Dont Called Back While Going Work : ఏదైనా పనిమీద బయటకు వెళ్లేవారిని ఎక్కడికి వెళ్తున్నావు? లేదా వారిని మాట్లాడించడం కానీ ఎక్కువగా చేయరు. ఎందంకంటే బయటకు వెళ్తున్న వారిని మాట్లాడించడం వల్ల పనులు జరగవని నమ్ముంతుంటారు. అందుకే బయటకు వెళ్లేవారిని ఎక్కడికి అని అడగకూడదంటారు. అలానే ఎవరిని కూడా వెనక్కి పిలవకూడదని మన పెద్దలు అంటుంటారు. చాలామంది పనిమీద వెళ్లేవాళ్లని అసంకల్పితంగానో.. లేక అవసరం కోసమో వెనక్కి పిలుస్తుంటారు. ఇంట్లో ఉండగా గుర్తుకు రానిది.. గుమ్మం దాటాక ఆలస్యంగా గుర్తుకు వస్తుంటుంది. దీంతో వెంటనే వారిని తిరిగి వెనక్కి పిలుస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారు వెనుదిరిగి ఇంటికి వస్తారు. ఫలితంగా జరగాల్సిన పనులు ఆలస్యమవడమే కాకుండా అనేక నష్టాలు ఉంటాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని ఫలితం అంతటితో ఆగకుండా దీని ప్రభావం ఆ రోజులోని ప్రతి పనీపై పడి వెనుదిరిగి వచ్చేలా అవుతుందని ప్రముఖ జ్యోతిష్యుడు మాచిరాజు వేణుగోపాల్ చెప్పారు. దీని వెనుక కథను, ప్రాశస్త్యాన్ని ఆయన వివరించారు.
ఓ జ్ఞాని.. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం బయలుదేరిన సమయంలో అతడి భార్య.. ఏదో మరిచిపోయాడంటూ వెనక్కి పిలుస్తుంది. వెనక్కి పిలిచావు కాబట్టి.. ఆయన దర్శనం నాకు అవతుందో లేదో అని చెబుతాడు. జ్ఞానం, ధన సంపాదన ఇలా దేనికోసం వెళ్లినా సరే.. వెనక్కి మాత్రం పిలవకూడదు. ఏ పని మీద వెళ్తున్నా సరే.. ఎవరూ కూడా వెనక్కి పిలువకూడదు. చేయాల్సిన పనుల గురించి స్థిర నిశ్చయంతో ఆలోచిస్తూనే గుమ్మం దాటాలి. ఇలా వెంటనే వెనక్కి పిలవడం వల్ల తెలియని చిరాకు, విసుగు వస్తుంది. కాబట్టి దాని ప్రభావం ఆ తర్వాత జరిగే ప్రతి పనిపై ఉంటుంది. దాని వల్ల ప్రతి పని ఆలస్యంగా జరుగుతుంది. ఫలితంగా అనుకున్న సమయానికి డబ్బు రాకపోవచ్చు. ఇలా జరగడం వల్ల అప్పు చేయాల్సి ఉంటుంది. అప్పు చేయడం వల్ల వడ్డీ పెరిగి.. సంపద తగ్గుతుంది.
మాచిరాజు వేణుగోపాల్, జ్యోతిష్యుడు
వేటకు వెళ్తున్న భక్త కన్నప్పను అతడి భార్య వెనక్కి పిలవడం వల్లే.. ఆరోజు ఒక్క వేట కూడా దొరకలేదని మాచిరాజు వేణుగోపాల్ వివరించారు. గుమ్మం దాటుతున్న వారిని పిలవకూడదని.. దానికి సంబంధించిన పని గడప దాటకముందే చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్పాలని సూచించారు. ఇవన్నీ ఎవరైతే ఆచరిస్తారో వారికి అన్ని విధాల లక్ష్మీ కటాక్షం ఉంటుందని ఆయన తెలిపారు. గడప దాటిన తర్వాత ఎవరినీ కూడా పిలవకూడదని తప్పనిసారిగా గుర్తుకు పెట్టుకోవాలని చెప్పారు.