ETV Bharat / offbeat

మార్కెట్​ నెయ్యితో కల్తీ భయమా? - పాల మీగడతో స్వచ్ఛమైన నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకోండిలా! - HOW TO MAKE GHEE WITH MILK MALAI

- ఇలా చేసుకుంటే ఎక్కువ రోజు తాజా

How to Make Ghee With Milk Malai at Home
How to Make Ghee With Milk Malai at Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 23, 2024, 3:22 PM IST

How to Make Ghee With Milk Malai at Home: స్ఫైసీగా చేసుకునే బిర్యానీ నుంచి కమ్మగా తయారు చేసుకునే స్వీట్ల వరకూ.. అన్నింట్లో నెయ్యి ఉండాల్సిందే. కారణం నెయ్యి ఎందులో వేసినా.. ఆ రుచి అమృతంతో సమానం. ఇక వేడి వేడి అన్నంలో కూసింత నెయ్యి, ఆవకాయ పచ్చడి వేసుకునే తింటే వచ్చే మజానే వేరు. అయితే ఇప్పుడా లెక్క మారింది. మార్కెట్లో కల్తీ నెయ్యి హల్​చల్​ చేస్తుండటంతో చాలా మంది బయట నెయ్యి కొనాలంటేనే భయపడుతున్నారు. ఇటీవల తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా కలకలం రేగడంతో.. నెయ్యి తినాలంటేనే జంకుతున్నారు. అందుకే.. స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

సాధారణంగా గతంలో నెయ్యి తయారు చేయాలంటే.. పెరుగు చిలికి దానిని మజ్జిగ లాగా చేసి అందులో నుంచి వెన్న తీసి.. దాని ద్వారా నెయ్యి తయారు చేసేవారు. అయితే రానురానూ నెయ్యి చేసే విధానం కూడా మారుతుండటంతో మజ్జిగ చేసే ఓపిక లేక కేవలం పెరుగు తోడుబెట్టిన తర్వాత దానిపైన ఏర్పడే మీగడతో వెన్న చేసి నెయ్యి తయారు చేసే పద్ధతి వచ్చింది. అయితే.. ప్రస్తుత జనరేషన్​లో ఇవన్నీ చేయలేక పాల మీద మీగడతో నెయ్యి తయారు చేస్తున్నారు. స్వచ్ఛంగా, రుచికరంగా ఉంటుందీ నెయ్యి. మరి, దాన్ని ఎలా తయారు చేయాలంటే..

  • ముందుగా చిక్కటి పాలను తీసుకోవాలి. స్టవ్​ మీద బాగా మరిగించుకోవాలి.
  • ఇప్పుడు మరిగిన పాలను పూర్తిగా చల్లారనివ్వాలి. అప్పటికే పాలపై మీగడ ఏర్పడుతుంటుంది. పాలు పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్​లో పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత పాలమీద మీగడ మందంగా ఏర్పడుతుంది. అప్పుడు దానిని తీసుకుని కంటైనర్​లో స్టోర్​ చేసుకోవాలి.
  • ఇలా సుమారుగా 15 నుంచి 20 రోజుల పాటు మీగడను తీసి ఫ్రీజర్​లో స్టోర్​ చేసుకోవాలి.
  • కావాల్సినంత మీగడ తయారైందని అనుకున్నప్పుడు.. నెయ్యి తయారు చేసుకోవాలి.
  • దీనికోసం.. మిక్సీ జార్​ తీసుకుని అందులోకి మీగడ మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి పల్స్​ చేసుకోవాలి.
  • ఆ తర్వాత అందులోకి బాగా చల్లటి నీళ్లను కొన్ని పోసుకుని మరోసారి పల్స్​ చేసుకోవాలి. అంతే మిక్సీ గిన్నెలో వెన్న ముద్ద సెపరేట్​ అవుతుంది.
  • ఆ వెన్నముద్దను ఓ గిన్నె లోకి తీసుకుని కొన్ని నీళ్లు పోసుకుని కడగాలి. ఇలా ఓ రెండు సార్లు చేయాలి.
  • ఇప్పుడు ఆ గిన్నెను స్టవ్​ మీద పెట్టాలి. స్టౌ లో-ఫ్లేమ్​లో పెట్టి పెట్టి గరిటెతో కలుపుకుంటూ నెయ్యి ప్రిపేర్​ చేసుకోవాలి.
  • మంటను సిమ్​లోనే పెట్టి నెయ్యి మంచి వాసనతో బంగారు రంగులోకే మారే వరకు ఉంచుకుని స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి.
  • అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. నెయ్యి కొద్దిగా రంగు మారుతున్నప్పుడు స్టవ్​ ఆఫ్​ చేసుకోవాలి. ఎందుకంటే చల్లారేలోపు మరింత గోధుమ రంగులోకి వస్తుంది. అలా కాకుండా మీరు పూర్తిగా బంగారు రంగు వచ్చే వరకు ఉంచితే చల్లారేలోపు నెయ్యి మాడిపోయే అవకాశం ఉంటుంది.
  • ఇలా కాచిన నెయ్యిని పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత జార్​లో పోసుకుని స్టోర్​ చేసుకుంటే సరిపోతుంది. అంతే.. ఎంతో స్వచ్ఛమైన, రుచికరమైన, పూసపూసగా ఉండే నెయ్యి మీ ఇంట్లోనే సిద్ధమైపోతుంది.

సూపర్ టేస్టీ, స్పైసీ "నెల్లూరు నెయ్యి కారం దోశ" - నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోండిలా!

నెయ్యి ఇలా తీసుకుంటే - ఏ ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఎటాక్ చేయదు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.