ETV Bharat / offbeat

మీ బాడీలో ఎంత చెడ్డ కొవ్వు పేరుకుపోయిందో! - ఇవి తిని మంచి కొవ్వును పెంచుకోండి! - How To Improve Good Cholesterol

Good Cholesterol Increase Foods : మనం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఎంత జాగ్రత్త పడుతామో.. అలాగే మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవడానికీ అంతే శ్రమించాలి. అప్పుడే గుండె ఆరోగ్యం బాగుంటుందంటున్నారు నిపుణులు. ఈ క్రమంలోనే రోజు వారి ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుందో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

How To Improve Good Cholesterol
Good Cholesterol Increase Foods (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Aug 16, 2024, 3:31 PM IST

How To Improve Good Cholesterol : అన్ని విషయాల్లో మంచి, చెడు ఉన్నట్లే.. కొవ్వుల్లోనూ ఆరోగ్యానికి మేలు చేసేవి, హాని కలిగించేవి రెండూ ఉంటాయి. చెడు కొవ్వులను.. LDL కొలెస్ట్రాల్ అని, మంచి కొవ్వులను.. HDL కొలెస్ట్రాల్ అని పిలుస్తారు. మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉండాలి. మంచి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండాలి. అప్పుడే గుండె ఆరోగ్యం బాగుంటుందంటున్నారు నిపుణులు. కానీ.. మారిన జీవనశైలి కారణంగా నేటి రోజుల్లో చాలా మందిలో మంచి కొలెస్ట్రాల్ కంటే.. చెడు కొలెస్ట్రాల్(LDL Cholesterol) స్థాయిలే ఎక్కువగా ఉంటున్నాయి. ఫలితంగా గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ ఫెయిల్యూర్ వంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి, రక్తంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుకోవాలంటే రోజువారి డైట్​లో కొన్ని ఆహారాలను తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణురాలు డాక్టర్ అంజలీ దేవి. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

ఓట్స్ : ఇవి మంచి కొలెస్ట్రాల్​ను పెంచడంలో చాలా బాగా సహాయపడతాయని చెబుతున్నారు. అందుకే.. వైద్యులూ రోజూ ఏదో ఒక రూపంలో ఓట్స్​ను తీసుకునే వారిలో HDL కొలెస్ట్రాల్ బాగా పెరుగుతుందని చెబుతుంటారు. కాబట్టి, ఓట్స్​ను డైలీ డైట్​లో తప్పక ఉండేలా చూసుకోవాలంటున్నారు.

ఆలివ్ నూనె : రోజువారి వంటలలో సాధారణ వంట నూనెల కంటే ఆలివ్ నూనె యూజ్ చేయడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంటున్నారు. మరి ముఖ్యంగా ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పోషకాలు మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు చాలా బాగా తోడ్పడతాయని సూచిస్తున్నారు.

గింజ ధాన్యాలు : పల్లీలు, ఆల్మండ్స్, ఆవకాడో వంటి వాటిలో అసంతృప్త కొవ్వుల శాతం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి.. వీటినీ తరచుగా తీసుకోవడం ద్వారా రక్తంలో మంచి కొలెస్ట్రాల్ శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు డాక్టర్ అంజలీ దేవి.

అలర్ట్ ఎవ్రీవన్ : మారిపోయిన కొలెస్ట్రాల్ లెక్కలు​ - తొలిసారి CSI మార్గదర్శకాలు - అంతకు మించితే అంతే!

అవిసె గింజలు : ఇవి కూడా మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ పెంచడంలో చాలా బాగా సహాయపడతాయంటున్నారు. ప్రధానంగా అవిసె గింజలలో(Health Direct రిపోర్టు) ఉండే పీచు, ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు రక్తంలో మంచి కొవ్వును పెంచడానికి చాలా బాగా దోహదపడుతాయని సూచిస్తున్నారు.

చేపలు : వీటిలో కూడా ఓమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే.. తరచుగా చేపలను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా వీటిలో ఉండే పోషకాలు చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించి.. మంచి కొవ్వులు పెరగడానికి ఎక్కువగా సహాయపడతాయంటున్నారు.

ఇవేకాకుండా.. బ్రకోలీ, క్యారెట్, క్యాబేజీ, గుమ్మడి గింజలు, మొలకెత్తిన విత్తనాలు, అరటి, యాపిల్ నారింజ వంటివీ మంచి కొవ్వులు పెంచే గుణం ఉన్నవే. కాబట్టి.. పైన పేర్కొన్న ఈ ఫుడ్స్​ను డైలీ డైట్​లో భాగం చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గి.. గుండె ఆరోగ్యానికి తోడ్పడే మంచి కొలెస్ట్రాల్ శాతం చక్కగా పెరుగుతుందంటున్నారు డాక్టర్ అంజలీ దేవి. వీటితో పాటు మాసికరంగా దృఢంగా ఉండాలి. రోజూ వ్యాయామం చేయడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరమంటున్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కాలి గోళ్లు ఇలా ఉన్నాయా? - అయితే, మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.