ETV Bharat / offbeat

ఎప్పుడూ రొటీన్ బిర్యానీయేనా? - ఈసారి అద్దిరిపోయే మొఘలాయ్ స్టైల్​లో చేసుకోండి! - PANEER MUGHLAI DUM BIRYANI RECIPE

బిర్యానీ ఏక్​ దమ్​ రెసిపీ. కానీ.. ఎప్పుడూ ఒకే స్టైల్లో తింటే రొటీన్ అవుతుంది. అందుకే.. ఓ సారి వెరైటీగా మొఘలాయ్ స్టైల్​లో ట్రై చేయండి.. అద్దిరిపోతుందంతే!

Paneer Mughlai Dum Biryani Recipe
Paneer Mughlai Dum Biryani Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 8, 2024, 10:53 AM IST

Paneer Mughlai Dum Biryani Recipe: బిర్యానీ అనగానే నాన్​ వెజ్​ ప్రియుల నోట్లో లాలాజలం ఊరుతుంది. అయితే.. ఎప్పుడూ రొటీన్​ బిర్యానీ తింటే అంత థ్రిల్​ ఉండదు. అందుకే.. ఈసారి వెరైటీగా పనీర్ బిర్యానీ ట్రై చేయండి. అది కూడా మాములు స్టైల్​లో కాదు, మొఘలాయి స్పెషల్ స్టైల్లో! మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

మసాలా కోసం కావాల్సిన పదార్థాలు

  • రెండు యాలకలు
  • ఒకటిన్నర అంగుళాల దాల్చిన చెక్క
  • రెండు లవంగాలు
  • ఒక నల్ల యాలక
  • ఒక టీ స్పూన్ షాజీరా
  • అర టేబుల్ స్పూన్ సోంపు

పనీర్ కోసం కావాల్సిన పదార్థాలు

  • పావు కప్పు నెయ్యి
  • అర అంగుళం దాల్చిన చెక్క
  • ఒక జాపత్రి
  • ఒక నల్ల యాలక
  • రెండు యాలకలు
  • ఒక బిర్యానీ ఆకు
  • ఒక టీ స్పూన్ షాజీరా
  • అర కప్పు ఉల్లిపాయ ముక్కలు
  • ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్
  • రుచికి సరిపడా ఉప్పు
  • అర కప్పు చిలికిన పెరుగు
  • 6 పచ్చిమిరపకాయలు
  • 250 గ్రాముల పనీర్ ముక్కలు
  • ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్క

బిర్యానీ కోసం కావాల్సిన పదార్థాలు

  • 2 కప్పుల బాస్మతి బియ్యం
  • మూడు అంగుళాల దాల్చిన చెక్క
  • రెండు నల్ల యాలకలు
  • అర టేబుల్ స్పూన్ షాజీరా
  • 5 లవంగాలు
  • 4 యాలకలు
  • ఒక బిర్యానీ ఆకు
  • 3 పచ్చిమిరపకాయలు
  • రెండున్నర టేబుల్ స్పూన్ల ఉప్పు
  • 4 టేబుల్ స్పూన్ల నెయ్యి
  • అర కప్పు పాలు
  • కొద్దిగా కొత్తిమీర
  • కొద్దిగా పుదీనా

తయారీ విధానం..

  • ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ గిన్నెలో యాలకలు, దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల యాలక, షాజీరా, సోంపు వేసి లో ఫ్లేమ్​లో వేయించుకోవాలి.
  • మసాలా దినుసులు మంచి వాసన వస్తున్న సమయంలో మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
  • ఇప్పుడు బిర్యానీ గిన్నెలో నెయ్యి పోసి వేడిచేసుకుని ఇందులోనే దాల్చిన చెక్క, జాపత్రి, నల్ల యాలక, యాలకలు, బిర్యానీ ఆకు, షాజీరా వేసి వేయించుకోవాలి.
  • ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి లేత బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించుకోవాలి.
  • అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి.. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న గరం మసాలా, పావు కప్పు నీళ్లు, ఉప్పు వేసి నెయ్యి పైకి తేలేంతవరకూ వేయించుకోవాలి.
  • నెయ్యి పైకి తేలే సమయంలో చిలికిన పెరుగు వేసి మసాలాలో కలిసిపోయేంత వరకూ కలపాలి.
  • ఇప్పుడు పచ్చిమిరకాయల పేస్ట్​ వేసి కాసేపు వేయించుకుని.. అనంతరం పనీర్ ముక్కలు, అర కప్పు నీళ్లు పోసి 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్​లో ఉడికించుకోవాలి.
  • ఆ తర్వాత లో ఫ్లేమ్​లోకి మార్చి బిర్యానీ గిన్నె మధ్యలో ఓ చిన్న కప్పు తీసుకుని అందులో ఎర్రగా కాల్చిన బొగ్గు లేదా కొబ్బరి పెంకు, రెండు యాలకలు, నెయ్యి వేసి పొగ బయటకు పోకుండా 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచాలి.
  • ఇలా చేస్తే స్మోకీ ఫ్లేవర్ అంతా గ్రేవీకి పట్టుకుని టేస్ట్ సూపర్​గా ఉంటుంది. ఆ తర్వాత మూత తీసి కప్పును బయటకు తీసి బిర్యానీ గిన్నెను పక్కకు పెట్టుకోవాలి.
  • ఇప్పుడు బిర్యానీ కోసం ఓ గిన్నెలో రెండు లీటర్ల నీటిని హై ఫ్లేమ్​లో పెట్టి మరిగించుకోవాలి.
  • ఇందులో దాల్చిన చెక్క, నల్ల యాలకలు, షాజీరా, లవంగాలు, యాలకలు, బిర్యానీ ఆకు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్​లో మరగనివ్వాలి. (అవసరమైతే టేస్ట్ చేసి ఉప్పు కలుపుకోవచ్చు)
  • మరుగుతున్న నీటిలో కొత్తిమీర, పుదీనా వేసి కాసేపయ్యాక శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి.
  • ఇలా 80శాతం ఉడికించుకున్న తర్వాత ఆ బియ్యాన్ని మసాలాలతో జల్లితో వడకట్టుకుని పనీర్​పై వెదజల్లాలి.
  • ఇప్పుడు బిర్యానీ గిన్నెను స్టౌపై పెట్టుకుని దీనిపైనే నెయ్యి, పాలను అన్నంపై చల్లుకుని మూత పెట్టి హై ఫ్లేమ్​లో 4 నిమిషాలు.. లో ఫ్లేమ్​లో 7 నిమిషాలు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి సుమారు 30 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే అద్దిరిపోతుంది.

దసరా స్పెషల్ : బూందీతో ఎప్పుడూ లడ్డూనేనా! - ఈసారి కొత్తగా మిఠాయి చేసుకోండి! - Boondi Mithai Recipe in Telugu

తెలంగాణ స్టైల్ "కోడిగుడ్డు వెల్లుల్లి కారం" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా - రెండు రోజులైనా ఫ్రెష్​గా ఉంటుంది! - Kodiguddu Karam Recipe

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.