How to Make Black chana Pakodi Recipe : కరకరలాడే టేస్టీ పకోడి ఇష్టపడని వారుండరు. టీ టైమ్‌లో తినే బెస్ట్ స్నాక్ ఐటమ్స్‌లో ఇదీ ఒకటి. అయితే.. దాదాపు అందరూ పకోడి శనగపిండి, కాస్త బియ్యం పిండి కలిపి చేస్తుంటారు. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి పకోడి కాస్త కొత్తగా ట్రై చేయండి. శనగలతో ఈ స్టోరీలో చెప్పిన విధంగా పకోడి చేస్తే.. ఇంట్లో వాళ్లందరూ 'వన్ మోర్ ప్లేట్ ప్లీజ్' అంటారు. అంత క్రిస్పీగా.. టేస్టీగా ఉంటాయి మరి! ఈ క్రిస్పీ పకోడి చేయడానికి కావాల్సిన పదార్థాలు? తయారీ విధానం ఏంటో ఓ లుక్కేయండి.
కావాల్సిన పదార్థాలు..
- శనగలు-పావు కేజీ
- పచ్చిమిర్చి-3
- జీలకర్ర-టేబుల్‌స్పూన్
- ధనియాలు-టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు-4
- ఉల్లిపాయ-1
- ఇంచ్ అల్లం ముక్క
- ఉప్పు రుచికి సరిపడా
- బియ్యపు పిండి- 2 టేబుల్‌స్పూన్లు
- కారం-టీస్పూన్
- చాట్ మసాలా-అరటీస్పూన్
- ఆయిల్ సరిపడా
తయారీ విధానం :
- ముందుగా శనగలను కడిగి ఒక 8 గంటల పాటు నీటిలో నానబెట్టుకోవాలి.
- తర్వాత మరోసారి కడిగి.. నీరు లేకుండా జల్లించుకోవాలి.
- ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి జీలకర్ర, పచ్చిమిర్చి, ధనియాలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్క వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆపై ఇందులోకి నానబెట్టిన శనగలు వేసుకుని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
- ఈ పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర తరుగు, ఉప్పు, కారం, చాట్ మసాలా, బియ్యం పిండి వేసి బాగా మిక్స్ చేయండి.
- పిండి చేతితో ముద్దకడితే ముద్ద అయిపోవాలి. అప్పుడు పర్ఫెక్ట్గా పకోడిలు క్రిస్పీగా టేస్టీగా వస్తాయి.
- (ఈ పకోడి పిండి కాస్త గట్టిగానే ఉంటుంది. నీళ్లు వేస్తే పకోడి ఆయిల్ పీల్చుకుంటుందని గుర్తుంచుకోండి.)
- ఇప్పుడు పకోడి వేయించడానికి కడాయిలో సరిపడా ఆయిల్ పోయండి. నూనె బాగా హీట్ అయ్యాక స్టౌ మీడియం ఫ్లేమ్‌లో ఉంచండి. ఇప్పుడు చిన్నగా పకోడి ముద్దకట్టి ఆయిల్లో వేయండి.
- ఒక నిమిషం తర్వాత వాటిని గరిటెతో తిప్పి రెండు వైపులా దోరగా కాల్చుకోండి. బాగా ఫ్రై అయిన పకోడిలను ఒక ప్లేట్లోకి తీసుకోండి.
- మిగిలిన పిండితో ఇలా పకోడిలు చేసుకుంటే కరకరలాడే ఎంతో రుచికరమైన పకోడిలు మీ ముందుంటాయి.
- ఈ పకోడి రెసిపీ నచ్చితే ఇంట్లో ఓ సారి ట్రై చేయండి.
ఇవి కూడా చదవండి :
కేటరింగ్ స్టైల్ క్రిస్పీ "తోటకూర పకోడి" - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
సూపర్ టేస్టీ "సగ్గుబియ్యం పకోడి" - ఇలా చేస్తే యమ్మీ యమ్మీగా ఉంటాయి!