Telugu People Influence On America Elections : అగ్రరాజ్యం అమెరికాతో తెలుగువారికి విడదీయరాని సంబంధం ఉంది. తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అమెరికాలో ఉపాధి వెతుకుకుంటూ పయనమవుతారు. అధ్యక్ష ఎన్నికల వేళ అక్కడి తెలుగువారు కమలా హారిస్, లేదా డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలో ఏర్పాటయ్యే నూతన అమెరికా ప్రభుత్వం నుంచి పలు విధానాలను ఆశిస్తున్నారు. H-1B వీసా విధానాల్లో మార్పులను వారు ముఖ్యంగా కోరుకుంటున్నారు.
"H-1B వీసా, గ్రీన్ కార్డు- ఈ రెండింటికి ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఉంది. ఒక హెచ్1బీ వీసా పరిధిలో కుటుంబం మొత్తం వస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తికి హెచ్1బీ వీసా ఉంటే, అతడి ఇద్దరు పిల్లలు భార్య దాని పరిధిలోకి వస్తారు. కానీ గ్రీన్ కార్డు విషయంలో హెడ్ కౌంట్ చేస్తున్నారు. కానీ కొందరు నిపుణుల ప్రకారం హెడ్ కౌంట్ చేయాలని రూల్ లేదు. ఈ చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్‌ను సాల్వ్ చేస్తే ఇండియన్స్‌కు ఒకటికి నాలుగు గ్రీన్‌కార్డులు వస్తాయి. ఏ ప్రభుత్వం వచ్చిన ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మరో సమస్య అక్రమ వలస. అలాంటి వారిని ఇక్కడికి విపరీతంగా తెప్పిస్తున్నారు. వారిని హోటల్స్ నిండా నింపి, సదుపాయాలు అన్ని కల్పిస్తున్నారు. దాని బదులు వారిని రాకుండా చేయొచ్చు. ఒకవేళ వచ్చినా వారికి వర్క్ పర్మిట్ కల్పిస్తే ఎకానమీకి కంట్రిబ్యూట్ చేస్తారు. మరో సమస్య ఏంటంటే, నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అమెరికాలో సాధారణంగా రేట్లు పెరగవు. కానీ గత నాలుగేళ్లలో దాదాపు రెట్టింపు అయ్యాయి. ఇంకోటి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాల్లో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండాలి. దానివల్ల ప్రయోజనాలేవీ లేవు. అలా జోక్యం చేసుకోకుండా ఉంటే ఎకానమీ బాగుంటుంది. డబ్బులు సేవ్ అవుతాయి."
-- ప్రవాస భారతీయుడు
అక్రమవలసలు, వీసావిధానాల్లో మార్పులు సహా భారతీయ సంస్కృతిని ప్రోత్సహించేందుకు కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అమెరికాలోని తెలుగు వారు ఆకాంక్షిస్తున్నారు. డెమొక్రట్లు, రిపబ్లికన్లలో అధికారంలోకి ఎవరు వచ్చినా తెలుగు సంప్రదాయాలు, మత విశ్వాసాలు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండేలా చర్యలు తీసుకుంటే బాగుంటుందని తెలుగు వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.
"తెలుగు భాష ప్రాముఖ్యం ప్రపంచం మొత్తం తెలిసేలా చర్యలు తీసుకోవాలి. కళాకారులను ప్రోత్సహించాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన తెలుగు సంస్కృతి, కళలకు గుర్తించి ప్రోత్సహించేలా ఉండాలి"
-- ప్రవాస భారతీయుడు
అమెరికాలో తెలుగువారు సహా అందరినీ భయపెట్టే మరో అంశం అబార్షన్ హక్కులు. ట్రంప్ వస్తే గర్భస్రావంపై నిషేధం విధిస్తారన్న భయాలు తెలుగు కమ్యూనిటీలోనూ ఉన్నాయి. దానితో పాటు ధరల పెరుగుదల వారిని ఆందోళనకు గురి చేస్తోంది. భారతీయుల సగటుతో పోల్చితే తెలుగువారికి అమెరికా పౌరసత్వం తక్కువగా ఉంది. అమెరికాలో చాలామంది తెలుగువారికి ఓటు హక్కు లేకపోయినా తమ భవిష్యత్తును శాసించే అమెరికా ఎన్నికల ఫలితాలపై మాత్రం వారు ఆసక్తిగా ఉన్నారు.
బంగ్లాలో హిందువులపై దాడిని ఖండిస్తున్నా- భారత్‌తో మంచి రిలేషన్: ట్రంప్
ఎన్నికల సర్వేలు నిజమవుతాయ్! బెట్టింగ్ మార్కెట్లో ట్రంప్ హవా- అమెరికా తదుపరి అధ్యక్షులు వారే!