ETV Bharat / offbeat

రాఖీ పౌర్ణమి స్పెషల్​ స్వీట్​: నోట్లో వేస్తే కరిగిపోయే అంజీర్​ కలాకండ్ - ఇలా ప్రిపేర్ చేయండి - Tasty Anjeer Kalakand

Anjeer Kalakand Recipe : శ్రావణ మాసంలోని ముఖ్యమైన పండుగలలో రాఖీ పౌర్ణమి ఒకటి. సోదర సోదరీమణుల బాంధవ్యానికి ప్రతీకగా ఈ నెల 19వ తేదీన దేశ వ్యాప్తంగా రక్షబంధన్​ జరుపుకోనున్నారు. రాఖీ పౌర్ణమి రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరుడికి రాఖీ కట్టి స్వీట్​ తినిపించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా స్వీట్​ షాపుల్లో లభించే అంజీర్​ కలాకండ్ స్వీట్​ని ఎలా చేయాలో చూద్దాం.

Anjeer Kalakand Recipe
Anjeer Kalakand Recipe (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 15, 2024, 11:44 AM IST

How To Make Anjeer Kalakand Recipe : అన్నా చెల్లెళ్ల ఆప్యాయానికి ప్రతీక రాఖీ పండుగ. ఈ రోజున సోదరీమణులు తన సోదరుడికి రాఖీ కట్టి, నోరు తీపి చేస్తుంటారు. తమ బంధం చివరి శ్వాస వరకు ఇలానే ఉండాలని, కష్ట సుఖాల్లో ఒకరికొకరు తోడుగా అండగా ఉండాలని ​కోరుకుంటారు. ఉద్యోగరీత్యా చాలా దూర ప్రాంతాల్లో ఉన్న సోదరులకు కూడా రాఖీని పోస్ట్​ ద్వారా పంపిస్తుంటారు అక్కచెల్లెళ్లు. దగ్గర ఉన్న వారు తప్పకుండా సోదరుల ఇంటికి చేరుకుని రాఖీ కట్టి, స్వీట్​ తినిపిస్తుంటారు. ఈ రక్షబంధన్​ రోజున మీ సోదరులకి మీ చేతులతో చేసిన స్వీట్ ఏదైనా​ తినిపించాలనుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ తప్పకుండా చదవండి! స్వీట్​ షాపుల్లో ఎక్కువగా అమ్ముడుపోయే తీయని అంజీర్​ కలాకండ్​ రెసిపీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • గేదె పాలు- లీటర్​
  • నెయ్యి- పావు కప్పు
  • నిమ్మ ఉప్పు చిటికెడు (లేదా) నిమ్మరసం -టీస్పూన్​
  • చక్కెర - అరకప్పు
  • అంజీర్​- 10 (సన్నగా తురుముకోవాలి)
  • జీడిపప్పు- 2 టేబుల్​స్పూన్లు
  • ఆరెంజ్​ కలర్​- అర టీస్పూన్​

అంజీర్​ కలాకండ్ తయారు చేయు విధానం :

  • ముందుగా అంజీర్​, జీడి పప్పు పలుకులను సన్నగా కట్​ చేసుకోవాలి.
  • తర్వాత స్టౌపై అడుగు మందంగా ఉన్న మూకుడు తీసుకుని అందులో చిక్కని గేదె పాలు పోసుకోండి.
  • ఈ స్వీట్ రెసిపీ తయారు చేయడానికి నీళ్లు కలిపిన పాలు వాడకూడదు. అలాగే ప్యాకెట్​ పాలు కూడా పనికిరావు.
  • తర్వాత ఇందులోకి చక్కెర, సన్నగా కట్​ చేసిన అంజీర్​ ముక్కలు, జీడిపప్పులు వేసి కలపండి.
  • ఇక ఇప్పటి నుంచి పాలు చిక్కగా మారేంత వరకు హై ఫ్లేమ్​లోనే కలుపుతూ ఉండాలి. సన్నని మంట మీద పాలు చిక్కబడవు. కాబట్టి, స్టౌ ఎక్కువ మంట పెట్టి కలపండి. పాలు గిన్నెకు అంచులకు అడుగంటితే.. గీరుకుంటూ మళ్లీ కలుపుకోవాలి.
  • పాలు రెండుమూడు పొంగులు రాగానే ఇందులోకి.. నిమ్మఉప్పు లేదా నిమ్మరసం వేసుకోండి.
  • దీంతో పాలు చిక్కని తరకలుగా నీళ్లకి నీళ్లుగా విడిపోతాయి. మళ్లీ అంచులన్నీ గీరుతూ పాలను కలుపుకోవాలి.
  • పాలు చిక్కబడిన తర్వాత ఇందులోకి నెయ్యి వేసుకుని మళ్లీ కలుపుకోవాలి.
  • మీకు స్వీట్​ షాపు స్టైల్​ రంగు రావాలంటే ఇందులోకి చిటికెడు ఆరెంజ్​ ఫుడ్​ కలర్​ వేసుకోండి.
  • పూస ఎక్కువగా వేపకుండా కాస్త చిక్కగా ముద్దగా ఉన్నప్పుడే నెయ్యి రాసిన ప్లేట్లోకి కలాకండ్​ మిశ్రమాన్ని తీసుకోండి.
  • దీనిని సమానంగా స్ప్రెడ్​ చేసి ఒక మూడు గంటల పాటు అలా వదిలేయండి. తర్వాత మీకు నచ్చిన విధంగా స్వీట్లను కట్​ చేసుకోండి.
  • అంతే ఇలా కొద్దిగా ఓపికగా చేస్తే.. సేమ్​ స్వీట్​ షాపుల్లో దొరికే అంజీర్​ కలాకండ్​ స్వీట్​ ఇంట్లోనే సిద్ధమైపోతుంది.
  • నచ్చితే మీరు కూడా ఈ రాఖీ పండుగకు మీ ఇంట్లో ఈస్వీట్​ రెసిపీని ట్రై చేయండి.

ఇవి కూడా చదవండి :

రాఖీ స్పెషల్​ స్వీట్.. ఇంట్లో మీరే సింపుల్​గా చేసేయండిలా..

Kaju katli recipe: హోలీ స్పెషల్.. సింపుల్​గా 'కాజూ కట్లీ' తయారీ ఇలా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.