ETV Bharat / offbeat

మొక్కలు ఏపుగా పెరగాలంటే రసాయనాలే అవసరం లేదు! - ఈ పదార్థాలు వేసినా చాలు!

- అరటి తొక్క నుంచి కాఫీ పొడి దాకా - ఈ టిప్స్ పాటించారంటే మొక్కలు పెరుగుతాయి వేగంగా!

Best Tips for Gardening
GARDENING TIPS (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Oct 19, 2024, 10:42 AM IST

Best Tips for Gardening: ఇంటికి ఎన్ని రకాల డెకరేషన్స్ చేసినా.. ఎంతో ఖరీదైన వస్తువులున్నా.. మొక్కలతో వచ్చే అందమే వేరు. కళ్లకు, మనసుకు హాయినివ్వడమే కాదు.. ఇంట్లో స్వచ్ఛమైన గాలితో ఆరోగ్యం మెరుగుపడేందుకూ మొక్కలు దోహదం చేస్తాయి. అందుకే.. ఈ రోజుల్లో చాలా మంది.. ఇంటి ఆవరణలో రకరకాల కూరగాయలు, పండ్లు, రంగురంగుల పూలమొక్కలు పెంచుతున్నారు.

అయితే.. కొందరు అవి ఏపుగా పెరగాలనే ఉద్దేశంతో రసాయన ఎరువులు వాడుతుంటారు. కానీ.. కెమికల్స్ కాకుండా, మీరు చెత్త అని పడేసే కొన్ని పదార్థాలు నేచురల్​గా మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయంటున్నారు నిపుణులు. అవి సహజమైన ఎరువులుగా పనిచేసి.. ప్లాంట్స్ చక్కగా, ఆరోగ్యంగా, ఏపుగా పెరగడానికి సహాయపడతాయంటున్నారు. ఇంతకీ.. మొక్కల పెరుగుదలకు తోడ్పడే ఆ పదార్థాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

అరటితొక్క : మనలో చాలా మంది అరటిపండు తిన్నాక తొక్క తీసుకెళ్లి డస్ట్​బిన్​లో వేస్తుంటాం. కానీ.. అలా పడేయడం కంటే మీ ఇంట్లో ఉన్న మొక్కల మొదళ్ల వద్ద వేసి, కొద్దిగా మట్టి వేసేయండి. అది మట్టిలో కలిసిపోయి మంచి ఎరువుగా మారుతుందట. ముఖ్యంగా పూలమొక్కలకు వేసినట్లైతే పూలు పెద్దవిగా పూస్తాయంటున్నారు నిపుణులు.

కూరగాయ తొక్కలు : కూరగాయలు కట్ చేసినప్పుడు మిగిలే వ్యర్థాలు కూడా మొక్కల పెరుగుదలకు తోడ్పడతాయట. వాటిని చెట్ల మొదళ్లలో వేసినప్పుడు అందులోని పోషకాలు మొక్కలకి బలాన్నిస్తాయి. ఫలితంగా ప్లాంట్స్ ఆరోగ్యంగా పెరుగుతాయంటున్నారు.

కాఫీ పొడి : గులాబీ, టమాట మొక్కలకు కాఫీ పొడిని ఎరువుగా వేస్తే.. అవి ఏపుగా పెరగడంతోపాటు మంచి దిగుబడినీ ఇస్తాయని చెబుతున్నారు. ఇందుకోసం.. పది లీటర్ల నీటిలో రెండున్నర కప్పుల కాఫీ పొడిని కలిపి 2 నుంచి 3 రోజుల పాటు అలాగే ఉంచి.. ఆపై ఈ మిశ్రమాన్ని కుండీల్లోని మట్టిలో పోస్తే సరిపోతుంది.

గుడ్డు పెంకులు : చాలా మంది గుడ్డు పెంకులను బయట పడేస్తుంటారు. అలాకాకుండా వాటిని శుభ్రంగా కడిగి పొడి చేసి.. టమాటా, మిర్చి, పూలమొక్కలకు వేసుకోవచ్చు. ఆ పెంకుల్లో ఎక్కువమొత్తంలో ఉండే కాల్షియం మొక్కలు ఏపుగా పెరగడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. లేదంటే.. గుడ్డు పెంకులను డైరెక్ట్​గా చెట్ల మొదళ్ల వద్దనైనా వేసుకోవచ్చంటున్నారు. "National Center for Biotechnology Information" అనే సంస్థ చేపట్టిన ఓ అధ్యయనంలో కూడా గుడ్డు పెంకులలో ఉండే కాల్షియం మొక్కలు పెరుగుదలకు సహాయపడుతుందని కనుగొన్నారు. అందుకు సంబంధించిన రిపోర్టు కోసం ఈ లింక్​పై క్లిక్ చేయండి.

ఉల్లి పొట్టు : ఇది త్వరగా మట్టిలో కలసిపోయి ఎరువుగా మారుతుంది. అలాగే.. మొక్కలకు చీడపీడలు రాకుండా ఉల్లిపొట్టు కాపాడుతుంది. ఇందుకోసం ఉల్లిపొట్టుని నేరుగా కుండీల్లో వేస్తే సరిపోతుంది. లేదంటే.. వీటితో ప్రత్యేక ద్రావణాన్ని ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చు. అందుకోసం 5 లీటర్ల గోరువెచ్చని వాటర్​లో పది నుంచి ఇరవై గ్రాముల ఉల్లిపొట్టుని వేసుకొని 4 రోజుల పాటు అలాగే ఉంచాలి. తర్వాత దాన్ని మొక్కలపై స్ప్రే చేస్తే.. పురుగుమందుగా ఉపయోగపడుతుంది. అదే.. మొదళ్ల భాగంలో వేస్తే ఎరువుగానూ పనిచేస్తుందంటున్నారు.

గ్రీన్ టీ : మొక్కలు ఏపుగా పెరగడానికి గ్రీన్ టీ మిశ్రమం కూడా సహజమైన ఎరువుగా పని చేస్తుందంటున్నారు. ఇందుకోసం.. వాడేసిన గ్రీన్ టీ పొడిని మొక్కల మొదళ్లలో వేస్తే చాలు. అవి స్ట్రాంగ్​గా మారతాయి. అలాగే.. ఏడున్నర లీటర్ల వాటర్​లో ఒక గ్రీన్ టీ బ్యాగ్ వేసి పూర్తిగా నాననివ్వాలి. ఆపై టీబ్యాగుని బాగా పిండి ఆ నీటిని మొక్కలకు పోయాలి. ఇలా చేసినా మొక్కలకు మంచి సత్తువ లభిస్తుందంటున్నారు నిపుణులు.

ఇవీ చదవండి :

ఏసీ, కూలర్లే కాదు- ఈ మొక్కలు కూడా రూమ్​ను కూల్​గా మార్చేస్తాయట!

ఈ ఇండోర్‌ ప్లాంట్స్‌తో ఇంటికి వాస్తు, అందం - మనకు ఆనందం, ఆరోగ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.