IRCTC National Heritage of North India Tour: ఉత్తర భారతదేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను చుట్టేసి రావాలని ఉందా? కాస్ట్ గురించి ఆలోచిస్తున్నారా? నో టెన్షన్. తక్కువ ధరలోనే పలు ప్రదేశాలు చూసేందుకు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. మరి ఆ ప్యాకేజీ ఎన్ని రోజులు? ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
నేషనల్ హెరిటేజ్ ఆఫ్ నార్త్ ఇండియా పేరుతో IRCTC టూర్ ప్యాకేజీ ప్రకటించింది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా దీనిని ఆపరేట్ చేస్తున్నారు. ఈ టూర్ మొత్తం 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ద్వారా శ్రీకృష్ణ మ్యూజియం, లోటస్ టెంపుల్, తాజ్‌మహల్ వంటి పలు ప్రదేశాలు విజిట్ చేయవచ్చు.
ప్రయాణ వివరాలు ఇవే:
- మొదటి రోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నానికి అమృత్సర్ చేరుకుంటారు. ఎయిర్‌పోర్ట్‌లో ఫార్మాలిటీస్ పూర్తి అయిన తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అనంతరం లంచ్ ఉంటుంది. ఆ తర్వాత వాఘా బోర్డర్ విజిట్ చేస్తారు. రాత్రికి అమృత్‌సర్‌లో స్టే ఉంటుంది.
- రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అనంతరం గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్ విజిట్ చేస్తారు. అక్కడి నుంచి జలంధర్ బయలుదేరుతారు. అక్కడ జంగ్ ఎ ఆజాది మెమోరియల్ కమ్ మ్యూజియం సందర్శిస్తారు. సాయంత్రం చండీగఢ్‌కు స్టార్ట్ అవుతారు. హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
హైదరాబాద్ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!
- మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చండీగఢ్‌లోని రాక్ గార్డెన్ విజిట్ చేస్తారు. మధ్యాహ్నం సుక్నా సరస్సు సందర్శిస్తారు. సాయంత్రం చుట్టు పక్కల ప్రాంతాల్లో షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రికి చండీగఢ్‌లో బస ఉంటుంది.
- నాలుగో రోజు టిఫెన్ తిన్న తర్వాత కురుక్షేత్రకు బయలుదేరుతారు. అక్కడ శ్రీకృష్ణ మ్యూజియం సందర్శిస్తారు. మధ్యాహ్నం దిల్లీ స్టార్ట్ అవుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
- ఐదో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్ విజిట్ చేస్తారు. సాయంత్రం అక్షరధామ్ సందర్శిస్తారు. ఆ రాత్రి కూడా దిల్లీలోనే స్టే చేయాలి.
- ఆరో రోజు ఉదయం హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ అనంతరం ఆగ్రా బయలు దేరుతారు. అక్కడ తాజ్‌మహల్ చూస్తారు. సాయంత్రం మథుర బయలుదేరుతారు. అక్కడ ప్రేమ్ మందిర్ దర్శిస్తారు. హోట్‌లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు.
- ఏడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత ఇస్కాన్ టెంపుల్, శ్రీకృష్ణ జన్మభూమిని దర్శించుకుంటారు. సాయంత్రం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు చేరుకోవడంతో టూర్ పూర్తవుతుంది.
అజంతా, ఎల్లోరా అందాలను ఆస్వాదించాలనుకుంటున్నారా? - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ!
ప్యాకేజీలో ఉండేవి ఇవే:
- విమాన టికెట్లు(హైదరాబాద్ - అమృత్ సర్/దిల్లీ - హైదరాబాద్)
- హోటల్లో వసతి సౌకర్యం
- 6 బ్రేక్‌ఫాస్ట్‌లు, 6 డిన్నర్స్, 1 లంచ్ ఉంటుంది.
- లోకల్ ప్రయాణాలకు AC బస్సు సౌకర్యం ఉంటుంది.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
ధరలు చూస్తే:
- కంఫర్ట్‌లో సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.49,700, డబుల్ ఆక్యూపెన్సీకి రూ.38వేలు, ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.35,500గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ.28,800, విత్ అవుట్ బెడ్ అయితే రూ.27,550 చెల్లించాలి.
- 2 నుంచి 4 సంవత్సరాల చిన్నారులకు విత్ అవుట్ బెడ్ అయితే రూ.20,700గా నిర్ణయించారు.
- ప్రస్తుతం ఈ టూర్ అక్టోబర్ 4 నుంచి అందుబాటులో ఉంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
రాజస్థాన్ కోటల రాజసం చూసి తీరాల్సిందే - తక్కువ ధరకే IRCTC సూపర్ ప్యాకేజీ!