IRCTC Koffee With Karnataka Tour Package: దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన కూర్గ్ చూసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చింది. కూర్గ్ అందాలతోపాటు ఇతర ప్రకృతి అందాలను కూడా చూడొచ్చు. దేవాలయాలను సైతం దర్శించుకోవచ్చు. మరి, ఈ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏయే ప్రదేశాలు చూడొచ్చు? వంటి పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కాఫీ విత్ కర్ణాటక(Koffee with Karnataka) పేరుతో ఐఆర్సీటీటీ ప్యాకేజీ తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్‌ను ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు..6 పగళ్లు ఉంటుంది. ఈ ప్యాకేజీలో బేలూర్, కూర్గ్, హళేబీడు, మైసూర్‌లోని ప్రముఖ ఆలయాలతో పాటు ప్రకృతి అందాలను వీక్షించవచ్చు. ప్రయాణ వివరాలు చూస్తే..
మొదటి రోజు: హైదరాబాద్ నుంచి బెంగుళూరుకు ఉదయం 6:45గంటలకు ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. బెంగళూరు ఎయిర్ పోర్టుకు రీచ్ అయిన తర్వాత అక్కడ పికప్ చేసుకుని బస్సులో మైసూర్‌కి తీసుకెళ్తారు. మధ్యాహ్నానికి మైసూర్ చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు. ఆ తర్వాత మైసూర్ ప్యాలెస్, బృందావన్ గార్డెన్స్ సందర్శిస్తారు. రాత్రికి మైసూర్‌లో వసతి ఉంటుంది.
రెండో రోజు: ఉదయం హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత శ్రీరంగపట్నం ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత మెల్కోటేకి బయలుదేరతారు. అక్కడ చెలువనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం సోమనాథపుర, తలకాడు ఆలయాలకు బయలుదేరతారు. అక్కడ దర్శనం అనంతరం తిరిగి సాయంత్రానికి మైసూర్ చేరుకుంటారు. రాత్రికి మైసూర్‌లోనే బస చేస్తారు.
హైదరాబాద్ టూ వయనాడ్ - అతి తక్కువ ధరకే ఐఆర్సీటీసీ స్పెషల్ ప్యాకేజీ!
మూడో రోజు: బ్రేక్‌ఫాస్ట్ తర్వాత కూర్గ్‌కి బయలుదేరతారు. ఈ మార్గంలో టిబెటన్ మొనాస్టరీ, నిసర్ఘధామా సందర్శించవచ్చు. ఆ తర్వాత కూర్గ్ చేరుకుని హోటల్‌లో చెకిన్ అవుతారు. మధ్యాహ్నం రాజా సీట్‌ను సందర్శిస్తారు. రాత్రికి కూర్గ్‌లో బస ఉంటుంది.
నాలుగో రోజు: హోటల్‌లో టిఫెన్ తర్వాత తాలా కావేరికి వెళ్తారు. కావేరి బర్త్ ప్యాలెస్, బాఘమండల ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కూర్గ్‌కు తిరిగి వెళ్తారు. రాత్రికి కూర్గ్‌లో బస చేస్తారు.
ఐదో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి సకలేష్‌పూర్‌కి బయలుదేరతారు. మంజీరాబాద్ కోటను సందర్శిస్తారు. మధ్యాహ్నం హాసన్‌కు బయలుదేరతారు. అక్కడ హోటల్‌లో దిగి, ఆ రాత్రికి హాసన్‌లోనే బస చేస్తారు.
ఆరో రోజు: హోటల్‌లో బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి బేలూర్కి బయలుదేరతారు. అక్కడ చెన్నకేశవ ఆలయాన్ని సందర్శిస్తారు. తర్వాత హళేబీడుకి వెళ్లి హోయసలేశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. మధ్యాహ్నం బెంగళూరుకు వస్తారు. సాయంత్రానికి బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తారు. ఫ్లైట్ ఎక్కి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
ధర వివరాలు చూస్తే:
- ఈ ప్యాకేజీకి సంబంధించిన ధర వివరాలు(కంఫర్ట్) చూస్తే.. సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.38,000, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.29,600, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.27,750గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.23,950, విత్ అవుట్ బెడ్ అయితే రూ.19,550గా నిర్ణయించారు.
- 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.16,400 చెల్లించాలి.
ప్యాకేజీలో ఇవి ఉంటాయి:
- హైదరాబాద్ నుంచి బెంగళూరు, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు విమాన టికెట్లు
- 5 రాత్రులు హోటల్‌లో బస
- 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు ఉంటాయి. లంచ్ ఏర్పాట్లు ప్రయాణికులే చూసుకోవాలి.
- పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు ప్యాకేజీని బట్టి బస్సు ఏర్పాటు చేస్తారు.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. గైడ్ అందుబాటులో ఉంటారు.
- ప్రస్తుతం ఈ టూర్ సెప్టెంబర్ 27 నుంచి స్టార్ట్ అవుతుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
రాజస్థాన్ కోటల రాజసం చూస్తారా? - తక్కువ ధరలోనే IRCTC అద్భుతమైన ప్యాకేజీ!
IRCTC దివ్యమైన తిరుమల ప్యాకేజీ - శ్రీవారి స్పెషల్ దర్శనంతోపాటు మరెన్నో!