How to Make Raw Banana Pulusu With Fish Taste : మాంసాహార ప్రియులు చికెన్, మటన్ తిని బోరు కొట్టిన సమయంలో వారి దృష్టి చేపల మీదకు వెళ్తుంది. చేపలతో పులుసు, కూర, వేపుడు, పచ్చడి, బిర్యాని, పకోడి, ఫిష్ కట్లెట్, ఫింగర్, అపోలో ఫిష్ వేపుడు సహా పలు వంటకాలు చేసుకోవచ్చు. చదువుతుంటేనే నోరు ఉరుతుంది కదూ... ఒక్కసారి రుచి చూస్తే మళ్లీ తినాలనిపిస్తుంది. అయితే చేపల పులుసు చేయాలంటే కచ్చితంగా చేప ముక్కలు ఉండాల్సిందే. కానీ ఇంట్లో చేప ముక్కలు లేకపోయినా అప్పటికప్పుడు రుచికరమైన ఫిష్ పులుసు పెట్టేయొచ్చు. ఏంటీ చేపలు లేకుండా పులుసు పెట్టొచ్చా అని అనుమానం.. అయితే ఈ స్టోరీ చదివి..మీరే చూడండి.
కావాల్సిన పదార్థాలు:
- ధనియాలు - 1 టేబుల్ స్పూన్
- జీలకర్ర - అర టీ స్పూన్
- ఆవాలు - 1 టేబుల్ స్పూన్
- ఉల్లిపాయలు - 2
- పచ్చిమిర్చి -4
- వెల్లుల్లి రెబ్బలు - 10
- అల్లం ముక్క - చిన్నది
- కారం - రుచికి సరిపడా
- ఉప్పు - రుచికి సరిపడా
- పసుపు - కొద్దిగా
- నిమ్మరసం - అర చెంచా
- నూనె - సరిపడా
- మెంతులు - పావు చెంచా
- కరివేపాకు - 3 రెమ్మలు
- టమాటా - 2
- చింతపండు - నిమ్మకాయ సైజంతా
- నీరు - సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా
- బియ్యం కడిగిన నీరు - 2 కప్పులు
- పచ్చి అరటి కాయలు - 2
తయారీ విధానం :
- ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలను మీడియం సైజ్‌లో కట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత చింత పండును నానబెట్టి రసం తీసి పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి.. ధనియాలు, జీలకర్ర, ఆవాలు వేసి దోరగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
- ఇప్పుడే అదే మిక్సీజార్‌లో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఇప్పుడు పచ్చి అరటికాయలను తీసి పై పొట్టును పల్చగా తీసుకోవాలి. ఇప్పుడు వాటిని క్రాస్‌గా కొంచెం మందంగా చేప ముక్కల సైజ్‌లో కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న అరటి కాయ ముక్కను కొద్దిగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నప్పుడు ముక్క చూడటానికి చేప షేప్‌లో ఉంటుంది. ఇలా అన్ని ముక్కలను అలానే చేసుకోవాలి.
- బియ్యం కడిగిన నీళ్లలో కొద్దిగా ఉప్పు వేసి కరిగించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకున్న ముక్కలను అందులో వేసి జిగురు మొత్తం పోయేలా కడిగి మరో సారి మంచి నీటితో శుభ్రం చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. ఇలా అన్ని ముక్కలను క్లీన్ చేసుకోవాలి.
- ఇప్పుడు ఓ చిన్న గిన్నెలో అర స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, చిటికెడు పసుపు, నిమ్మరసం వేసి పేస్ట్‌లాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ పేస్ట్‌ను అరటి ముక్కలకు పట్టించి మూత పెట్టి పావుగంట సేపు పక్కన పెట్టాలి.
వెడ్డింగ్ స్టైల్ క్యాబేజీ 65 - ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే సూపర్ క్రిస్పీ అండ్ టేస్ట్ గ్యారెంటీ!
- ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి దోశ పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె హీటెక్కిన తర్వాత మారినేట్ చేసిన అరటి ముక్కలు పెట్టి రెండు నిమిషాలు కాల్చుకోవాలి.
- ఆ తర్వాత నూనె అప్లై చేసి మరోవైపు తిప్పి మరో రెండు నిమిషాలు కాల్చుకున్న తర్వాత తీసి ప్లేట్లోకి పెట్టుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టి 6 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మెంతులు, కరివేపాకు వేసి వేయించుకోవాలి.
- ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి ఉప్పు, టమాట ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత పసుపు, కారం వేసి ఓ నిమిషం పాటు వేయించాలి. ఆ తర్వాత చింతపండు రసం పోసి పులుపుకు సరిపడా నీళ్లు పోసుకుని మరిగించుకోవాలి.
- నీళ్లు మరుగుతున్నప్పుడు ముందే ప్రిపేర్ చేసుకున్న మసాలా పొడి వేసుకుని కలుపుకోవాలి. ఆ తర్వాత వేయించిన అరటి కాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు వేసి కలిపి మూత పెట్టుకోవాలి. మూత పూర్తిగా కవర్ అయ్యేలా కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి పెట్టుకుని మంటను సిమ్‌లో పెట్టి ఓ 10 నిమిషాలు పాటు ఉడికించుకోవాలి.
- ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి దింపేసుకుంటే సరి. చేపలే అవసరం లేని చేపల పులుసు రెడీ. దీని టేస్ట్ చేపలు కూరకు ధీటుగా ఉంటుంది.
సండే స్పెషల్ - తెలంగాణ స్టైల్లో "చికెన్ ఫ్రై" ఇలా చేయండి - రుచి అద్దిరిపోతుంది!
సండే స్పెషల్: అద్దిరిపోయే "మటన్ ఛుడ్వా" - ఈ అద్భుతమైన రుచిని ఆస్వాదించండిలా!