ETV Bharat / international

సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా- కారణం అదే! - Sunita Williams Space Mission - SUNITA WILLIAMS SPACE MISSION

Sunita Williams Space Mission Halted : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక ఇంజిన్​లో వాల్వ్​ సమస్య తలెత్తడం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశారు.

Sunita Williams Space Mission Halted
Sunita Williams Space Mission Halted (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : May 7, 2024, 7:34 AM IST

Updated : May 7, 2024, 8:29 AM IST

Sunita Williams Space Mission Halted : సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్ర వాయిదా పడింది. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక ఇంజిన్​లో వాల్వ్​ సమస్య తలెత్తడం వల్ల ప్రయోగాన్ని నిలిపివేశారు. అట్లాస్​ రాకెట్​లోని అప్పర్​ స్టేజ్​లో ఆక్సిజన్​ వాల్వ్​ సమస్య ఏర్పడిందని యూనైటెడ్ లాంఛ్ అలయన్స్ ఇంజినీర్ దిల్లాన్ రైస్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని తిరిగి ఏప్పుడు చేపడతారనే దానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

స్టార్‌లైనర్‌ అభివృద్ధిలో అనేక ఇబ్బందులు తలెత్తాయి. ఇంతకుముందు క్యాప్యూల్​ సమస్య కారణంగా కొన్నాళ్లు ఆలస్యం అయింది. ఇలా ఈ ప్రాజెక్టులో చాలా సంవత్సరాలు జాప్యం జరిగింది. ఈ యాత్ర విజయవంతమైతే ఐఎస్‌ఎస్‌కు వ్యోమగాములను చేరవేసే రెండో వ్యోమనౌక అమెరికాకు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. ప్రస్తుతం స్పేస్‌ఎక్స్‌ వ్యోమనౌక ఈ సేవలు అందిస్తోంది. స్టార్‌లైనర్‌తో మానవసహిత యాత్ర నిర్వహించడం ఇదే మొదటిసారి.

మిషన్‌ పైలట్‌గా సునీతా విలియమ్స్
ఇదిలా ఉండగా, భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌, ఈ బోయింగ్​ స్టార్​ లైనర్​లోనే మూడోసారి రోదసి యాత్రకు వెళ్లాల్సి ఉంది. ఇందులో సునీతా విలియమ్స్ మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి, ఐఎస్‌ఎస్‌కు చేరుకుని అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు. ఇలా ఈ ప్రయోగం ద్వారా స్పేస్‌ క్రాఫ్ట్‌ శక్తిసామర్థ్యాల్ని నాసా పరిశీలించనుంది. ఈ పర్యటన విజయవంతమైతే అంతరిక్ష కేంద్రానికి సిబ్బందితో కూడిన మిషన్ల కోసం స్టార్‌ లైనర్‌ను సర్టిఫై చేసే ప్రక్రియను నాసా ప్రారంభిస్తుంది.

రోదిలోకి గణనాథుడు
గణేషుడు తన అదృష్ట దైవం అని, అందుకే ఆయన విగ్రహం తన వెంట తీసుకెళుతున్నానని సునీతా విలియమ్స్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 'నేను ఆధ్యాత్మికవాదిని. ఇంటర్నేషనల్ స్పేస్​ స్టేషన్(ISS)కు వెళ్తుంటే, సొంతింటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది" అని సునీతా పేర్కొన్నారు. స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర కావడం వల్ల ఒకింత ఆత్రుతగా ఉందని చెప్పారు. అయినప్పటికీ గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదని, రోదసిలో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టమని వెల్లడించారు. సునీత ఒక మారథాన్‌ రన్నర్‌. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు. గతంలో ఆమె 2006, 2012లో రోదసిలోకి వెళ్లారు. మొత్తం 50 గంటల 40 నిమిషాల పాటు స్పేస్‌వాక్‌ నిర్వహించారు. 322 రోజలపాటు అంతరిక్షంలో గడిపారు.

7 నెలల కాల్పుల విరమణకు హమాస్​ ఓకే- రఫాపై దాడి ప్రకటన వెంటనే అంగీకారం - israel hamas ceasefire

ఆస్ట్రేలియా వీసాల కోసం ఇక టోఫెల్ స్కోర్ ఓకే- విదేశాలకు వెళ్లే విద్యార్థులకు గుడ్​ న్యూస్​ - Australia Valids TOEFL Score

Last Updated : May 7, 2024, 8:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.