధమైపోయే బచ్చలి చట్నీ

Malabar Spinach Pachadi
Malabar Spinach Pachadi (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 23, 2024, 12:06 PM IST

Malabar Spinach Pachadi : పోషకాహారం అంటే.. చాలామంది ఖరీదైన తిండి అనే ఆలోచనలోనే ఉంటారు. కానీ, నిత్యం మన కళ్లముందు కనిపించే కూరగాయలు, ఆకు కూరలు, అన్ని రకాల పండ్లలో కావాల్సిన పోషకాలు లభిస్తాయి. ముఖ్యంగా మార్కెట్లలో లభించే తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర, బచ్చలి కూరల్లో అనేక పోషకాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని తరచూ తీసుకుంటే కంటి చూపు మెరుగుపడి, ఎముకల్లో సత్తువ పెరగడంతో పాటు, రక్తహీనత వంటి సమస్యలు దూరమైపోతాయి. అలాగే బచ్చలి కూర తరచూ తినడం వల్ల అధిక రక్తపోటు నార్మల్​గా ఉంటుందట. 2020లో జర్నల్ ఆఫ్ మెడిసినల్ ఫుడ్‌లో ప్రచురించిన అధ్యయనంలో.. తేలికపాటి రక్తపోటును బచ్చలి తగ్గిస్తుందని పేర్కొన్నారు.

అందుకే.. మీకోసం బచ్చలి కూర రెసిపీ తీసుకొచ్చాం. అదే.. బచ్చలి పచ్చడి. ఈ పచ్చడి వేడివేడి అన్నం, చపాతీల్లోకి అద్భుతంగా ఉంటుంది. మరి, నిమిషాల్లోనే ఈ బచ్చలి పచ్చడి ఎలా చేయాలి? తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • ఎండుమిర్చి-6
  • బచ్చలి కూర-3 కప్పులు
  • కరివేపాకు-2 రెమ్మలు
  • పల్లీలు-కప్పు
  • వెల్లుల్లి రెబ్బలు-8
  • ఉప్పు రుచికి సరిపడా
  • నిమ్మకాయంత సైజంత​ చింతపండు
  • నూనె

తాలింపు కోసం:

  • నూనె - తగినంత
  • ఆవాలు - అర టీస్పూన్
  • జీలకర్ర - అర టీస్పూన్
  • శనగపప్పు - అర టీస్పూన్
  • మినప్పప్పు - అర టీస్పూన్
  • ఎండుమిర్చి - 2
  • కరివేపాకు- 2 రెమ్మలు
  • వెల్లుల్లి రెబ్బలు-4

తయారీ విధానం :

  • ముందుగా బచ్చలి కూర ఆకులను తెంపి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే చింతపండు నీటిలో కాసేపు నానబెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయాలి. నూనె వేడయ్యాక ఎండుమిర్చి వేసి వేపాలి. (పచ్చడి కోసం మీరు పచ్చిమిర్చి కూడా ఉపయోగించవచ్చు)
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో అడ్జస్ట్​ చేసుకుని కాసేపు వేపండి. ఆపై జీలకర్ర, కరివేపాకులు వేసుకుని కలిపి స్టౌ ఆఫ్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు అదే కడాయిలో పల్లీలు వేయండి. ఇవి కాస్త దోరగా వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
  • మరొక కడాయిలో బచ్చలి కూర వేసుకుని దగ్గరికి అయ్యే వరకూ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు ఎండుమిర్చి మిశ్రమం, పల్లీలు చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, కాస్త నానబెట్టుకున్న చింత పండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకుని బరకగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఆ తర్వాత ఉడికించుకున్న బచ్చలి కూర వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు బచ్చలి కూర పచ్చడి తాలింపు కోసం స్టౌపై గిన్నె పెట్టండి. ఇందులో నూనె పోసి వేడి చేయండి. ఆపై ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, పసుపు, ఎండుమిర్చి, కరివేపాకులు, వెల్లుల్లి రెబ్బలు వేసి తాలింపు సిద్ధం చేయండి.
  • ఈ తాలింపును పచ్చడిలో కలుపుకుంటే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన బచ్చలి కూర పచ్చడి మీ ముందుంటుంది. నచ్చితే ఓ సారి ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

ఆరోగ్యానికి మేలు చేసే "మునగాకు ఫ్రై" - పదే పది నిమిషాల్లో చేసుకోండిలా! - టేస్ట్ అద్భుతం!

"కాకరకాయ" కూరను ఇలా వండి చూడండి - చేదు అస్సలే ఉండదు - వద్దన్నవారే ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.