ETV Bharat / international

ఉక్రెయిన్​పై రష్యా మరోసారి దూకుడు - డ్రోన్లు, క్షిపణులతో కీవ్​పై దాడి - Russia Ukraine War - RUSSIA UKRAINE WAR

Russia Drone Attack On Ukraine : రష్యా-ఉక్రెయిన్‌ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యా డ్రోన్స్, క్రూయజ్, బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది.

Russia Drone Attack On Ukraine
Russia Drone Attack On Ukraine (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 9:49 AM IST

Updated : Sep 2, 2024, 12:12 PM IST

Russia Drone Attack On Ukraine : ఉక్రెయిన్​పై రష్యా మరోసారి విరుచుకుపడింది. డ్రోన్స్, క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులను ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు కీలక నగరాలపై ప్రయోగించింది. సోమవారం తెల్లవారుజామున కీవ్​లో అనేక వరుస పేలుళ్లు సంభవించాయని ఉక్రెయిన్ వైమానిక దళం తెలిపింది. వెంటనే అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొంది.

శిథిలాల పడి ఒకరికి గాయాలు
కీవ్​లోని హోలోసివ్​స్కీ, సోలోమియాన్​స్కీ జిల్లాలకు అత్యవసర సేవలను రప్పించినట్లు కీవ్ మేయర్ విటాలి క్లిట్‌ ష్కో తెలిపారు. షెవ్​చెంకివ్​స్కీ జిల్లాలో శిథిలాలు పడటం వల్ల ఒకరు గాయపడినట్లు వెల్లడించారు. మరోవైపు, ప్రతిదాడికీ తిరిగి సమాధానం ఉంటుందని, శత్రువు తప్పకుండా దాన్ని స్వీకరించాల్సి వస్తుందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయ అధిపతి ఆండ్రీ యెర్మాక్ తన టెలిగ్రామ్ అకౌంట్​లో పోస్ట్ చేశారు.

ఖార్కివ్​పైనా క్షిపణి దాడులు
10కి పైగా క్రూయిజ్, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్స్​తో రష్యా దాడులకు పాల్పడిందని కీవ్ నగర సైనిక పరిపాలనా అధిపతి సెర్హా పాప్కో తెలిపారు. మరోవైపు, ఉక్రెయిన్‌లోని రెండవ అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లో కూడా పేలుడు సంభవించిందని ఉక్రెయిన్ మీడియా పేర్కొంది. ఈ విషయాన్ని ఖార్కివ్ ప్రాంత అధిపతి ఒలేహ్ సినీహుబోవ్ ధ్రువీకరించారు. ఖార్కివ్​లోని ఇండస్ట్రియల్ని జిల్లాపై సోమవారం తెల్లవారుజామున వైమానిక దాడులు జరిగాయని పేర్కొన్నారు. ఈ దాడి వల్ల ఒక నివాస భవనం, అనేక ఇతర నివాస సముదాయాలకు నిప్పంటుకుందని చెప్పారు.

ఉక్రెయిన్ దాడికి ప్రతిదాడి చేసిన రష్యా
శనివారం అర్ధరాత్రి ఉక్రెయిన్‌ ఏకంగా 158 డ్రోన్లను రష్యాపై ప్రయోగించింది. వీటిని రష్యా కూల్చివేసింది. మాస్కోలోని రెండు ప్రాంతాలతోపాటు మరో 9 చోట్ల ఈ దాడులు జరిగాయి. అయితే ఇందులో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా రక్షణశాఖ అధికారులు తెలిపారు. కస్క్‌ ప్రాంతంలో 46 డ్రోన్ల దాడులు జరిగాయి. బ్రియాన్స్క్‌లో 34, వోరోనెజ్‌లో 28, బెల్గోరోడ్‌లో 14 డ్రోన్లతో దాడులు జరిగాయి. ఇవన్నీ ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలే. వీటితోపాటు రష్యా లోపలికి చొచ్చుకెళ్లి మరీ ఉక్రెయిన్‌ డ్రోన్‌ దాడులు జరిపింది. అందులో మాస్కోకు సమీపంలోని త్వెర్, ఇవానోవో ప్రాంతాలున్నాయి. ఈ దాడులు జరిగిన మరుసటి రోజే ఉక్రెయిన్ పై రష్యా విరుచుకుపడింది. క్షిపణులతో దాడులు చేసింది.

200 క్షిపణులు, డ్రోన్లతో రష్యా భీకర దాడి- ఉక్రెయిన్ కూడా తగ్గేదేలే! - Russia Ukraine War

ఉక్రెయిన్ పట్టణాలను చుట్టుముట్టిన రష్యా- డొనెట్స్క్ స్వాధీనం దిశగా పుతిన్ మాస్టర్​ ప్లాన్! - Russia Attack On Ukraine

Last Updated : Sep 2, 2024, 12:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.