ETV Bharat / offbeat

సూపర్ కిచెన్ టిప్స్ : వీటిని ఫాలో అయ్యారంటే - వంటిళ్లు మెరవడంతో పాటు పని కూడా ఎంతో ఈజీ! - KITCHEN TIPS

మహిళలు వంటింట్లో ఈ టిప్స్ ఫాలో అవ్వండి - టైమ్ ఆదా అవ్వడమే కాదు కిచెన్ తళుక్కున మెరిసిపోతుంది!

KITCHEN HACKS
Useful Kitchen Tips (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Oct 31, 2024, 12:39 PM IST

Useful Kitchen Tips in Telugu : మహిళలు ఇంట్లో ఉంటే ఎక్కువ సేపు గడిపే స్థలం ఏదంటే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది వంటగది. మరి, అంతటి ప్రాధాన్యం ఉన్న చోటు పరిశుభ్రంగా, ఆహ్లాదంగా ఉండాలి. అలా కాకుండా కిచెన్ గందరగోళంగా ఉంటే చికాకుగా అనిపిస్తుంది. అంతేకాదు దాని ప్రభావం వండే ఆహార పదార్థాలపైనా పడుతుంది. కాబట్టి వంటిల్లును ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలంటున్నారు నిపుణులు. అంతేకాదు, వంటిల్లు ఆహ్లాదంగా ఉండి, పని ఒత్తిడి దరిచేరకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు సూచిస్తున్నారు. ఈ టిప్స్ ఫాలో అవ్వడం ద్వారా సమయం ఆదా అవడంతో పాటు శ్రమ తగ్గి కాస్త విశ్రాంతి కూడా దొరుకుతుందని చెబుతున్నారు. మరి, ఆ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • వంట గదిలో డైలీ వాడే పాత్రల్ని ఓ చోట, ఏదైనా సందర్భమో, కార్యక్రమమో ఉన్నప్పుడు వినియోగించేవి మరో చోట సెట్ చేసుకోవాలి. తద్వారా టైమ్ ఆదా అవ్వడమే కాకుండా కిచెన్​ నీట్​గా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. లేదంటే కనిపించిందల్లా తీసి వాడేస్తుంటే, అనవసరంగా ఎక్కువ పాత్రలు క్లీన్ చేయాల్సి వస్తుంది. పైగా కడిగాక వాటిని మళ్లీ సర్దుకోవడం కూడా ఇబ్బందే అంటున్నారు.
  • అలాగే, వంటింటి నిత్యావసరాలు పప్పులు, మసాలా దినుసులు, నూనెలు, పాస్తాలు, సాస్‌లు, నట్స్‌ వంటి వాటిని పారదర్శకంగా ఉండే సీసాల్లో వేసుకోవాలి. అలాంటి సీసాలు లేకపోతే స్టీల్ బాక్సుల్లో వేసుకున్నా లేబులింగ్‌ చేసుకుంటే వెతక్కుండా అవసరానికి సులువుగా దొరుకుతాయంటున్నారు.
  • కిచెన్​లో చాలా మంది కనిపించినవల్లా ఫ్రిజ్‌ల్లో కుక్కేస్తారు. అయితే రిఫ్రిజిరేటర్​ని​ అందంగా సర్దుకోవడవమూ ఓ కళ. మార్కెట్‌లో లభ్యమయ్యే ఫ్రిజ్‌ మ్యాట్స్‌ని అరల్లో వేసి ఆహార పదార్థాలు పెడితే మరకలు పడకుండా ఉంటాయి. అదేవిధంగా స్టోర్‌ బ్యాగ్‌లు, బాక్సుల్లో ఆహార పదార్థాలు సర్దితే ఈజీగా తీసుకోవచ్చు. పైగా పాడవకుండానూ ఉంటాయని చెబుతున్నారు.
  • ఓ చిన్న బ్లాక్‌ బోర్డ్‌ లేదంటే వైట్‌ నోట్‌బుక్‌ వంటగదిలో ఏదో ఒక చోట వేలాడదీయండి. ఎప్పుడైనా సరకులు నిండుకుంటే వెంటనే అందులో నమోదు చేయండి. లేదా అక్కడి అవసరాలను తర్వాత గుర్తు చేసుకోవాలనుకున్నా దానిలో రాసుకోండి. ఇక్కడే గ్యాస్‌ తెచ్చిన తేదీ, వాటర్‌ ఫిల్టర్‌ మార్చిన డేట్‌ ఇలా చాలా విషయాలను జ్ఞాపకం తెచ్చుకోవచ్చంటున్నారు నిపుణులు.

ఇవి కూడా..

  • రాత్రి పనులన్నీ అయిపోయాక స్టౌ, ప్లాట్‌ఫాం శుభ్రం చేసేస్తే మార్నింగ్ లేవగానే హాయిగా కాఫీ, టీ పెట్టేసుకోవచ్చు. అలాగే కూరగాయల తొక్కలు ఎప్పటిదప్పుడు డస్ట్​ బిన్‌లో పాడేస్తే సమస్యే ఉండదు. ఫలితంగా కిచెన్​ శుభ్రంగా కనిపిస్తుందంటున్నారు.
  • తాలింపు వేసేటప్పుడు స్టౌ మీద నూనె చిందడం మామూలే. దాన్ని వెంటనే టిష్యూ పేపర్​తో తుడి చేస్తే శుభ్రంగా ఉంటుంది. అలాగే ప్లాట్‌ఫాం మీద నీళ్లు, పాలు, నూనె వంటివి పడితే మైక్రో ఫైబర్‌ స్పాంజితో తుడిస్తే అద్దంలా ఉంటుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ఉల్లిపాయల కటింగ్​, ఉడికించినవి​ వడకట్టడానికి ఎక్కువ టైమ్ పడుతోందా? - ఈ టూల్స్ ఉంటే ఆ పని చాలా ఈజీ!

చుక్క లేకుండా నిమ్మరసం పిండొచ్చు- సెకన్​లో రెండు కజ్జీకాయలు చేయచ్చు- ఈ కిచెన్ టూల్స్ చూశారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.