ETV Bharat / offbeat

ఎప్పుడూ పానీపూరీ, పునుగులేనా? - ఈ సారి "మటర్ కుల్చా" ట్రై చేయండి - అద్దిరిపోయే స్ట్రీట్ ఫుడ్! - MATAR KULCHA RECIPE

- కొత్త ఫుడ్​ టేస్ట్​ చేసే వారికి సూపర్ ఆప్షన్

Matar Kulcha at Home
How to Make Matar Kulcha at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2024, 2:46 PM IST

How to Make Matar Kulcha at Home : తెలుగు రాష్ట్రాల్లో దొరికే స్ట్రీట్​ ఫుడ్స్​లో చాలా రకాలుంటాయి. మిరపకాయ బజ్జీ, పునుగులు, ఉల్లిపాయ పకోడీ, పానీపూరీ, భేల్‌పూరి, సమోసా, ఆలూబోండా వంటివి సాయంత్రం టైమ్​లో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. మనలాగానే ఉత్తర భారతదేశంలో కూడా చాలా స్నాక్​ ఐటమ్స్​ ఉన్నాయి. వీటిలో.. అందరికీ ఎంతో నచ్చే మటర్​ కుల్చా టాప్​లో ఉంటుంది. మీ పిల్లలకు రొటీన్ స్నాక్​ రెసిపీస్కాకుండా.. ఒక్కసారి ఈ మటర్​ కుల్చా చేసి పెట్టండి. ఎంతో ఇష్టంగా తినేస్తారు. మరి, దాని తయారీ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

కుల్చా కోసం..

  • మైదాపిండి- కప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పంచదార-చెంచా
  • పెరుగు - 2 టేబుల్‌ స్పూన్లు
  • ఈస్ట్‌ - అర చెంచా
  • వెన్న - పావు కప్పు
  • నూనె - తగినంత
  • నల్ల జీలకర్ర - చెంచా

మటర్​ కోసం..

  • బఠాణీలు - కప్పు
  • పసుపు - ముప్పావు చెంచా
  • ఉప్పు - రుచికి సరిపడా
  • ధనియాలు-టేబుల్‌ స్పూన్‌
  • నిమ్మరసం-టేబుల్‌ స్పూన్‌
  • జీలకర్ర పొడి-చెంచా
  • మిరియాలు-అర చెంచా
  • వాము-అర చెంచా
  • కొత్తిమీర తరుగు-కొద్దిగా
  • పుదీనా-కొద్దిగా
  • అల్లం - అరంగుళం ముక్క
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • పచ్చిమిర్చి తరుగు - చెంచా
  • ఎండుమిర్చి-2
  • పిప్పలిపండ్లు-2
  • పచ్చిమిర్చి - 2
  • జీలకర్ర- అర టేబుల్‌స్పూన్‌
  • ఆమ్‌చూర్‌ పౌడర్‌ - అర టేబుల్‌స్పూన్‌
  • ఉల్లి తరుగు- అర కప్పు
  • టమాటా తరుగు - అర కప్పు

తయారీ విధానం :

  • మటర్‌ కుల్చా ప్రిపేర్​ చేయడానికి బఠాణీలను ముందు రాత్రి నానబెట్టాలి.
  • మరుసటి రోజు రెండు కప్పుల నీళ్లు, పసుపు, ఉప్పు వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
  • అలాగే అరగ్లాసు గోరువెచ్చటి నీళ్లలో పంచదార, ఈస్ట్‌ వేసి కరిగించాలి.
  • ఈ నీళ్లు, పెరుగు మైదాపిండిలో వేసి బాగా కలపాలి.
  • అలాగే ఇప్పుడు గ్రీన్​ చట్నీ కోసం.. కొత్తిమీర తరుగు, పుదీనా, కొద్దిగా ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర పొడి, చింతపండు గుజ్జు, పచ్చిమిర్చి తరుగు మిక్సీజార్‌లో వేసి గ్రైండ్‌ చేసుకోవాలి.
  • తర్వాత స్పెషల్‌ స్పైస్‌ మిక్స్‌ కోసం.. స్టౌ పైన పాన్​ పెట్టి నూనె లేకుండా.. ఎండుమిర్చి, మిరియాలు, పిప్పలిపండ్లు, వాము, ధనియాలు, జీలకర్ర ఒక్కొక్కటిగా వేస్తూ వేయించాలి.
  • ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో ఆమ్‌చూర్‌ పౌడర్, కాస్త ఉప్పు జతచేసి గ్రైండ్‌ చేసి స్పెషల్‌ స్పైస్‌ మిక్స్‌ రెడీ చేసుకోవాలి.
  • ఇప్పుడు నానబెట్టిన మైదాపిండిని చిన్న భాగాలు చేయాలి.
  • ఒక్కో పిండి ముద్దని చిన్న రొట్టెలా చేసి.. దాని మీద నల్ల జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లి.. చపాతీకర్రతో ఇంకొంచెం సాగదీయాలి.
  • కుల్చాని పెనం మీద వేసి ఓ పక్కన కొన్ని నీళ్లు చిలకరించి.. మూత పెట్టాలి.
  • నిమిషం తర్వాత మూత తీసి.. అట్లకాడతో అదుముతూ కొంతవరకూ కాలనిచ్చి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే మిగతా పిండితో రొట్టెలు కాల్చుకుని తీసుకోవాలి.
  • తర్వాత మరొసారి రొట్టెలను వెన్నతో కాల్చుకోవాలి. ఇలా రెండు సార్లు కాల్చుకోవడం వల్ల కుల్చాలు చాలా టేస్టీగా ఉంటాయి.
  • ఇప్పుడు మటర్​ కోసం.. ఉడికించిన బఠాణీల్లో ఉల్లి, టమాటా తరుగు, పచ్చిమిర్చి ముక్కలు, స్పెషల్‌ స్పైస్‌ మిక్స్, నిమ్మరసం, కొత్తిమీర, గ్రీన్‌చట్నీ వేసి బాగా కలపాలి.
  • అంతే.. దీంతో కుల్చాలను తింటే.. ఎంతో రుచికరంగా ఉంటుంది. నచ్చితే మీరు కూడా ఈ స్ట్రీట్​ ఫుడ్​ ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!

టేస్టీ అండ్​ స్పైసీ "ఉల్లి మిక్చర్​" - ఇంట్లోనే నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా! - రుచి​ మస్త్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.