ETV Bharat / offbeat

ఎలాంటి సాస్​ లేకుండా "వెజ్​ మంచూరియా" ఇంట్లోనే - ఇలా చేస్తే టేస్ట్​ అద్దిరిపోతుంది!! - Manchuria Recipe - MANCHURIA RECIPE

Manchuria Recipe at Home : వెజ్ మంచూరియా అందరికీ ఇష్టమే. కానీ.. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తింటే రకరకాల సాస్​లు కలుపుతారు. అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే.. ఇంటలోనే ఎలాంటి సాస్​ లేకుండా మంచూరియా చేసిపెట్టండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఆ ప్రాసెస్ ఏంటో ఉప్పుడు చూద్దాం.

Manchuria Recipe
Manchuria Recipe at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2024, 5:01 PM IST

How to Make Manchuria Recipe Without Sauce : ఫాస్ట్ ఫుడ్​ సెంటర్లో లభించే ​ మంచూరియా ఎంతో టేస్టీగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తినేస్తారు. అందుకే.. బయటకు వెళ్తే పిల్లలు మొదటగా మంచూరియానే ఆర్డర్​ చేస్తుంటారు. అయితే.. బయట చేసే వెజ్​ మంచూరియాలో ఎన్నో రకాల సాస్​లు కలుపుతుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివి కావని నిపుణులు చెబుతూనే ఉంటారు. అందుకే.. మీకోసం ఎలాంటి సాస్​లు ఉపయోగించని రెసిపీని తీసుకొచ్చాం. మరి.. సాస్​ వాడకుండా సూపర్​ టేస్టీ మంచూరియాను ఎలా తయారు చేయాలి? ఏయే పదార్థాలు కావాలి? అన్నది ఇప్పుడు చూద్దాం.

వెజ్​ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు..

  • క్యాబేజీ తరుము-కప్పు
  • మైదా పిండి-కప్పు
  • కార్న్​ఫ్లోర్​-2 టేబుల్​స్పూన్లు
  • పసుపు-పావుటీస్పూన్​
  • టమాటా-1
  • ఉల్లిపాయ-1
  • పచ్చిమిర్చి-2
  • కరివేపాకు రెమ్మలు-2
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కారం-2 టేబుల్​స్పూన్లు
  • ధనియాల పొడి-పావుటీస్పూన్​
  • గరం మసాలా-పావుటీస్పూన్​
  • మిరియాల పొడి-చిటికెడు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​-టీస్పూన్​

తయారీ విధానం..

  • ముందుగా గిన్నెలో క్యాబేజీ తురుము తీసుకోండి. ఇందులో ఉప్పు, పసుపు, కొద్దిగా కారం, ధనియాల పొడి, గరం మసాలా, మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి.
  • అలాగే మైదా పిండి, కార్న్​ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేయండి. ఇందులో కొన్ని నీళ్లు కలుపుకుని పిండిని పునుగుల పిండిలా కలుపుకోండి.
  • టమాటాను మిక్సీలో మెత్తగా గ్రైండ్​ చేసి పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్​ పోసి వేడి చేయండి. వేడివేడి నూనెలో పిండితో మంచూరియా బాల్స్​ వేయండి. వీటిని గోల్డెన్​ కలర్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి.
  • ఇప్పుడు ఇనుప ముకుడులో రెండు టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి ఫ్రై చేయండి. కొద్దిగా అల్లం పేస్ట్​, పసుపు, కరివేపాకులు వేసి కలపండి. గరం మసాలా, కారం వేసి బాగా ఫ్రై చేయండి.
  • ఇప్పుడు టమాటా మిశ్రమంలో కొన్ని నీళ్లు పోసి కలపండి. అలాగే నీటిలో టీస్పూన్​ కార్న్​ ఫ్లోర్​ కలిపి పోసుకోండి. తర్వాత ఫ్రై చేసుకున్న మంచూరియా బాల్స్​ వేసి కలపండి.
  • మంచూరియా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత.. కొద్దిగా కొత్తిమీర చల్లుకుని సర్వ్​ చేసుకోండి.
  • ఇంతే.. ఎలాంటి సాస్​లు లేకుండానే సూపర్ టేస్ట్​ మంచూరియా మీ ముందు ఉంటుంది.

ఇవి కూడా చదవండి :

స్కూల్లో లంచ్ బాక్స్ తినకుండా పిల్లలు ఇంటికి తెస్తున్నారా? - ఈ 'గార్లిక్ రైస్' పెట్టండి - మొత్తం ఖాళీ చేసేస్తారు!

నోరూరించే క్రిస్పీ "ఆలూ కుర్​ కురే " - ఇంట్లోనే సింపుల్​గా ఇలా ప్రిపేర్ చేసుకోండి - పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.