ETV Bharat / offbeat

"పాలక్ పనీర్ పులావ్" - లంచ్ బాక్సులు ఖాళీ అయిపోతాయ్! - PALAK PANNER PULAO IN TELUGU

- పిల్లలు పాలకూర తినకపోతే ఇదే బెస్ట్ ఆప్షన్ - ఎంతో ఇష్టంగా లాగిస్తారు!

Palak Panner Pulao Rice
How to Make Palak Panner Pulao Rice (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Dec 10, 2024, 1:22 PM IST

How to Make Palak Panner Pulao Rice : ఆరోగ్యానికి మేలు చేసే ఆకుకూరల్లో పాలకూర ముందు వరుసలో ఉంటుంది. తరచూ పాలకూర తినడం వల్ల కంటిచూపు, జీర్ణప్రక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దాదాపు అందరి ఇళ్లలోనూ రొటిన్​గా పాలకూర పప్పు, పాలకూర కారం, కర్రీ వంటివి చేయడం చూస్తుంటాం​. అయితే.. పిల్లలు ఈ కర్రీ తినడానికి అంతగా ఇష్టపడరు. ఈ సారి కొత్తగా పాలకూరతో "పాలక్ పనీర్ పులావ్" ట్రై చేయండి. దీన్ని చాలా తక్కువ టైమ్​లో లంచ్​ బాక్స్​లోకి ప్రిపేర్ చేసి ఇవ్వొచ్చు! మరి, ఈ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా తయారు చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • పాలకూర - 3 కట్టలు ( సుమారు 200 గ్రాములు)
  • ఉడికించుకున్న బాస్మతీ అన్నం -2 కప్పులు
  • పనీర్​-200 గ్రాములు
  • ఉల్లిపాయ - 1
  • పచ్చిమిర్చి-2
  • జీలకర్ర - 1 టేబుల్​స్పూన్
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నెయ్యి - 2 టేబుల్​స్పూన్లు
  • ఆయిల్ - 2 టేబుల్​స్పూన్లు
  • చక్కెర-టీస్పూన్​
  • ఎండుమిర్చి-2
  • వెల్లుల్లి రెబ్బలు-15
  • అల్లం ముక్కలు-2 చిన్నవి
  • కసూరీ మేథి-టేబుల్​స్పూన్
  • కారం-అర టేబుల్​స్పూన్
  • ధనియాల పొడి-టీస్పూన్
  • నిమ్మరసం-టేబుల్​స్పూన్​

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా కట్​ చేసుకోవాలి.
  • అలాగే అల్లం, వెల్లుల్లి రెబ్బలు చిన్న ముక్కలుగా కట్​ చేసుకోవాలి.
  • పాలకూర శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. పనీర్​ శుభ్రంగా కడిగి ముక్కలు కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై ఒక గిన్నె పెట్టుకుని నీళ్లు పోసుకోండి. ఇందులో కొద్దిగా చక్కెర, ఉప్పు వేయండి. నీళ్లు మరుగుతున్నప్పుడు పాలకూర వేయండి. 5 నిమిషాలు పాలకూర ఉడికించుకున్న తర్వాత స్ట్రెయినర్​ సాయంతో చల్లటి నీళ్లలోకి తీసుకోండి.
  • పాలకూర పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకోండి. ఇందులో కొన్ని వాటర్ యాడ్​ చేసుకుని మెత్తగా గ్రైండ్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్​ వేడయ్యాక జీలకర్ర వేసి ఫ్రై చేయండి. తర్వాత ఎండుమిర్చి వేసి వేపండి.
  • ఇందులోనే సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి ముక్కలు వేసి కాసేపు ఫ్రై చేయండి.
  • వెల్లుల్లి గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కలపండి.
  • ఇవి 2 నిమిషాలు వేగిన తర్వాత.. పనీర్​ ముక్కలు వేసి ఫ్రై చేసుకోండి. అలాగే కొత్తిమీర తరుగు, కసూరీ మేథి చేతితో నలిపి వేసుకోండి.
  • ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పనీర్​ని 5 నిమిషాలు మగ్గించుకోండి.
  • తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్న పాలక్​ పేస్ట్​ వేసి కలపండి.
  • దీనిని 5 నిమిషాలు ఉడికించుకుంటే పసరు వాసన పోతుంది. ఆపై కారం, ధనియాల పొడి వేసి మిక్స్​ చేయండి.
  • అనంతరం ఇందులో ఉడికించుకున్న బాస్మతి అన్నం వేసి బాగా మిక్స్​ చేయండి.
  • ఆపై కొత్తిమీర తరుగు, నిమ్మరసం, కొద్దిగా నెయ్యి, కాస్త కసూరీ మేథి చేతితో నలిపి వేసుకుని కలపండి.
  • ఒక నిమిషం తర్వాత స్టౌ ఆఫ్​ చేసి మూతపెట్టండి. ఈ పులావ్​ 15 నిమిషాలు అలా వదిలేయండి. ఇలా చేస్తే రైస్​ చాలా టేస్టీగా ఉంటుంది.
  • తర్వాత సర్వ్​ చేసుకుంటే టేస్టీ అండ్​ హెల్దీ పాలక్​ పనీర్​ పులావ్​ మీ ముందుంటుంది.
  • నచ్చితే ఓ సారి ఈ రెసిపీ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

లంచ్ బాక్స్ స్పెషల్ : హెల్దీ అండే టేస్టీ "పాలక్ పులావ్" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.