ETV Bharat / offbeat

వడలు చేయాలంటే పిండే రుబ్బాలా ఏంటి? - ఈ పదార్థాలతో నిమిషాల్లో రెడీ! ఇక టేస్ట్​ సూపర్​! - Maramarala Vada - MARAMARALA VADA

Maramarala Vada Recipe : బ్రేక్​ఫాస్ట్​లోకి వడలు చేయాలంటే.. పప్పు నానబెట్టి గ్రైండ్​ చేసుకుని పిండి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద పని. అయితే, ఈ ప్రాసెస్​ ఏమి లేకుండా కేవలం నిమిషాల్లోనే వడలు రెడీ అవుతాయి. మరి అది ఎలానో ఇప్పుడు చూద్దాం..

Maramarala Vada
Maramarala Vada Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Aug 25, 2024, 3:08 PM IST

How To Make Maramarala Vada Recipe : వడలు అంటే చాలా మందికి ఇష్టం. ఎక్కువ మంది బ్రేక్​ఫాస్ట్​గా వీటిని తింటుంటారు. ఇక వడలు తినాలనుకున్నవారు హోటల్స్​కు వెళ్తే.. మరికొద్దిమంది వీటిని ఇంట్లోనే ప్రిపేర్​ చేసుకుంటుంటారు. ఇక వీటిని ఇంట్లో తయారు చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్​. మినపప్పు నానబెట్టాలి.. దాన్ని రుబ్బుకోవాలి.. ఆ తర్వాత వడలు వేసుకోవాలి. అయితే ఇకపై వడలు తినాలనిపిస్తే గంటల గంటలు వెయిట్​ చేయాల్సిన పని లేదు. ఇంట్లో మరమరాలు ఉంటే కేవలం నిమిషాల్లోనే వడలు చేసుకోవచ్చు. ఏంటి నమ్మడం లేదా? మీరు విన్నది నిజమే. మరమరాలతో ప్రిపేర్​ చేస్తే కేవలం నిమిషాల్లోనే మీ ప్లేట్​లోకి వేడివేడి వడలు వచ్చేస్తాయి. అంతేనా టేస్ట్​ మినప వడలను మించి ఉంటుంది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఈ స్టోరీలో చూద్దాం..

కావాల్సిన పదార్థాలు :

  • మరమరాలు - 3 కప్పులు
  • నీళ్లు - 3 కప్పులు
  • అల్లం పేస్ట్​ - టేబుల్ స్పూన్
  • ఉల్లిపాయ - 1
  • కరివేపాకు - 1
  • పచ్చిమిర్చి -2
  • కొత్తిమీర - కొద్దిగా
  • జీలకర్ర - టీస్పూన్
  • మిరియాల పొడి - టీస్పూన్
  • బియ్యం పిండి - అరకప్పు
  • పెరుగు - అరకప్పు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె- వడలు వేయించడానికి సరిపడా

తయారీ విధానం :

  • ముందుగా మరమరాలను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో నీళ్లు పోసి ఓ పది నిమిషాలు పక్కకు పెట్టాలి.
  • ఈ లోపు.. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా కట్​ చేసి పక్కకు పెట్టుకోవాలి.
  • తర్వాత నానిన మరమరాలను నీళ్లు లేకుండా పిండుకుంటూ ఓ బౌల్​లోకి తీసుకోవాలి. ఇలా మరమరాలను మొత్తం తీసుకోవాలి.
  • ఇప్పుడు వాటిని చేతితో మెదుపుకుంటూ మెత్తగా చేసుకోవాలి. మరమరాలు పూర్తిగా మెత్తగా కాకపోయినా కొన్ని అలా ఉన్న గారెలు రుచికరంగానే ఉంటాయి.
  • తర్వాత ఇందులోకి జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి.
  • అలాగే పచ్చిమిర్చి ముక్కలు, అల్లం పేస్ట్​, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి మళ్లీ కలపాలి. తర్వాత పెరుగు, బియ్యం పిండి వేసి వడల పిండిలా కలుపోవాలి. పిండి మరీ జారుగా, గట్టిగా కాకుండా నీళ్లను కొద్దికొద్దిగా యాడ్​ చేసుకోవచ్చు.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి డీప్​ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోండి.
  • ఆయిల్​ వేడైన తర్వాత కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వడలుగా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి.
  • రెండువైపులా వడలను దోరగా వేయించుకుంటే సరిపోతుంది. వేడివేడి ఎంతో రుచికరమైన వడలు మీ ముందుంటాయి.
  • చాలా సింపుల్​గా త్వరగా రెడీ అయ్యే మరమరాల వడల రెసిపీ మీకు నచ్చితే ఇంట్లో చేసేయండి. వీటిని పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.

ఇవి కూడా చదవండి :

ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!

పప్పు రుబ్బే బాధలేదు - ఇలా చేస్తే నిమిషాల్లోనే అద్దిరిపోయే రాగి వడలు రెడీ - రుచికి రుచీ.. ఆరోగ్యానికి ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.