How to Make Bengali Style Egg Curry : ఇంట్లో ఎలాంటి కూరగాయలూ లేకపోతే గుడ్డుతో ఏదో ఒక కూర వండేయడం మామూలే. అయితే, ఈసారి అదే గుడ్డుతో ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా ఇలా 'బెంగాలీ స్టైల్లో ఎగ్ కర్రీ' ప్రిపేర్ చేసుకోండి. ఇది అన్నం, రోటీ, పులావ్.. దేనికైనా మంచి కాంబినేషన్ అవుతుంది. మరి.. ఇంకెందుకు ఆలస్యం ఈ సండే చాలా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకొని.. ఇంటిల్లిపాది ఎంజాయ్ చేయండి. ఇంతకీ.. ఈ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- గుడ్లు - 4 నుంచి 6
- ఆవాల నూనె - 3 టేబుల్ స్పూన్లు
- ఆవాలు - అర టీస్పూన్
- ఎండుమిర్చి - 2
- ఉల్లిపాయ - 1 (పెద్ద సైజ్‌లో ఉన్నది)
- వెల్లుల్లి రెబ్బలు - 4
- అల్లంవెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్‌స్పూన్
- పచ్చిమిర్చి - 3
- టమాటాలు - 2(పెద్ద సైజ్‌లో ఉన్నవి)
- పసుపు - 1 టీ స్పూన్
- కారం - తగినంత
- ధనియాల పొడి - 1 టీస్పూన్
- జీలకర్ర పొడి - 1 టీస్పూన్
- గరం మసాలా - 1 టీస్పూన్
- ఉప్పు - రుచికి సరిపడా
- కొత్తిమీర తరుగు - కొద్దిగా(గార్నిష్ కోసం)
తయారీ విధానం :
- ముందుగా స్టౌపై ఒక గిన్నె పెట్టుకొని నీళ్లతో పాటు కొద్దిగా ఉప్పు వేసుకొని గుడ్లను ఉడికించుకోవాలి. అవి ఉడికాక వాటిని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి.
- అయితే, గుడ్లు ఉడికేలోపు రెసిపీలోకి కావాల్సిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను శుభ్రంగా కడిగి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే.. కొత్తిమీరను తరిగి పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఆవాల నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక.. ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లు అందులో వేసి అవి అన్ని వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆపై వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి.
- అనంతరం అదే పాన్‌లో మరికొంత ఆయిల్ వేసి వేడిచేసుకోవాలి. నూనె వేడెక్కాక.. ఆవాలు, ఎండుమిర్చి వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
- ఉల్లిపాయలు మంచిగా వేగాయనుకున్నాక.. టమాటా ముక్కలు వేసుకొని అవి సాఫ్ట్‌గా మారేంత వరకు వేయించుకోవాలి.
- అనంతరం ఈ మిశ్రమంలో.. పసుపు, కారం, ఉప్పు వేసి ఒకసారి కలపాలి. ఆపై అవి మాడకుండా కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పైన ఆయిల్ తేలేంత వరకు మిశ్రమాన్ని ఉడికించుకోవాలి.
- ఆ విధంగా ఉడికించుకున్నాక.. వేయించుకొని పక్కన పెట్టుకున్న ఎగ్స్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి.
- తర్వాత కాసేపు లో ఫ్లేమ్‌లో ఉడికించుకొని దింపే ముందు చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసుకొని దించుకుంటే చాలు. అంతే.. ఎంతో రుచికరంగా ఉండే "బెంగాలీ స్టైల్ ఎగ్ కర్రీ" రెడీ!
ఇవీ చదవండి :
ఆహా అనిపించే "ఆఫ్ఘాని ఎగ్ మసాలా"- సూపర్ టేస్టీ రెసిపీ - ఇంట్లో ఈజీగా చేసేయండి!
రైస్ కుక్కర్లో "ఎగ్ మసాలా దమ్ బిర్యానీ" - చాయ్ పెట్టినంత ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు!