ETV Bharat / offbeat

బ్యాచిలర్స్​ కూడా ఈజీగా చేసే "ఎగ్​ వెజ్​ బిర్యానీ" - ఒక్కసారి తింటే వదలిపెట్టరు! - EGG VEGETABLES BIRYANI

-నోరూరించే ఎగ్​ వెజిటబుల్​ బిర్యానీ -ఇలా చేస్తే గిన్నె మొత్తం ఖాళీ!

How to Make Egg Vegetables Biryani
How to Make Egg Vegetables Biryani (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 5:05 PM IST

How to Make Egg Vegetables Biryani : ఘుమఘుమలాడే బిర్యానీ అంటే నాన్​వెజ్​ లవర్స్​ అందరికీ ఇష్టమే! ఇక చాలా మంది నెలకు రెండుమూడు సార్లు బిర్యానీ రుచి చూడకుండా ఉండలేరు. అయితే, ఇంట్లో చికెన్​, మటన్​ బిర్యానీ ఎన్నోసార్లు చేసుకుంటుంటాం. అలాగే ఎగ్​ బిర్యానీ కూడా ట్రై చేసి ఉంటాం. కానీ ఎప్పుడైనా ఎగ్ వెజిటబుల్​ బిర్యానీ చేశారా? లేదు అంటే మాత్రం ఇలా తప్పకుండా ఓ సారి ప్రయత్నించండి. ఈ బిర్యానీ బ్యాచిలర్స్ కూడా సింపుల్​గా చేసుకోవచ్చు. మరి ఇక ఆలస్యం చేయకుండా నోరూరించే ఎగ్​ వెజిటబుల్​ బిర్యానీ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

  • ఉడికించిన కోడి గుడ్లు - 6
  • క్యారెట్ - 1 ​
  • బీన్స్​ - 10
  • టమాటాలు- 2
  • ఉల్లిపాయలు - 4
  • బియ్యం - అర కేజీ
  • పసుపు - పావు టీ స్పూన్​
  • ధనియాల పొడి - 1 టీ స్పూన్​
  • గరం మసాలా - 1 టీ స్పూన్​
  • కారం - 1 టేబుల్​ స్పూన్​
  • ఉప్పు - సరిపడా
  • నూనె - 3 టేబుల్​ స్పూన్లు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్​ - 2 టీ స్పూన్లు
  • కొత్తిమీర, పుదీనా తరుగు - కొద్దిగా
  • పెరుగు - 1 కప్పు
  • లవంగాలు - 5
  • యాలకులు - 3
  • షాజీరా - అర టీ స్పూన్​
  • అనాస పువ్వు - 1
  • పచ్చిమిర్చి చీలికలు - కొన్ని

తయారీ విధానం:

  • ముందుగా కోడిగుడ్లు ఉడికించి పొట్టు తీసి కొద్దిగా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే రైస్​ శుభ్రంగా కడిగి అరగంటపాటు నానబెట్టుకోవాలి. బిర్యానీలోకి కావాల్సిన క్యారెట్​, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలు సన్నగా కట్​ చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీరను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టి కొద్దిగా ఆయిల్​ వేయండి. వేడివేడి నూనెలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్​ బ్రౌన్​ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • అనంతరం స్టౌపై బిర్యానీ చేయడం కోసం ఒక పెద్ద గిన్నె పెట్టండి. ఇందులో 3 టేబుల్​స్పూన్ల ఆయిల్​ వేసి వేడి చేయండి. ఆయిల్​ వేడయ్యాక లవంగాలు, యాలకులు, షాజీరా, అనాస పువ్వు వేసి వేపండి.
  • ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేయండి. అనంతరం అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయండి. క్యారెట్, బీన్స్, టమాటా ముక్కలు, కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కాసేపు మగ్గించండి. ఆపై పెరుగు వేసి కలపండి.
  • ఇందులో కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, పసుపు వేసి కలపండి.
  • అనంతరం ఇందులో వేడివేడి 4 గ్లాసుల నీరు, నిమ్మరసం పోసుకోండి. గిన్నెపై మూత పెట్టి 5 నిమిషాలు మరిగించుకోండి.
  • ఆపై బియ్యం వేసి కలపండి. బియ్యం కాస్త ఉడికిన తర్వాత మరోసారి కలిపి ఉడికించిన గుడ్లు వేయండి.
  • బిర్యానీ తయారైన తర్వాత కాస్త కొత్తిమీర పుదీనా తరుగు, ఫ్రైడ్​ ఆనియన్స్​ వేసి లో ఫ్లేమ్​లో రెండు నిమిషాలు ఉంచి స్టౌ ఆఫ్ చేయండి.
  • అంతే ఇలా సింపుల్​గా చేసుకుంటే ఎంతో రుచికరమైన ఎగ్​ వెజిటబుల్​ బిర్యానీ మీ ముందుంటుంది.
  • నచ్చితే ఇలా బిర్యానీ ఓ సారి ఇంట్లో ట్రై చేయండి.

చిరుధాన్యాల పులావ్ ఇలా సింపుల్​గా చేసేయండి - ఎంతో అద్భుతంగా ఉంటుంది

బిర్యానీ రుచికి అదొక్కటే కారణం - తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.