ETV Bharat / offbeat

మీకో గుడ్​న్యూస్​ - వీకెండ్​లో సాగర్​ టూర్​ - ఎంజాయ్​ చేయండి ఇలా - Nagarjuna Sagar Tour with Low Cast - NAGARJUNA SAGAR TOUR WITH LOW CAST

Telangana Tourism: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది వాటర్​ ఫాల్స్​, డ్యామ్​లు చూడాలని అనుకుంటుంటారు. మరి మీరు కూడా ఆ లిస్ట్​లో ఉన్నారా? అయితే మీకో గుడ్​న్యూస్​. తెలంగాణ టూరిజం నాగార్జున సాగర్​ చూసేందుకు ప్యాకేజీను ప్రకటించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

Telangana Tourism Nagarjuna Sagar Tour
Telangana Tourism Nagarjuna Sagar Tour (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 31, 2024, 8:16 PM IST

Telangana Tourism Nagarjuna Sagar Tour : ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా డ్యామ్​లు, కాలువలు జలకళను సంతరించుకున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది వాటర్​ ఫాల్స్​, డ్యామ్​లు చూడాలని అనుకుంటుంటారు. ఫ్యామిలీతో కలిసి వెళ్లేలా ప్లాన్​ చేసుకుంటారు. ముఖ్యంగా వీకెండ్స్​లో ఎక్కువ మంది వీటిని సందర్శించడానికి వెళ్తుంటారు. మరి మీరు కూడా అలానే ఆలోచిస్తున్నారా? అయితే మీకు తెలంగాణ టూరిజం గుడ్​న్యూస్​ చెబుతోంది. నాగార్జున సాగర్​ చూసేందుకు ఓ ప్యాకేజీని ప్రకటించింది. మరి ఈ ప్యాకేజీలో ఏఏ ప్రాంతాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

టూర్​ ప్యాకేజీ ఇదే: హైదరాబాద్‌ - నాగార్జునసాగర్‌ - హైదరాబాద్‌ పేరుతో తెలంగాణ టూరిజం ప్యాకేజీ ప్రకటించింది. కేవలం ఒక్క రోజులోనే టూర్‌ ముగిసేలా ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తున్నారు. ఉదయం వెళ్లి మళ్లీ రాత్రి వరకు ఇంటికి చేరుకోవచ్చు. ప్రతీ శని, ఆదివారం రోజుల్లో ఈ టూర్​ ఉంటుంది. హైదరాబాద్​ నుంచి బస్సు జర్నీ ద్వారా దీనిని నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్​ టూ అయోధ్య వయా వారణాసి - రూ.16వేలకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! - IRCTC Ganga Sarayu Darshan Package

ప్రయాణం ఎలా ఉంటుందంటే:

  • ప్రతి శనివారం, ఆదివారం ఉదయం 7.30 గంటలకు హైద‌రాబాద్ పర్యాటక భవన్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
  • ఉదయం 8 గంటలకు బషీర్​బాగ్​ చేరుకుని అక్కడి నుంచి సాగర్​కు బస్సు జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • ఉదయం 11:30 గంటలకి నాగార్జున సాగర్‌కు చేరుకుంటారు.
  • ఉదయం 11:40 గంట‌ల‌ నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసిన బుద్ధవనం ప్రాజెక్ట్​ను సందర్శిస్తారు.
  • ఇక ఆ తర్వాత ఒంటి గంట నుంచి 2 గంటల వరకు లంచ్‌ బ్రేక్‌ ఉంటుంది.
  • ఆ తర్వాత మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు నాగార్జునకొండకు లాంచీలో ప్రయాణం ఉంటుంది. అక్క‌డ నాగార్జున సాగర్ మ్యూజియం, నాగార్జునకొండ సందర్శిస్తారు. బోటింగ్​ కూడా చేయొచ్చు.
  • సాయంత్రం 4 గంటలకు నాగార్జున సాగర్ డ్యామ్​ను విజిట్​ చేస్తారు.
  • 5 గంట‌ల‌కు నాగార్జున సాగర్ నుంచి రిటర్న్​ జర్నీ స్టార్ట్​ అవుతుంది.
  • రాత్రి 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో సాగర్​ టూర్ పూర్తవుతుంది.

ప్యాకేజీ వివరాలు..

  • పెద్దలకు రూ. 800, చిన్నారులకు రూ. 640గా టికెట్​ ధరలు నిర్ణయించారు. నాన్‌ ఏసీ బస్సులో ప్రయాణం ఉంటుంది.
  • బోటింగ్‌, ఎంట్రీ, భోజనం వంటివి టూర్‌ ప్యాకేజీలో కవర్ కావు. ప్రయాణికులే వీటిని భరించాలి.
  • ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

తెలంగాణ టూరిజం వన్డే ప్యాకేజీ - కేవలం రూ.1500 టికెట్​తో జోగులాంబ, అంజన్న దర్శనం, ఇంకా మరెన్నో! - Telangana Tourism Packages

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.