ETV Bharat / offbeat

ప్లాస్టిక్​ డబ్బాలపై మరకల నుంచి గిన్నెల నీచు వాసన పోగొట్టడం వరకు - వెన్నతో ఎన్నో ఉపయోగాలు! - HOUSEHOLD USES OF BUTTER

-వెన్న ఆరోగ్యానికి చాలా మంచిది -బటర్​తో వీటిని క్లీన్​ చేస్తే మెరిసిపోతాయి

Household Uses of Butter
Household Uses of Butter (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 27, 2024, 3:29 PM IST

Household Uses of Butter: వెన్న ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతే కాకుండా పలు రకాల ఆహారపదార్థాలకు రుచిని అందించడానికి కూడా మనం వెన్నను ఉపయోగిస్తాం. అయితే ఇదే కాదు.. మన నిత్య జీవితంలో వెన్న వల్ల ఇతర ఉపయోగాలు ఎన్నో ఉన్నాయంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • చాలా సందర్భాల్లో తలుపు వేస్తున్నప్పుడు, తీస్తున్నప్పుడు కిర్‌ర్..మనే శబ్దం వస్తూ ఉంటుంది. ఈ సమస్యను తొలగించడానికి కొద్దిగా బటర్‌ని మడత బందులకు రాస్తే.. శబ్దం రాకుండా ఉంటుందని.. తలుపుకు కూడా చక్కగా సెట్​ అవుతాయని అంటున్నారు.
  • ప్లాస్టిక్ వస్తువులపై పడిన మరకలు వదలగొట్టాలంటే కొద్దిగా కష్టమే. ఇలాంటి సందర్భాల్లో బటర్‌ని ఉపయోగిస్తే వాటిని చాలా సులభంగా పోగొట్టచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం మరక ఏర్పడిన చోట కొద్దిగా వెన్న రాసి 40 నిమిషాల పాటు అలాగే ఉంచేయాలి. ఆ తర్వాత వస్త్రంతో తుడిచేస్తే మరక వదిలిపోయి.. నీట్​గా ఉంటాయని చెబుతున్నారు.
  • చేతులకు అంటుకున్న గ్లూని వదలగొట్టడం అంత సులభమేమీ కాదు. కొన్ని సందర్భాల్లో అయితే క్లీన్​ చేసుకునేటప్పుడు చర్మం కూడా ఊడిపోతుంది. ఇలాంటప్పుడు చేతులను శుభ్రం చేసుకొనే ముందు బటర్ రాసుకోవడం ద్వారా గ్లూని సులభంగా వదిలించుకోవచ్చంటున్నారు.
  • చేపలు శుభ్రం చేసిన తర్వాత వాటిని ఉంచిన పాత్రల నుంచి వచ్చే నీచు వాసన ఓ పట్టాన పోదు. ఇలాంటప్పుడు వాసన వచ్చే పాత్రలను కొద్దిగా వెన్నతో తోమాలి. ఆ తర్వాత సబ్బు ఉపయోగించి గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేస్తే పాత్రల నుంచి నీచు వాసన రాకుండా ఉంటుంది. అలానే కొత్త వాటిలా మెరుస్తాయి.
  • కొన్ని సందర్భాల్లో వేలికి ఉన్న ఉంగరాలు బిగుతుగా మారుతుంటాయి. ఇలాంటప్పుడు ఆయా వేళ్లకు కొద్దిగా వెన్న రాసి తీస్తే ఉంగరాలు సులభంగా వచ్చేస్తాయంటున్నారు.
  • సగం కోసిన ఉల్లిపాయలు పాడవకుండా ఉండాలంటే దానిపై కొద్దిగా వెన్న రాయాలని.. ఇలా చేస్తే ఉల్లిపాయ వాడిపోదని, ఘాటు కోల్పోదని చెబుతున్నారు.
  • చెక్క వస్తువులపై ఏర్పడిన నీటి మరకలు తొలగించడానికి రాత్రి సమయంలో కొద్దిగా వెన్న రాసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేస్తే సరిపోతుందని అంటున్నారు.
  • చెక్క ఫర్నిచర్‌ను మెరిసేలా చేయడానికి కూడా వెన్నను ఉపయోగించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
  • వెన్న చర్మాన్ని మాయిశ్చరైజ్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో చర్మం ఎండిపోయినప్పుడు, వెన్నను చర్మం మీద రాసుకోవడం వల్ల మృదువుగా మారుతుందని అంటున్నారు.

చెక్క పాత్రల జిడ్డు, మరకలు పోవట్లేదా? - ఇలా చేస్తే ఈజీగా తొలగిపోయి నీట్​గా ఉంటాయి!

పట్టు చీరలు ఎలా ఐరన్ చేయాలో తెలుసా? - ఇలా చేస్తే నీట్​ అండ్​ క్లీన్​ గ్యారెంటీ!

కుంకుడు కాయలతో జుట్టు మాత్రమే కాదు ఇవీ క్లీన్​ అవుతాయి! - ఎలా వాడాలో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.