ETV Bharat / offbeat

ఫ్రిజ్​లో పెట్టిన పండ్లు, కూరగాయలు త్వరగా పాడవుతున్నాయా? - ఇలా చేశారంటే ఎక్కువ రోజులు ఫ్రెష్!

-పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి బెస్ట్​ టిప్స్​ -ఫ్రిజ్​ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం

HOW TO STORE VEGETABLES IN FRIDGE
How to Properly Organize Fridge (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 15, 2024, 10:56 AM IST

How to Properly Organize Fridge: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పటికప్పుడు మార్కెట్​కు వెళ్లి తాజా కూరగాయలు, పండ్లు తెచ్చుకొని తినడం అంత తేలికైన పని కాదు. అందుకే.. చాలా మంది వీకెండ్ టైమ్​లో మార్కెట్​కు వెళ్లినప్పుడు కావాల్సిన వాటిని ఒకేసారి ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని ఫ్రిజ్​లో స్టోర్ చేసుకుంటుంటారు. అయినప్పటికీ.. కొన్నిసార్లు అవి త్వరగా పాడవుతుంటాయి. అందుకు కారణం.. రిఫ్రిజిరేటర్​ను సరిగ్గా మెయిన్​టెయిన్ చేయకపోవడమేనట! కాబట్టి.. కూరగాయలు, పండ్లు ఎక్కువ రోజులు పాడవ్వకుండా ఉండాలంటే.. వాటిని ఫ్రిజ్​లో అమర్చే ముందే కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

  • ఫ్రిజ్​లో పెట్టిన పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే.. బయటి నుంచి తెచ్చాక వాటిని నీటిలో కాస్త ఉప్పు, చక్కెర, వెనిగర్ కలిపిన మిశ్రమంతో శుభ్రం చేసుకోవాలి. ఆపై వాటిని ఫ్రిజ్​లో నిల్వ చేస్తే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయంటున్నారు నిపుణులు.
  • కూరగాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉండాలంటే జిప్పర్‌ బ్యాగ్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో స్టోర్ చేయాలి. అలాంటి.. బ్యాగులు అందుబాటులో లేకపోతే మామూలు కవర్లకే చిన్న చిన్న హోల్స్ చేయచ్చు. ఫలితంగా.. కాయగూరలకు గాలి తగిలి అవి కుళ్లిపోకుండా ఉంటాయంటున్నారు.
  • లేదంటే.. మీకు వీలైతే కాటన్ బ్యాగ్స్ లేదా మృదువైన కాటన్ క్లాత్​లో పండ్లు, కూరగాయలను వేరువేరుగా ఉంచి స్టోర్ చేసుకోవడం మంచిదంటున్నారు. ఎందుకంటే.. కాటన్ తేమను పీల్చుకుని ఎక్కువ రోజులు అవి ఫ్రెష్​గా ఉండడానికి తోడ్పడుతుందంటున్నారు.
  • కొన్ని రకాల కూరగాయలు, పండ్లు ఇథిలీన్‌ వాయువును రిలీజ్ చేస్తాయి. అది ఆ పండ్లు, కాయగూరల్ని తొందరగా పక్వానికి వచ్చేలా చేస్తుంది. కాబట్టి.. వీటి పక్కన నిల్వ చేసే ఇతర కాయగూరలు, పండ్లు, ఆకుకూరలు కూడా త్వరగా పాడవుతాయి.
  • అందుకే.. ఇథిలీన్‌ విడుదల చేసే యాపిల్స్‌, ఆప్రికాట్స్‌, తర్బూజా.. వంటి పండ్లను ఫ్రిజ్‌లో నిల్వ చేసినప్పటికీ వాటిని ఆకుకూరలకు దూరంగా ఉంచాలన్న విషయం గుర్తుంచుకోవాలి.

ఈ పండ్లను ఫ్రిజ్​​లో స్టోర్ చేస్తున్నారా? - అవి త్వరగా పాడవ్వడమే కాదు రుచిని కోల్పోతాయి!

  • కొత్తిమీర, పుదీనా త్వరగా కుళ్లిపోవడం మనం చూస్తుంటాం. అలా జరగకూడదంటే వాటిని పేస్ట్‌ చేసి గాలి చొరబడని డబ్బాలో పెట్టి.. ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. లేదంటే.. వాటి కాడలను కత్తిరించి గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో పెట్టుకున్నా ఎక్కువ రోజులు ఫ్రెష్​గా ఉంటాయంటున్నారు నిపుణులు. అలాగే.. పచ్చిమిర్చి, కరివేపాకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నా ఈవిధంగానే స్టోర్ చేసుకోండి.
  • ఫ్రిజ్​లో పండ్లను ఉంచేటప్పుడు వాటిని మూసి ఉంచితే వేగంగా పాడవుతాయి. అందుకే వాటిని అలాగే గాలి ఆడేలా ఉంచండి. లేదా రంధ్రాలు ఉన్న డబ్బాలోనైనా వేసుకొని స్టోర్ చేసుకోండి.
  • అదే.. ద్రాక్ష పండ్లను నిల్వ చేసే ముందు వాటిని వాటర్​తో బాగా కడిగి.. తడి లేకుండా శుభ్రంగా తుడవాలి. తర్వాత ఒక ప్లేట్‌లో టిష్యూ పేపర్లను పరిచి అందులో ద్రాక్ష పండ్లను ఉంచి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఎక్కువ కాలం ఫ్రెష్​గా ఉంటాయి.
  • అదేవిధంగా.. అరటి పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం కంటే బయట ఉంచితేనే ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. వాటిని అందులో పెట్టడం వల్ల వాటి తొక్క త్వరగా నల్లగా మారుతుంది.
  • బంగాళాదుంపలు, ఉల్లిపాయలను సాధారణ బుట్టల్లో గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ ఉంచితే చాలా రోజులు పాడవకుండా ఉంటాయంటున్నారు.
  • అదేవిధంగా.. చీజ్, వెన్న వంటి పాల ఉత్పత్తులను వీలైనంత వరకు రిఫ్రిజిరేటర్​లో పెట్టకుండా చూసుకోండి. ఒకవేళ పెట్టాలనుకుంటే అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి, ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవడం మంచిదట.
  • రిఫ్రిజిరేటర్​లో కొబ్బరిని అలాగే పెడితే పాడవుతుంది. అందుకే.. కొబ్బరిని తురిమి ఒక డబ్బాలో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకోండి. దీనివల్ల ఎక్కువరోజులు తాజాగా ఉంటుందట.
  • వీటిని ఫాలో అవ్వడంతో ఫ్రిజ్​ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం కూడా చాలా అవసరమంటున్నారు నిపుణులు.

ఈ 12 వస్తువులను ఫ్రిజ్‌లో అస్సలు పెట్టొద్దు - పెడితే ఏమవుతుందో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.