World Lightest Hand Bag : అమ్మాయిలకు హ్యాండ్ బ్యాగులంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది మహిళల దగ్గర కనీసం రెండు, మూడు హ్యాండ్ బ్యాగులైనా ఉంటాయి. చిన్నగా చేత్తో పట్టుకొనే మోడల్ నుంచి పెద్దగా భుజాన వేసుకోవడం వరకు హ్యాండ్ బ్యాగులు వివిధ సైజుల్లో బోలెడు డిజైన్లతో ఆకర్షిస్తాయి. అలాగే ఇవి క్లాత్, లెదర్ ఇలా రకరకాల మెటీరియల్‌తో తయారు చేసి ఉంటాయి.
అయితే ప్రపంచంలోనే అత్యంత బరువు తక్కువైన హ్యాండ్ బ్యాగ్ గురించి తెలుసుకుంటే మాత్రం మీరు షాక్ అవుతారు. ఎందుకంటే ఈ బ్యాగ్ తయారీకి వాడిన పదార్ధం గాలి. అవును మీరు సరిగ్గానే చదివారు! ఈ బ్యాగ్‌ను 99 శాతం గాలి, ఒక శాతం గాజుతో తయారు చేశారు. ప్యారిస్ ఫ్యాషన్ వీక్‌లో ఫ్రెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ కోపర్ని కంపెనీ ఈ హ్యాండ్ బ్యాగ్‌ను రివీల్ చేసింది.
'ఎయిర్ స్వైప్'గా పిలిచే ఈ హ్యాండ్ బ్యాగ్ బరువు 37 గ్రాములే. అయితేనేం ఇది తన బరువు కన్నా 4000 రెట్లు ఎక్కువ బరువును మోయగలుగుతుంది. దీనిని రూపొందించడానికి కోపర్నికస్ బ్రాండ్ అమెరికన్ యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్ పరిశోధకుడు ఐయోనిస్ మిచెలౌడిస్ సహకరించారు. 27 X 16 X 6 సైజ్ ఉన్న హ్యాండ్ బ్యాగ్ ను తయారు చేయడానికి ముందు 15 నమూనాలు తయారు చేశారు.
ఈ హ్యాండ్ బ్యాగ్‌ను సిలికా ఎయిర్జెల్తో తయారు చేయగా, ఇది ప్రపంచంలోనే అత్యంత తేలికైన ఘన పదార్థమని చెప్పవచ్చు. చూడడానికి ఈ హ్యాండ్ బ్యాగ్ పర్సు గాజుదిలా కనిపించినా, అస్సలు పగలదని దీన్ని తయారు చేసిన వారు చెబుతున్నారు. దీంతోపాటు పలు విషయాలను షేర్ చేస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకోండి మరి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
Best Tips to Purchase A Perfect Handbag : అయితే ఆడవాళ్ల అలంకరణలో హ్యాండ్ బ్యాగ్ కూడా కీలకమైనదే. పర్ఫెక్ట్ బ్యాగ్ సెలక్ట్ చేసుకోవడంలో చాలా మంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ లింక్‌పై క్లిక్ చేయండి.