ETV Bharat / offbeat

అద్దిరిపోయే "రొయ్య మసాలా కర్రీ" - ఇలా ప్రిపేర్ చేయండి! - PRAWNS MASALA RECIPE

- మసాలా నషాళానికి ఎక్కాల్సిందే! - ఇంట్లో అందరూ ఎంతో ఇష్టంగా లాగిస్తారు

Prawns Masala Curry
How to Make Prawns Masala Curry (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 2 hours ago

How to Make Prawns Masala Curry : కొంతమంది చికెన్, మటన్​తో ఘుమఘుమలాడేలా బిర్యానీలు, కర్రీలు చేస్తుంటారు. కానీ, సీఫుడ్​ విషయంలో మాత్రం టేస్ట్​ కాస్త తేడా కొడుతుంది. అందుకే.. సీ ఫుడ్స్ పెద్దగా ట్రై చేయరు. అయితే.. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఇంట్లో రొయ్యల కూర వండితే మొదటిసారి ట్రై చేసేవారు కూడా ఎంతో కమ్మగా వండచ్చు. ఈ రొయ్యల మసాలా కూర వేడివేడి అన్నంలోకి టేస్ట్​ అద్దిరిపోతుంది. పైగా ఈ కర్రీ చేయడానికి ఇంట్లో ఉండే పదార్థాలు సరిపోతాయి. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా టేస్టీగా రొయ్యల మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • రొయ్యలు- అరకేజీ
  • ఉల్లిపాయలు-3
  • పచ్చి మిర్చి-4
  • టమాటాలు-2
  • కొత్తిమీర తరుగు కొద్దిగా
  • కరివేపాకు-2
  • కారం-2 టీస్పూన్లు
  • పసుపు -అర టీస్పూన్​
  • ఉప్పు రుచికి సరిపడా
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ -2 టీస్పూన్లు
  • గరం మసాలా-టీస్పూన్​
  • ధనియాలు-టీస్పూన్​
  • జీలకర్ర -అరటీస్పూన్
  • మిరియాలు-10
  • ఆయిల్- 3 టేబుల్​స్పూన్లు

తయారీ విధానం :

  • ముందుగా రొయ్యల్ని ఉప్పు, పసుపు వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. అనంతరం ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టండి. మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, మిరియాలు వేసి వేయించుకోవాలి. అవి చల్లారాక మిక్సీ గిన్నెలో మెత్తగా పొడి చేసుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • అనంతరం స్టౌపై పాన్ పెట్టండి. ఇందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయండి. ఆపై రొయ్యలు వేసి 5 నిమిషాల పాటు వేపుకోండి. తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు అదే పాన్​లో కొద్దిగా ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆపై ఉల్లిపాయలు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేపండి.
  • ఉల్లిపాయలు గోల్డెన్​ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేయాలి.
  • ఇప్పుడు టమాటా ముక్కలు వేసి ఫ్రై చేయండి. టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత కారం, రుచికి సరిపడా ఉప్పు, గ్రైండ్​ చేసుకున్న మసాలా పొడి వేసి కలపండి.
  • ఇప్పుడు ఫ్రై చేసుకున్న రొయ్యలు వేసి మిక్స్​ చేయండి. ఒక రెండు నిమిషాలు మూతపెట్టి మగ్గించిన తర్వాత ఇందులో రెండు కప్పుల నీరు పోయండి.
  • అనంతరం పాన్​పై మూతపెట్టి గ్రేవీపై ఆయిల్​ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
  • ఇప్పుడు కొత్తిమీర తరుగు, గరం మసాలా వేసి కలపండి.
  • ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ రొయ్యల కూర మీ ముందుంటుంది.
  • నచ్చితే ఈ విధంగా రొయ్యల కర్రీ మీరు ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

సండే స్పెషల్ : రొయ్యలతో ఈ వెరైటీలు - వహ్వా అనాల్సిందే!

prawns recipe : ఆహా..! ఏమి రుచి... అనరా మైమరచి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.