ETV Bharat / international

జనాలపైకి దూసుకెళ్లిన వాహనం- 35మంది మృతి- విషయం బయటకు పొక్కకుండా భారీగా సెన్సార్!

చైనాలో ఘోర ప్రమాదం- జనాలపైకి దూసుకెళ్లిన వాహనం- 35మంది మృతి

Road Accident In China Today
Road Accident In China Today (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 12, 2024, 4:50 PM IST

Updated : Nov 12, 2024, 5:34 PM IST

Road Accident In China Today : చైనాలోని జుహైలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ స్పోర్ట్స్​ సెంటర్​లో వ్యాయామం చేస్తున్న జనాలపైకి వాహనం దూసుకెళ్లిన ఘటనలో 35మంది మృతి చెందారు. మరో 43మందికి గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి 62ఏళ్ల డ్రైవర్​ను అరెస్టు చేసినట్లు సోమవారం పోలీసులు వెల్లడించారు. అయితే అది దాడి అయి ఉంటుందా లేదా ప్రమాదమా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో చనిపోయిన వారి వివరాలను చైనా అధికారికి మీడియా సంస్థ Xinhua వెల్లడించింది. ఈ ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ స్పందించారని, క్షతగాత్రులకు మెరిగైన చికిత్స అందించాలని ఆదేశించినట్లు తెలిపింది. నిందితులను చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసినట్లు పేర్కొంది.

రన్నింగ్ ట్రాక్​పై పడిపోయిన ప్రజలు
ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియోను లీ యాంగ్ అనే న్యూస్ బ్లాగర్​ షేర్​ చేశారు. అందులో అగ్నిమాపక సిబ్బంది ఓ వ్యక్తికి సీపీఆర్​ చేస్తున్నట్లు ఉంది. డజన్లకొద్దీ మంది రన్నింగ్ ట్రాక్​పై పడిపోయి ఉన్నారు. మరో వీడియోలో ఓ మహిళ 'నా కాలు విరిగిపోయింది' అంటూ ఆర్తనాదాలు చేసింది.

'సమాచారం బయటకు పొక్కకుండా సెన్సార్'
అయితే జుహై​లో మంగళవారం ప్రతిష్టాత్మక ఎయిర్​ షో ఓపెన్ అయిన నేపథ్యంలో- ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని భారీగా సెన్సార్​ చేస్తున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ ఘటనకు సంబంధించి సోషల్​ మీడియాలో సెర్చ్​లను సెన్సార్ చేస్తున్నారు. చైనా సొంత ట్విట్టర్​, వీబో(Weibo)లో ఈ ఘటన గురించి ఒకట్రెండు పోస్టులు మాత్రమే ఉన్నాయి. అందులో కూడా ఫొటోలు, వీడియోలు లేకుండా ఏదో ఘటన జరిగిందన్న సమాచారంతో ఉన్నాయి. ఇక ఈ ఘటనకు సంబంధించి చైనా మీడియా సోమవారం రాత్రి రాసిన ఆర్టికల్స్​ను తొలగించారు.

Last Updated : Nov 12, 2024, 5:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.