ETV Bharat / offbeat

యమ్మీ యమ్మీగా "ఆలూ 65" - ఇలా చేశారంటే టేస్ట్​ మరో లెవల్​!

-ఈవెనింగ్​ స్నాక్స్​ కోసం బెస్ట్​ ఆప్షన్​ - ఈ టిప్స్​తో నిమిషాల్లో సూపర్​​ రెసిపీ!

Aloo 65 recipe
How To Make Aloo 65 recipe at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 15, 2024, 12:25 PM IST

How To Make Aloo 65 recipe at Home : ఈవెనింగ్​ పిల్లలు స్కూల్​ నుంచి ఇంటికి రాగానే 'మమ్మీ ఆకలవుతోంది.. ఏదైనా స్నాక్​ ఐటమ్రెడీ చేసి పెట్టవా?' అని అడుగుతుంటారు. ఇలాంటప్పుడు ఎప్పుడూ చేసే చిరుతిళ్లు కాకుండా.. ఆలూ 65 రెసిపీ ట్రై చేయండి. ఈ స్టోరీలో చెప్పిన విధంగా ఆలూ 65 చేస్తే చాలా సులభంగా స్నాక్ ఐటమ్​​ ప్రిపేర్​ అవుతుంది. పైగా టేస్ట్​ సూపర్​గా ఉంటుంది. అంతేకాదు ఆయిల్​ ఎక్కువగా ఉంటుందనే బాధకూడా ఉండదు. మరి ఇక లేట్​ చేయకుండా ఇంట్లో ఆలూ 65 ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

ఆలూ 65 తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :

  • బంగాళాదుంపలు- 3
  • కార్న్​ ఫ్లోర్​- 4 టేబుల్​స్పూన్లు
  • మైదా పిండి- 3 టేబుల్​స్పూన్లు
  • కారం- టీస్పూన్​
  • మిరియాలపొడి - పావు టీస్పూన్​
  • నూనె- డీప్​ ఫ్రైకి సరిపడినంత
  • ఉప్పు -రుచికి సరిపడా

తాలింపు కోసం..

  • జీలకర్ర- అరటీస్పూన్​
  • వెల్లుల్లి తరుగు- టీస్పూన్​
  • పచ్చిమర్చి-2
  • కరివేపాకు
  • క్యాప్సికం ముక్కలు-టేబుల్​స్పూన్​
  • టమాట సాస్​-2 టేబుల్​స్పూన్లు
  • చాట్​ మసాలా- అరటీస్పూన్​
  • కొత్తిమీర

ఆలూ 65 తయారీ విధానం :

  • ముందుగా బంగాళాదుంపలపైన ఉన్న చెక్కు తీసుకోండి. తర్వాత గ్రేటర్​తో తురుముకోవాలి.
  • పొటాటో తురుమును ఒక బౌల్లోకి తీసుకుని రెండు మూడుసార్లు నీటితో కడగాలి. ఇలా వాటర్​తో క్లీన్​ చేయడం వల్ల స్టార్చ్​ మొత్తం పోతుంది. అలాగే ఇది చాలా రుచిగా ఉంటుంది.
  • ఆ తర్వాత తురుములోని నీరు మొత్తం పూర్తిగా పిండేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.
  • ఇప్పుడు ఆ తురుములోకి రుచికి సరిపడా ఉప్పు, కారం, మిరియాలపొడి, కార్న్​ ఫ్లోర్, మైదా పిండి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పిండి ముద్దలను చిన్నగా మంచూరియా బాల్స్​లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
  • ఇప్పుడు స్టౌపై కడాయి పెట్టి ఆలూ 65 ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్​ పోయండి.
  • నూనె వేడయ్యాక ప్రిపేర్​ చేసుకున్న బాల్స్​ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి క్రిస్పీగా, దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి.
  • ఇప్పుడు పోపు కోసం ఒక పాన్​లో రెండు టీస్పూన్ల ఆయిల్​ వేయండి. ఇందులోకి జీలకర్ర, వెల్లుల్లి తరుగు, పచ్చిమర్చి ముక్కలు, కరివేపాకు, క్యాప్సికం ముక్కలు వేసుకుని రెండు నిమిషాలు ఫ్రై చేయండి.
  • తర్వాత ఇందులోకి ఫ్రై చేసుకున్న ఆలూ 65 వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే టమాట సాస్​, చాట్​ మసాలా వేసుకుని మిక్స్​ చేయండి.
  • చివరిగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుని స్టౌ ఆఫ్​ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన ఆలూ 65 రెడీ.
  • నచ్చితే మీరు కూడా సాయంత్రం పూట ఈ స్నాక్​ ఐటమ్​ ట్రై చేయండి. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

రెస్టారెంట్​ స్టైల్లో​ ఆలూ 65 - ఇలా చేశారంటే ఇంట్లో వాళ్లందరూ వావ్ అనాల్సిందే!

బండి మీద అమ్మే "బఠాణీ చాట్" - ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోండి - టేస్ట్ అద్దిరిపోతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.