How to Make Hariyali Dum Aloo Curry : బంగాళాదుంపతో చేసే కూరలన్నా, వంటకాలన్నా చాలామందికి ఫేవరెట్. దీనితో ఎన్నో రుచికరమైన వంటలు చేయవచ్చు. ఇతర కూరగాయలతోనూ ఆలూని జత చేసి వండుకుంటారు. కానీ.. ఈసారి బంగాళదుంపతో కాస్త డిఫరెంట్‌గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఒక్కసారి తిన్నారంటే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది. అంత రుచికరంగా ఉంటుంది! అదే.. రెస్టారెంట్ స్టైల్ "హరియాలీ దమ్ ఆలూ" రెసిపీ. ఇంతకీ.. దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- బంగాళదుంపలు - 4
- ఉప్పు - కొద్దిగా
- పసుపు - పావు టీస్పూన్
- నూనె - పావు కప్పు
- జీలకర్ర - అర టీస్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 5 నుంచి 6
- ఉల్లిపాయ - 1
- పచ్చిమిర్చి - 2
- వేయించిన జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- పసుపు - అర టీస్పూన్
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- కారం - అర టేబుల్‌స్పూన్
- గరం మసాలా - పావు టీస్పూన్
హరియాలీ పేస్ట్ కోసం :
- కొత్తిమీర - 1 పెద్దకట్ట
- పుదీనా - 1 చిన్నకట్ట
- వెల్లుల్లి రెబ్బలు - 15 నుంచి 20
- అల్లం - కొద్దిగా
- పచ్చిమిర్చి - 5
- పెరుగు - పావు కప్పు
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా రెసిపీలోకి కావాల్సిన కొత్తిమీర, పుదీనాను కాడలతో సహా తరుక్కొని పక్కన ఉంచుకోవాలి. అలాగే ఉల్లిపాయను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి.
- ఇప్పుడు ఆలుగడ్డలను పొట్టు తీసి మీడియం సైజ్‌లో క్యూబ్స్ మాదిరిగా కట్ చేసుకోవాలి. అంటే.. ఒక్కో ఆలూను ఎనిమిది ముక్కలుగా చేసుకుంటే సరిపోతుంది. లేదంటే.. ఒకవేళ మీకు దొరికితే బేబీ పొటాటోలను తీసుకోండి.
- అనంతరం స్టౌపై.. ఒక బౌల్ పెట్టుకొని అందులో లీటర్ వాటర్ పోసుకొని కట్ చేసుకున్న ఆలూ ముక్కలు, కాస్త ఉప్పు, పసుపు వేసి మంటను హై-ఫ్లేమ్‌లో ఉంచి బంగాళదుంపలను 80% వరకు ఉడికించుకోవాలి.
- ఆవిధంగా ఆలూ ముక్కలను ఉడికించుకున్నాక.. వాటిని నీటి నుంచి వేరు చేసి ఒక బౌల్లోకి తీసుకొని చల్లారనివ్వాలి.
- ఇప్పుడు స్టౌపై.. పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడక్కాక.. చల్లారిన బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి మధ్యమధ్యలో గరిటెతో కలుపుతూ ఆలూ ముక్కలను తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఆలోపు హరియాలీ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఇందుకోసం.. మిక్సీ జార్ తీసుకొని అందులో తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిర్చి, పెరుగు వేసుకొని మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
- ఇక ఇప్పుడు స్టౌపై ఉన్న బంగాళదుంపలు బాగా వేగి ఉంటాయి. అలా వేగిన వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుకోవాలి.
- అనంతరం.. అదే నూనెలో జీలకర్ర, సన్నని వెల్లుల్లి తరుగు వేసి అవి కాస్త రంగు మారేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు వేసి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయ రంగు మారాక.. వేయించిన జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకుని కాసేపు వేయించుకోవాలి. తర్వాత అందులో పావు కప్పు వాటర్ వేసి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక.. అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న కొత్తిమీర పేస్ట్, అరకప్పు వాటర్ పోసి కలుపుకోవాలి. అలాగే.. రుచికి సరిపడా ఉప్పునూ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఆపై మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి నూనె తేలేంత వరకు ఉడకనివ్వాలి.
- అలా ఉడికిందనుకున్నాక.. ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత ఆలూ కర్రీ మధ్యలో ఒక చిన్న గిన్నె ఉంచి అందులో ఎర్రగా కాల్చిన బొగ్గు ముక్క వేసి దానిపై రెండు చిటికెళ్ల గరం మసాలా, నాలుగైదు డ్రాప్స్ నెయ్యి వేసి మూతపెట్టేసి మూడు నాలుగు నిమిషాలపాటు పొగను బయటకుపోనివ్వకుండా లో ఫ్లేమ్ మంట మీద కూరను మగ్గనివ్వాలి.
- మూడు నాలుగు నిమిషాల తర్వాత.. కూర బాగా మరిగి స్మోకీ అరోమా మొత్తం గ్రేవీకి పట్టి ఉంటుంది. ఇప్పుడు గిన్నె మీద మూత తీసి ఒకసారి కలుపుకుంటే చాలు. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే "హరియాలి స్మోకీ ఆలూ దమ్ కర్రీ" రెడీ!
- దీన్ని రోటీలు, అన్నం, చపాతీలు, పూరీలు, జీరా రైస్.. ఇలా దేనిలోకి తిన్నా చాలా రుచికరంగా ఉంటుంది!
ఇవీ చదవండి :
ధాబా స్టైల్ "ఆలూ పాలక్ కర్రీ" - ఒక్కసారి టేస్ట్ చేశారంటే, పాలకూరే కావాలంటారు!
ఆలుగడ్డతో అద్దిరిపోయే వడలు పది నిమిషాల్లోనే! - ఇలా ప్రిపేర్ చేస్తే వహ్వా అంటారు!