ETV Bharat / offbeat

ఇండిపెండెన్స్​ డే స్పెషల్: మూడు రంగుల్లో దోశ, ఇడ్లీ - ఇలా ప్రిపేర్ చేసేయండి! - Tricolour Breakfast Recipe

author img

By ETV Bharat Telangana Team

Published : Aug 14, 2024, 5:07 PM IST

How To Make Tricolour Idli and Dosa Recipe : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సరికొత్త బ్రేక్​ఫాస్ట్​ ప్రిపేర్ చేసే ఆలోచనలో ఉన్నారా? అయితే.. మీ కోసమే ఈ రెసిపీ. జెండా రంగులో ఇడ్లీ, దోశ ప్రిపేర్ చేసేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా ఈ తిరంగా బ్రేక్​ఫాస్ట్​ ఆరగిస్తారు. మరి.. వీటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.

Tricolour Dosa Recipe
How To Make Tricolour Dosa Recipe (ETV Bharat)

How To Make Tricolour Dosa Recipe : దేశం మొత్తం స్వాతంత్య్ర దినోత్స‌వ వేడుక‌లను జరుపుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ జెండా పండుగ వేళ ఇంట్లో సరికొత్త వంటలు ప్రిపేర్ చేస్తే.. పిల్లలు ఎంతో ఆనందంగా ఆరగిస్తారు. స్కూల్లో ఇచ్చే మిఠాయిలకు అదనంగా.. అమ్మ పెట్టే స్పెషల్ డిష్ వారిలో మరింత ఉత్సాహాన్ని నింపుతుంది. అందుకే.. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే తిరంగా ఇడ్లీ, దోశలను ప్రిపేర్ చేయండి. ఇడ్లీ అంటే ముఖం చిట్లించే వారు కూడా వదలకుండా లాగించేస్తారు. మరి, ఎలా సిద్ధం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

తిరంగా ఇడ్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • ఇడ్లీ పిండి మూడు కప్పులు
  • క్యారెట్​ తురుము- అరకప్పు
  • పాలకూర రసం- అరకప్పు
  • ఉప్పు రుచికి సరిపాడా

తిరంగా ఇడ్లీ తయారు చేయు విధానం :

  • ముందుగా ఇడ్లీ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి.
  • తర్వాత పిండిని మూడు బౌల్స్​లోకి సమానంగా తీసుకోవాలి.
  • ఇప్పుడు నారింజ రంగు కోసం ఒక ఇడ్లీ పిండి బౌల్లో క్యారెట్​ తురుము వేసుకుని కలుపుకోవాలి.
  • అలాగే ఆకుపచ్చ రంగు కోసం మరొక గిన్నెలోని పిండిలో పాలకూర రసం వేసుకుని కలుపుకోవాలి.
  • ఈ మూడు రంగుల పిండిని ఇడ్లీ పాత్రలోకి వేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై ఇడ్లీ పాత్ర పెట్టి అందులో నీళ్లు పోసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ పాత్రలు పెట్టుకుని సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది.
  • ఎంతో రుచికరమైన తిరంగా ఇడ్లీ రెసిపీ రెడీ.

తిరంగా దోశ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు:

  • దోశ పిండి - 3 కప్పులు
  • ఉప్పు రుచికి సరిపడా

నారింజ రంగు కోసం..

  • టమాటా-1
  • క్యారెట్ - 1
  • ఎండుమిర్చి-3

గ్రీన్​ కలర్​ కోసం..

కొత్తిమీర, పూదీన, పచ్చిమిర్చి పేస్ట్​ - అరకప్పు

తిరంగా దోశ తయారీ విధానం:

  • ముందుగా దోశ పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత మూడు గిన్నెలలోకి సమానంగా తీసుకోవాలి.
  • ఇందులో గ్రీన్ కలర్​ కోసం దోశ పిండిలో కొత్తిమీర, పుదీన, పచ్చిమిర్చి పేస్ట్​ వేసి బాగా కలుపుకోవాలి.
  • నారింజ రంగు కోసం మిక్సీలో టమాటా, క్యారెట్​, ఎండుమిర్చిలు వేసుకుని ఫ్యూరీలాగా చేసుకుని.. దీనిని దోశల పిండిలో కలుపుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై దోశ పెనం పెట్టి వేడైనా తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ.. మూడు రంగులు వచ్చే విధంగా దోశ వేసుకోవాలి.
  • దోశను రెండు వైపులా కాల్చుకుంటే సరిపోతుంది. టేస్టీ తిరంగా దోశ రెడీ అయినట్టే!
  • ఈ రెసిపీలు నచ్చితే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి!

ఇవి కూడా చదవండి :

జెండా పండుగ వేళ - మూడు రంగుల్లో నోరూరించే స్వీట్స్​ - ఇలా నిమిషాల్లో తయారు చేయండి!

ఈ స్వీట్లను రిపబ్లిక్ డే రోజు మీ ఆత్మీయులకు అందించారంటే - వావ్‌ అనాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.