ETV Bharat / offbeat

ఈ గరిటెతో ఇక ఆయిల్ మీపైన పడదు! - ఈ లేటెస్ట్​ "కిచెన్​ టూల్స్"తో ఎంతో ఉపయోగం! - SMART KITCHEN TOOLS

- వంటింట్లో మహిళల పనులు మరింత ఈజీ చేసే వస్తువులు - ఒక్కో దానితో ఒక్కో ఉపయోగం!

Kitchen Tools
Latest Kitchen Tools (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 7, 2024, 10:46 AM IST

Latest Kitchen Tools : మారుతున్న కాలానికి అనుగుణంగా మనం వంటింట్లో ఉపయోగించే వస్తువుల్లో చాలా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని స్మార్ట్‌ కిచెన్‌ వస్తువులు మీ పనుల్ని మరింత సులువు చేస్తాయి. అవేంటో మీరు ఓసారి చూడండి..

Filter spoon with clip
Filter spoon with clip (ETV Bharat)

నూనె చేతిపై పడకుండా : పూరీ, పకోడీ, చికెన్​, బజ్జీల వంటి డీప్‌ఫ్రై వంటకాలు జాగ్రత్తగా చేయాలి. నూనెలో నుంచి వాటిని బయటకు తీసే టైమ్​లో కొన్నిసార్లు జారి అందులోనే పడిపోతుంటాయి. దానివల్ల ఆయిల్​ చింది మీద పడి బొబ్బలెక్కే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి భయం లేకుండా ఉండడానికి కిచెన్​లోకి 'ఫిల్టర్‌ స్పూన్‌ విత్‌ క్లిప్‌' (Filter spoon with clip) ఉపయోగపడుతుందని చెబుతున్నారు నిపుణులు. దీనికి స్టీల్‌ జల్లెడ, స్పూను రెండూ ఎటాచ్‌ అయి ఉంటాయి. జల్లెడతో వంటకాలను బయటకు తీసి, స్పూన్‌తో పడిపోకుండా పట్టుకోవచ్చు. దీంతో నూనె చిందుతుందన్న భయం ఇకమీదట ఉండదు.

Crusher for ginger and garlic
Crusher for ginger and garlic (ETV Bharat)

అల్లం, వెల్లుల్లి కోసం (Crusher for ginger and garlic): మనందరి ఇళ్లలో నిమ్మకాయల నుంచి రసం తీయడానికి క్రషర్‌ ఉంటుంది. అయితే.. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి కోసం ఓ క్రషర్‌ వచ్చేసింది. దీంతో అప్పటికప్పుడు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలనూ పేస్టులాగా చేసుకోవచ్చు.

Portable gas stove
Portable gas stove (ETV Bharat)

పోర్టబుల్‌ గ్యాస్‌ స్టవ్‌ (Portable gas stove): దాదాపు మన ఇళ్లలో రెండు, మూడు బర్నర్స్ ఉన్న స్టవ్‌లు వాడుతుంటాం. కొందరికి అలాంటివి అవసరం లేకపోవచ్చు. ఇలాంటి వారికి 'పోర్టబుల్‌ గ్యాస్‌ స్టవ్‌' బాగా ఉపయోగపడుతుంది. దీనికి మన వద్ద ఉండే సిలిండర్‌ను ఫిక్స్​ చేసి వాడుకోవచ్చు. లేకపోతే.. దానికే ఓ చిన్న సిలిండర్‌ ఇన్‌బిల్ట్‌గా వస్తుంది. పోర్టబుల్‌ కాబట్టి, విహారయాత్రలు, క్యాంపింగ్‌ లాంటి వాటికి వెళ్లినప్పుడు దీన్ని మనతో ఈజీగా తీసుకెళ్లొచ్చు. ట్రిప్​లో బయటి ఆహారం అవసరం లేకుండా మనమే వండుకోవచ్చు.

Vegetable Pot Set
Vegetable Pot Set (ETV Bharat)

ఒకేసారి ఉడికించుకోవచ్చు : బంగాళదుంపలు, పాస్తా, బఠాణీలు, నూడుల్స్‌ లాంటివి ఒకేసారి ఉడికించుకోవడం కుదరదు. ఒక్కోదాన్ని విడివిడిగా ఉడికించుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా.. ఒకేసారి రెండు, మూడు రకాల కూరగాయలు, గింజలను ఉడికించుకోవడానికి ఈ 'వెజిటెబుల్‌ పాట్‌ సెట్‌' (Vegetable Pot Set) చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలో చిల్లులు ఉన్న రెండు మూడు చిన్న చిన్న సిలికాన్‌ బాస్కెట్‌లు వస్తాయి. వాటిలో కూరగాయలు, ఇతర పదార్థాలు పెట్టి, వీటన్నింటినీ ఓ స్టీల్‌ గిన్నెలో ఉంచి ఉడికించుకుంటే సరిపోతుంది.

Steel rolling balls stickers
Steel rolling balls stickers (ETV Bharat)

ఈజీగా జరపడానికి : మిక్సీ, కుక్కర్, కాఫీ మేకర్‌.. వంటి వస్తువులను వంట చేసే టైమ్​లోనో, క్లీన్​ చేసేటప్పుడో ఒక్కోసారి అటూ ఇటూ కదపాల్సి వస్తుంటుంది. ఇలా చేస్తే గట్టు మీద గీతలు కూడా పడుతుంటాయి. ఎత్తి పక్కన పెట్టాలన్నా కాస్త బరువుగా అనిపిస్తుంది. ఆ ఇబ్బందిని తొలగించడానికి ఈ 'స్టీల్‌ రోలింగ్‌ బాల్స్‌ స్టిక్కర్లు' (Steel rolling balls stickers) మీకు ఉపయోగపడతాయి. వీటికి ఉన్న కవర్‌ను తీసేసి వస్తువు అడుగుభాగాన అంటించాలి. స్టిక్కర్లకు ఉన్న రోలింగ్‌ బాల్స్‌ 360 డిగ్రీ కోణాల్లో తిరుగుతాయి. దీంతో, వస్తువును తేలిగ్గా అటూ ఇటూ జరపొచ్చు.

ఇవి కూడా చదవండి :

ఉల్లిపాయల కటింగ్​, ఉడికించినవి​ వడకట్టడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఈ టూల్స్ ఉంటే ఆ పని చాలా ఈజీ!

చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్​లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.