ETV Bharat / international

పుతిన్ దోస్త్​ మేరా దోస్త్- ప్రపంచాన్ని ఎదురించి మరీ కిమ్​కు స్పెషల్ గిఫ్ట్

Putin Kim Car Gift : రష్యా అధ్యక్షుడు పుతిన్ కొరియా అధినేతకు కారును కానుకగా పంపారు. అంతర్జాతీయ ఆంక్షలు ఉన్నప్పటికీ లగ్జరీ కారును కొరియాకు పంపినట్లు తెలుస్తోంది. కిమ్ సోదరి ఈ కారును అందుకున్నట్లు కొరియా న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Putin Kim Car Gift
Putin Kim Car Gift
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 20, 2024, 9:43 AM IST

Putin Kim Car Gift : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్​కు కారును కానుకగా పంపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. వ్యక్తిగత అవసరాలకు ఉపయోగించుకునేందుకు ఆ కారును పుతిన్ ఇచ్చినట్లు సమాచారం. ఇరువురి మధ్య మైత్రికి ప్రత్యేక గుర్తుగా రష్యాలో తయారైన ఈ కారును పుతిన్ పంపినట్లు కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఫిబ్రవరి 18న కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ ఈ కారును అందుకున్నారు. ఈ సందర్భంగా రష్యాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచదేశాల ఆంక్షలు ఉల్లంఘించి!
పుతిన్ పంపిన కారు ఏ రకానికి చెందినది, ఎలా దాన్ని తరలించారనే విషయాలపై స్పష్టత లేదు. అయితే, కొరియాకు లగ్జరీ వస్తువుల రవాణాపై ఆంక్షలు ఉన్నాయి. ఆ దేశం అణ్వాయుధాల అభివృద్ధిని నిలిపివేయాలని ఐరాసలో తీర్మానం సైతం చేశారు. ఈ నేపథ్యంలో పుతిన్ ఈ వాహనాన్ని పంపించడం ప్రపంచ దేశాల ఆంక్షల ఉల్లంఘన కిందకే వస్తుందని నిపుణులు చెబుతున్నారు.

యుద్ధానికి కిమ్ సాయం!
కాగా, కొరియాతో పాటు రష్యాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో కిమ్ రష్యా పర్యటనకు వెళ్లారు. ఇరువురు మాస్కోలో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక బంధాన్ని మరింత దృఢంగా మార్చుకోవాలని నిర్ణయించారు. ఉక్రెయిన్​పై చేస్తున్న యుద్ధంలో రష్యాకు కిమ్ సహకరిస్తున్నట్లు అంతర్జాతీయ నిపుణులు అనుమానిస్తున్నారు. రాకెట్లు, క్షిపణులు సహా అనేక రకాల ఆయుధాలను ఉత్తర కొరియా సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే, కొరియా మాత్రం వీటన్నింటిని ఖండించింది.

కిమ్ ఆసక్తిని గమనించి!
కిమ్ జోంగ్ ఉన్​కు వాహనాలంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టమని ప్రచారంలో ఉంది. ఆయన వద్ద టాప్ లగ్జరీ కార్లు అనేకం ఉన్నట్లు సమాచారం. అవన్నీ కొరియాకు అక్రమంగా రవాణా చేసినవేనని చెబుతుంటారు. సెప్టెంబర్​లో రష్యా పర్యటనకు వెళ్లిన సమయంలో పుతిన్​కు చెందిన 'ఆరస్ సెనేట్ లిమోసిన్​' కారును కిమ్ ఆసక్తిగా పరిశీలించినట్లు కథనాలు వెలువడ్డాయి. కిమ్ ఆసక్తిని గమనించి ఆయన్ను తన కారులో పుతిన్ ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. కిమ్ వద్ద మెర్సిడెస్, రోల్స్ రాయిస్, మేబ్యాక్, లెక్సస్​ వంటి కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లు ఉన్నట్లు తెలుస్తోంది.

కిమ్‌ కవ్వింపు- సముద్రగర్భ 'అణు' డ్రోన్‌ పరీక్ష- అమెరికా, జపాన్​కు వార్నింగ్!

కిమ్ కటీఫ్- దక్షిణ కొరియాతో మాటలు బంద్- త్వరలో రాజ్యాంగ సవరణ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.