ETV Bharat / offbeat

గోడలు మురికిగా మారాయా ? - ఈ టిప్స్​ పాటిస్తూ క్లీన్​ చేసి - దీపావళికి అందంగా మార్చండి! - WALL CLEANING TIPS IN TELUGU

-పండగ వేళ ఇంటి గోడల్ని మెరిపించాలా? -ఈ చిట్కాలతో ఎంతో ఈజీ

Cleaning Tips for Home
Cleaning Tips for Home (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 2:38 PM IST

Cleaning Tips for Walls : వెలుగుల పండగ దీపావళి కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చాలా మంది ఇంటిని శుభ్రం చేయడం, ఇంట్లోని పరుపులు, బెడ్ షీట్​లు, సోఫాసెట్లు క్లీనింగ్ చేసే పనిలో నిమగ్నమై ఉంటారు. అయితే, పండగ సమయంలో ఇళ్లు అందంగా కనిపించాలంటే.. ఇంట్లోని వస్తువులను క్లీన్​​ చేయడంతో పాటు, గోడలను కూడా మెరిపించాలి. అప్పుడే ఇళ్లు దీపాల కాంతులతో పండగనాడు వెలిగిపోతుంది. అందుకోసం కొన్ని టిప్స్​ తీసుకొచ్చాం. ఈ టిప్స్​ పాటించి సింపుల్​గా గోడలపైన ఉన్న జిడ్డు, నూనె మరకలను తొలగించండి. ఇంతకీ అవేంటంటే..

నీటితో కడగొద్దు : కొంతమంది గోడలపై నీళ్లు పోసి శుభ్రం చేస్తుంటారు. కానీ, ఎప్పుడూ ఇలా చేయకూడదు. దీనివల్ల గోడలపై ఉన్న పేయింట్​ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి గోడలపై ఉన్న దుమ్మును బ్రష్ లేదా డస్టర్‌తో శుభ్రం చేయడానికి ప్రయత్నించండి. పైన సీలింగ్​ను క్లీన్​ చేసేటప్పుడు ఫర్నీచర్​పై ఏదైనా వస్త్రం కప్పి ఉంచండి.

గోడలపై క్రెయాన్స్​ మరకలు మాయం చేయండిలా : కొంత మంది పిల్లలు గోడలపై క్రెయాన్స్, పెన్సిల్​తో గీతలు గీస్తుంటారు. అవి క్లీన్ ​చేస్తే ఓ పట్టాన పోవు. అయితే, వెనిగర్​తో ఈజీగా ఈ మరకలను తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. ముందుగా వెనిగర్‌, నీటిని సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఈ లిక్విడ్​లో స్పాంజ్​ ముంచి.. తర్వాత గట్టిగా పిండాలి. ఇప్పుడు స్పాంజ్​తో క్రెయాన్స్​ గీతలున్న చోట రాయాలి. ఒక నిమిషం తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి. మరకలు ఈజీగా తొలగిపోతాయి. గీతలు, మరకలు ఎక్కువగా ఉంటే ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

కిచెన్​లోని ఆయిల్​ మరకలు : వంట గదిలో కూరలో తాలింపు వేసిన ప్రతిసారీ టైల్స్​పై కొద్దిగా నూనె పడుతుంటుంది. అయితే, ఎక్కువ మంది మహిళలు వంట చేసే క్రమంలో నూనె మరకలను వెంటానే క్లీన్​ చేయకుండా మిగతా పనులు చేస్తుంటారు. కొన్నిరోజులకు టైల్స్​పై ఆయిల్​ మరకలు జిడ్డులా పేరుకుపోతుంటాయి. అయితే, ఈ మరకలను క్లీన్ చేయడానికి బేకింగ్​ సోడా, వెనిగర్ చాలా బాగా ఉపయోగపడతాయి. అందుకు గిన్నెలో కొద్దిగా బేకింగ్​ సోడా, వెనిగర్ వేసి పేస్ట్​లాగా తయారు చేసుకోవాలి. ముందుగా.. కొన్ని నీళ్లను టైల్స్​పై చల్లుకోవాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని పోయండి. కొద్దిసేపటి తర్వాత స్క్రబ్బర్​తో రుద్దండి. ఇప్పుడు వాటర్​తో క్లీన్​ చేస్తే సరిపోతుంది. టైల్స్​ కొత్త వాటిలా తళతళా మెరుస్తాయి.

లిక్విడ్‌ డిష్‌వాషర్‌ : గోడలపై నూనె మరకలను తొలగించడంలో లిక్విడ్‌ డిష్‌వాషర్‌ కూడా సహాయపడుతుంది. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్​లో కొద్దిగా లిక్విడ్‌ డిష్‌వాషర్‌ పోసుకొని గోడలపై మరకలు ఉన్న చోట అప్లై చేసి అలా గంటపాటు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి మెత్తని క్లాత్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు.

చెక్క పాత్రల జిడ్డు, మరకలు పోవట్లేదా? - ఇలా చేస్తే ఈజీగా తొలగిపోయి నీట్​గా ఉంటాయి!

ఎంత రుద్దినా పాత్రల జిడ్డు పోవడం లేదా? - ఒక్కసారి ఇలా క్లీన్​ చేయండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.