Sydney Stabbing Attacker : షాపింగ్ మాల్‌లో ఉన్మాది బీభత్సం.. కత్తి పట్టుకుని తిరుగుతూ విచక్షణారహితంగా దాడులు.. భయంతో జనం పరుగులు.. నిమిషాల వ్యవధిలోనే గాల్లో కలిసిన ఆరు ప్రాణాలు.. మృతుల్లో ఐదుగురు మహిళలే.. మిగిలిన ఒక్కరు వారిని కాపాడేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డ్.. శనివారం మధ్యాహ్నం సిడ్నీలో జరిగిన ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. అయితే, చనిపోయిన వారిలో అత్యధికులు మహిళలే కావడం ఏమాత్రం యాదృచ్ఛికం కాదని తెలిసింది. ఆ ఉన్మాది కావాలనే ఆడవారిని లక్ష్యంగా చేసుకుని హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
మరోవైపు నిందితుడిని కనుగొన్న పోలీసులు, అతడిని క్వీన్స్‌ల్యాండ్‌కు చెందిన జోయెల్ కౌచీ(40)గా గుర్తించారు. కౌచీ కేవలం మహిళలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు స్పష్టంగా కనిపిస్తుందని న్యూ సౌత్ వేల్స్ పోలీస్ కమిషనర్ కారెన్ వెబ్ తెలిపారు. ఇందుకోసం పురుషుల జోలికి వెళ్లలేదని చెప్పారు. ఈ దాడిలో మొత్తం తొమ్మిది నెలల చిన్నారి సహా ఆరుగురు మరణించగా అందులో ఐదుగురు మహిళలే ఉన్నారు. దాడి చేసే సమయంలో అడ్డుకున్నందుకే పురుషుడిని (30 ఏళ్ల పాకిస్థానీ సెక్యూరిటీ గార్డ్‌ను) చంపినట్లు పోలీసులు వివరించారు. మరోవైపు గుర్తు తెలియని మానసిక సమస్యల వల్లే నిందితుడు ఈ దాడికి పాల్పడ్డాడని, ఘటన వెనుక ఎలాంటి ఉగ్రహస్తం లేదని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తెలింది.
సిడ్నీలోని వెస్ట్‌ఫీల్డ్ షాపింగ్ మాల్‌లో శనివారం మధ్యాహ్నం 3.10 గంటల సమయంలో ఓ దుండగుడు కత్తితో దాడి చేసి ఓ చిన్నారి ఆరుగురిని హతమార్చాడు. మరో 12 మంది క్షతగాత్రులయ్యారు. షాపింగ్ సెంటర్లో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కత్తితో దాడులకు పాల్పడుతున్నట్టు సమాచారం రావడం వల్ల పోలీసులు, అత్యవసర సేవల బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే ఓ మహిళా పోలీస్ ఇన్‌స్పెక్టర్‌పైనా దాడి చేసేందుకు ప్రయత్నించగా, ఆమె జరిపిన కాల్పుల్లో నిందితుడు మృతిచెందాడు.
ప్రధాని దిగ్భ్రాంతి
సిడ్నీ షాపింగ్ మాల్‌లో జరిగిన దాడిపై ఆస్ట్రేలియా ప్రజలు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ముఖ్యమైన ప్రదేశాల్లో జాతీయ జెండాలను కిందకు దించి సానుభూతి తెలిపారు. ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోని ఆల్బనీస్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇది అత్యంత విషాదకరమైన ఘటన అని చెప్పారు. బాధిత కుటుంబాల బాధ తనను కలిచివేస్తోందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
పాకిస్థాన్‌లో రెచ్చిపోయిన ముష్కరులు- 11మందిని చంపిన మిలిటెంట్లు - Pakistan Militants Killed People