ETV Bharat / offbeat

మీకు సూప్స్​​ అంటే ఇష్టమా ? - ఓసారి "చికెన్ షోర్బా" ట్రై చేయండి - టేస్ట్​ అద్భుతంగా ఉంటుంది!! - EASY CHICKEN SOUP

-నార్మల్​ చికెన్​ సూప్​ని మంచిని టేస్ట్ -వింటర్​లో తప్పక ట్రై చేయాల్సిందే!​

How to Make Chicken Lemon Coriander Soup
How to Make Chicken Lemon Coriander Soup (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : 3 hours ago

How to Make Chicken Lemon Coriander Soup : చలికాలంలో చాలా మందికి వేడివేడిగా ఏదైనా సూప్​ తాగాలని అనిపిస్తుంటుంది. అందుకు తగ్గుట్టుగానే చాలా మంది టమాట, క్యారెట్​, బీట్​రూట్లతో సూప్ ప్రిపేర్​ చేసుకుంటుంటారు. మరికొందరు చికెన్​తో కూడా స్పైసీగా సూప్​ రెడీ చేసుకుని తాగుతుంటారు. అయితే, చికెన్​తో ఎప్పుడూ ఒకటే రకమైన​ సూప్ కాకుండా.. ఈసారి కొత్తగా ​'చికెన్‌ నీంబూ ధనియా షోర్బా' ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా చేస్తే షోర్బా ఎంతో స్పైసీగా సూపర్​గా ఉంటుంది. పైగా ఈ షోర్బా తాగడం వల్ల జలుపు, దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయట. మరి ఇక ఆలస్యం చేయకుండా సింపుల్​గా చికెన్‌ నీంబూ ధనియా షోర్బా ఎలా చేయాలో ఓ లుక్కేయండి.

చికెన్‌ నీంబూ ధనియా షోర్బాకి కావాల్సిన పదార్థాలు :

  • చికెన్‌ ముక్కలు- 50 గ్రాములు
  • అల్లం వెల్లుల్లి పేస్ట్‌- పావు చెంచా
  • ధనియాలు- ఒక చెంచా
  • నిమ్మకాయ-1
  • క్రీమ్‌- రెండు చెంచాలు
  • బటర్​- అర చెంచా
  • పసుపు- పావు చెంచా
  • పచ్చి మిర్చి- 2
  • కార్న్‌ఫ్లోర్‌- ఒక చెంచా
  • ఉప్పు- రుచికి సరిపడా
  • కొత్తిమీర తరుగు-కాస్త

షోర్బా తయారీ విధానం:

  • ముందుగా చికెన్ ముక్కలు​ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
  • అలాగే మిక్సీ జార్లోకి పచ్చిమిర్చిలు తీసుకుని పేస్ట్​లాగా గ్రైండ్​ చేసుకోవాలి. కొత్తిమీర సన్నగా కట్​ చేసుకోండి.
  • ఇప్పుడు స్టౌపై పాన్​ పెట్టండి. ఇందులో బటర్​ వేసి కరిగించండి. ఆపై చికెన్​ ముక్కలు వేసి ఫ్రై చేయండి.
  • 5 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్​, పసుపు, ధనియాలు, పచ్చిమిర్చి పేస్ట్​ వేసి ఫ్రై చేయండి.
  • ఆ తర్వాత మూడు పెద్ద కప్పుల వాటర్​ పోయండి. స్టౌ మీడియం ఫ్లేమ్​లో ఉంచి చికెన్ షోర్బా మరిగించుకోండి.
  • చికెన్​ ముక్కలు ఉడికిన తర్వాత.. రుచికి సరిపడా ఉప్పు, కార్న్​ఫ్లోర్, క్రీమ్​​ వేసి మిక్స్​ చేయాలి.
  • 5 నిమిషాల తర్వాత నిమ్మరసం, కాస్త కొత్తిమీర తరుగు చల్లండి. ఒక రెండు నిమిషాల తర్వాత స్టౌ ఆఫ్​ చేస్తే సరిపోతుంది.
  • ఇలా చేస్తే ఎంతో రుచికరమైన చికెన్‌ నీంబూ ధనియా షోర్బా మీ ముందుంటుంది.
  • ఈ చికెన్ షోర్బా నచ్చితే చలికాలంలో తప్పక ట్రై చేయండి.

"బీరకాయ సూప్​"తో బరువు, షుగర్​ తగ్గుతాయట! - ఇలా ఈజీగా ప్రిపేర్​ చేసుకోండి!

కూల్​ వెదర్​లో హాట్ హాట్​​గా "మిక్స్​డ్​ వెజ్ బాదం సూప్" - ఇలా చేస్తే టేస్ట్​ అదుర్స్​ - పైగా ఆరోగ్యం బోనస్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.