ETV Bharat / international

'అదంతా తూచ్​- ట్రంప్​, పుతిన్ ఫోన్​లో మాట్లాడుకోలేదు'

అమెరికా ప్రెసిడెంట్​ డొనాల్డ్​ ట్రంప్​తో, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్లో మాట్లాడుకోలేదట- క్లారిటీ ఇచ్చిన రష్యా

Trump Putin Phone Call
Trump Putin Phone Call (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 11, 2024, 5:04 PM IST

Trump Putin Phone Call : ఇటీవల జరిగిన అమెరికా ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్​తో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్​లో మాట్లాడారని వచ్చిన వార్తలను రష్యా ఖండించింది. వారివురి మధ్య ఎలాంటి సంభాషణలు జరగలేదని వెల్లడించింది. ఆ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని, అదంతా తప్పుడు ప్రచారమని చెప్పింది.

గత గురువారం ఫోర్లిడాలోని తన ఎస్టేట్‌ నుంచి ట్రంప్‌, పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రముఖ అమెరికన్ మీడియా సంస్థ వాషింగ్టన్‌ పోస్ట్‌ ఓ కథనంలో పేర్కొంది. ఉక్రెయిన్‌ యుద్ధాన్ని విస్తరించొద్దని కోరినట్లు చెప్పింది. యుద్ధంపై పరస్పరం చర్చించి ఓ పరిష్కారాన్ని కనుగొందామని రష్యా అధినేతకు సూచించినట్లు వెల్లడించింది. దీనిపైనే తాజాగా రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ స్పందించింది.

"సమాచారం నాణ్యత ఏ స్థాయిలో ఉంటుందో ఈ కథనాలను చూస్తుంటే అర్థమవుతుంది. ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ఈ సమాచారం పూర్తిగా అవాస్తవం. ఇదంతా ఊహాజనిత, తప్పుడు సమాచారం" అని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ కొట్టిపారేశారు. ట్రంప్​, పుతిన్ మధ్య చర్చల కోసం ప్రస్తుతానికి ఎలాంటి ప్రణాళికలు లేవని వెల్లడించారు.

అయితే తాను అధికారంలోకి వస్తే ఒక్క రోజులో ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాన్ని ముగిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ వ్యాఖ్యలు చేశారు. అందుకు అనుగుణంగానే ఇటీవల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడిన ఆయన, తాను యుద్ధం ప్రారంభించబోనని, దాన్ని ముగించేందుకు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు.

మరోవైపు, అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్​ ట్రంప్‌నకు ఇటీవల పుతిన్‌ అభినందనలు తెలిపారు. ఎన్నికల ఫలితాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు బదులిచ్చిన పుతిన్, ట్రంప్‌ ధైర్యవంతుడని, ఆయనతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. అని అన్నారు. ఉక్రెయిన్‌ వివాదానికి 24 గంటల్లో ముగింపు పలకగలనన్న ట్రంప్ సూచనను గతంలో రష్యా స్వాగతించింది.

ఇటీవల, ఉక్రెయిన్‌ యుద్ధం ముగించడం, అమెరికాతో సంబంధాల పురోగతిపై పుతిన్‌ వ్యాఖ్యల నేపథ్యంలో చైనా స్పందించింది. అది ఆ రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారంగా పేర్కొంది. రష్యాతో తమది నవశక వ్యూహాత్మక భాగస్వామ్యంగా అభివర్ణించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.