ETV Bharat / offbeat

ఎంత రుద్దినా పాత్రల జిడ్డు పోవడం లేదా? - ఒక్కసారి ఇలా క్లీన్​ చేయండి!

- ఈ పదార్థాలతో క్లీన్​ చేస్తే కొత్త వాటిలా తళతళా మెరుస్తాయ్!

author img

By ETV Bharat Telugu Team

Published : 9 hours ago

How to Clean Greasy Vessels
How to Clean Greasy Vessels (ETV Bharat)

How to Clean Greasy Vessels : సాధారణంగానే మనం కిచెన్​లో వంట చేస్తున్నప్పుడు గ్యాస్ స్టౌ, ప్లాట్‌ఫామ్, టైల్స్.. మొదలైన వాటిపై నూనె చిందుతుంటుంది. వీటితో పాటు స్టౌ దగ్గర ఉన్న పాత్రలు కూడా జిడ్డుగా తయారవుతుంటాయి. అయితే.. కొన్నిసార్లు ఈ పాత్రలను డిష్​వాష్​ ఉపయోగించి ఎంతసేపు రుద్దినా వాటికంటుకున్న జిడ్డు మాత్రం వదలదు. ఇలాంటప్పుడు కొన్నిటిప్స్​ పాటించి పాత్రలను క్లీన్​ చేస్తే జిడ్డు వదిలిపోయి.. కొత్తవాటిలా తళతళా మెరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆ టిప్స్​ ఏంటో మీరు ఓ లుక్కేయండి.

గ్రీజు పేపర్‌తో..

జిడ్డుగా మారిన పాత్రలను, కిచెన్​లోని ఇతర డబ్బాలను గ్రీజు పేపర్ సహాయంతో క్లీన్​ చేసుకోవచ్చు. ఇందుకోసం.. ఒక ట్రాన్స్‌పరెంట్ పేపర్‌ని తీసుకొని దానిపై కొద్దిగా ఆయిల్​ వేయాలి. ఇప్పుడు గ్రీజు పేపర్‌తో పాత్రలపై జిడ్డుగా ఉన్న చోట రుద్దాలి. ఆ తర్వాత డిష్‌వాష్‌తో క్లీన్​ చేస్తే సరిపోతుంది. పాత్రలు కొత్తవాటిలా మెరుస్తాయి.

నిమ్మచెక్కతో..

పాత్రలపై అంటుకున్న జిడ్డు మరకల్ని నిమ్మచెక్కతో ఈజీగా తొలగించుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక నిమ్మచెక్క మీద కొద్దిగా బేకింగ్ సోడా చల్లండి. తర్వాత దీంతో జిడ్డుగా మారిన పాత్రలను బాగా రుద్దాలి. ఇప్పుడు నీటితో క్లీన్​ చేస్తే సరిపోతుంది. పాత్రలు తళతళా మెరుస్తాయి.

వెనిగర్ సహాయంతో..

పాత్రలకున్న జిడ్డును తొలగించడంలో వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందుకోసం కొన్ని వాటర్​లో కొద్దిగా వెనిగర్ వేయాలి. ఈ లిక్విడ్​లో జిడ్డు పాత్రల్ని కొన్ని నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత బయటికి తీసి కాటన్ క్లాత్‌తో తుడిచేసి.. స్క్రబ్బర్ సహాయంతో క్లీన్​ చేస్తే సరిపోతుంది.

జిడ్డును తొలగించే బేకింగ్ సోడా..

ముందుగా జిడ్డు పాత్రలను ఒకసారి నీటిలో ముంచి తీయాలి. తర్వాత పాత్రలపై బేకింగ్ సోడా చల్లాలి. కొద్దిసేపటికి స్క్రబ్బర్ సహాయంతో శుభ్రం చేస్తే సరిపోతుంది.

మాడిపోయిన మరకలను ఇలా తొలగించండి..

  • వంటింట్లోని కడాయి, కుక్కర్, పాన్.. వంటి కొన్ని అల్యూమినియం పాత్రలపై నూనె జిడ్డుతోపాటు మాడిపోయిన మరకలు ఏర్పడుతుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఈ టిప్స్​ పాటించండి.
  • పాత్రలపై ఉన్న జిడ్డును, ఇతర మరకల్ని తొలగించడానికి దానిపై నేరుగా కొద్దిగా వెనిగర్‌ పోయాలి. కొద్దిసేపటి తర్వాత క్లీన్​ చేస్తే జిడ్డు పోయి.. పాత్రలు మృదువుగా తయారవుతాయి.
  • ఒక పాత్రలో బియ్యప్పిండి, ఉప్పు సమపాళ్లలో తీసుకోండి. అందులో కొద్దిగా వెనిగర్‌ని కలిపి పేస్ట్‌లా రెడీ చేసుకోవాలి. దీన్ని జిడ్డు పాత్రపై మొత్తం అప్త్లె చేసి కొద్దిసేపు అలా వదిలేయాలి. తర్వాత వేడినీటితో పాత్రను శుభ్రం చేస్తే తళతళా మెరిసిపోతుంది.
  • ముందుగా కొన్ని నీటిని మరిగించి.. జిడ్డుగా ఉన్న పాత్రలో పోయాలి. చల్లారిన తర్వాత డిష్‌వాష్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది. ఇలా చేసినా జిడ్డు ఇంకా వదలకపోతే.. ముందుగా మరిగించే వాటర్లో కాస్త నిమ్మరసం వేసి క్లీన్​ చేయండి.

ఇవి కూడా చదవండి :

సూపర్​ ఐడియా - కిచెన్​ గోడలపై నూనె మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో మాయం!

ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.