ETV Bharat / international

బంగారం గనిలో ప్రమాదం- 14మంది మృతి- లోపల అనేక మంది! - Gold Mine Collapse in venezuela

Venezuela Gold Mine Collapse : వెనెజువెలాలో చట్టవిరుద్ధంగా నిర్వహిస్తున్న బంగారు గని కూలిపోవడం వల్ల 14 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు.

Venezuela Gold Mine Collapse
Venezuela Gold Mine Collapse
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 22, 2024, 8:29 AM IST

Updated : Feb 22, 2024, 8:34 AM IST

Venezuela Gold Mine Collapse : వెనెజువెలాలో అక్రమంగా నిర్వహిస్తున్న ఓ బంగారు గని కూలిపోయి 14 మంది మరణించారు. అనేక మంది గాయపడ్డారు. ఇంకొందరు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అంగోస్తురా మున్సిపాలిటీలోని బులాలోకా గని వద్ద మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. గంటసేపు బోటులో ప్రయాణిస్తేకానీ ప్రమాదం జరిగే ప్రాంతానికి చేరుకోవడం కష్టం.

'మృతుల సంఖ్య పెరిగే అవకాశం'
ఇప్పటి వరకు 14 మంది మృతదేహాలను వెలికితీశామని బొలివర్​ గవర్నర్​ ఏంజెల్​ మార్కానో తెలిపారు. 11 మంది గాయపడినట్లు చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంగోస్తురా మేయర్‌ పేర్కొన్నారు. రెస్క్యూ ఆపరేషన్​ను కొనసాగిస్తున్నామని వెల్లడించారు. సహాయక చర్చల్లో వేగం పెంచాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

'హెలికాప్టర్లు ఏర్పాటు చేయండి'
బాధితుల కుటుంబసభ్యులంతా లా పరాగ్వాకు చేరుకున్నారు. ఘటనాస్థలి నుంచి గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించడానికి హెలికాప్టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మృతదేహాలు త్వరగా కుళ్లిపోయే పరిస్థితి ఉందని, వెంటనే తమకు అప్పగించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సహాయం చేయాలని వేడుకుంటున్నారు.

కొన్నిరోజుల క్రితం, దక్షిణ అమెరికా దేశమైన సురినామ్​ రాజధాని ​పరామారిబోలో ఇలాంటి ఘటనే జరిగింది. నగరంలో ఉన్న బంగారు గనిలో అక్రమంగా పసిడిని తవ్వేందుకు వెళ్లి 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా బంగారు గని కూలడం వల్ల వీరంతా చనిపోయారని ఆ దేశ అధ్యక్షుడు చాన్ సాంటోకి వెల్లడించారు.

'ఇక్కడ ఇది సర్వసాధారణమే..'
అక్రమంగా బంగారాన్ని తవ్వేందుకు ​పరామారిబో ప్రాంతానికి చెందిన 10 మంది బంగారు గనికి వెళ్లారు. ఆ సమయంలో ప్రమాదవశాత్తు గనిలోని కొంత భాగం కూలిపోయింది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి రెస్క్యూ సిబ్బందిని పంపించారు. వారు అక్కడకు చేరుకునేలోపే మైనింగ్​కు వెళ్లినవారంతా మరణించారు. ఇలా అక్రమ బంగారం తవ్వకాలకు వెళ్లడం ఈ ప్రాంతంలో సర్వసాధారణమని అధికారిక వర్గాలు చెప్పాయి. బంగారం మైనింగ్ కోసం కొందరు సొంతంగా సొరంగ మార్గాలను నిర్మించుకున్నారని తెలిపారు. ఈ పూర్తి వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

బంగారం తవ్వడానికి వెళ్తూ 17 మంది మృతి

బంగారం గనిలో ప్రమాదం- 38 మంది మృతి

Last Updated : Feb 22, 2024, 8:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.