ETV Bharat / international

పాక్​లో ఆత్మాహుతి దాడి - ఆరుగురు పోలీసులు సహా 8మంది మృతి!

పాకిస్థాన్​లో ఆత్మాహుతి దాడి - ఎన్​ఫోర్స్​మెంట్ సిబ్బంది సహా 8 మంది మృతి

Terror Attack In Pakistan 2024
Terror Attack In Pakistan 2024 (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 26, 2024, 5:22 PM IST

Updated : Oct 26, 2024, 5:40 PM IST

Terror Attack In Pakistan 2024 : పాకిస్థాన్​లోని ఖైబర్ పఖ్తుంక్వాలో శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 8మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. మరణించిన వారిలో నలుగురు పోలీసులు, ఇద్దరు సైనికులు కాగా, మరో ఇద్దరు పౌరులు ఉన్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనుపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఆఫ్ఘాగానిస్థాన్​ సరిహద్దులో ఉన్న నార్త్ వజీరిస్థాన్​ జిల్లాలోని అలీ తహసీల్​ అస్లాం చెక్​ పోస్ట్ వద్ద ఈ ఘటన జరిగింది. శనివారం త్రీ వీలర్ వెహికల్​పై వచ్చిన నిందితుడు చెక్​ పోస్టు, భద్రతా దళాల వాహనాలను ఢీకొట్టి ఆత్మాహుతికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు.

ఇరాన్ పోలీస్‌ కాన్వాయ్‌పై దాడి
ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలో పోలీస్‌ కాన్వాయ్‌పై భారీ దాడి జరిగింది. ఈ దాడి వల్ల ఆ దేశ జాతీయ పోలీసు దళానికి చెందిన 10 మంది అధికారులు మరణించారు. ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోహర్ కుహ్‌లో ఈ దాడి జరిగినట్లు, అధికారిక మీడియా తెలిపింది. అయితే ఈ దాడి ఎవరు చేశారో ఇంకా తెలియరాలేదు. ఇప్పటి వరకు ఏ సంస్థ - ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన చేయలేదు. శనివారం తెల్లవారు జామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ భారీ దాడులకు పాల్పడింది. ఆ తరువాత పోలీస్ కాన్వాయ్‌పై దాడి జరగడం గమనార్హం.

Last Updated : Oct 26, 2024, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.