PM Modi BRICS Summit : బ్రిక్స్ కూటమి 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యాలోని కజాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మోదీకి ఘన స్వాగతం లభించింది. ఆ తర్వాత తాను బస చేస్తున్న హోటల్‌కు చేరుకున్న ప్రధానికి ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అక్కడే వారితో కొద్ది సేపు సంభాషించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో బ్రిక్స్ కూటమి నేతలతో ప్రధాని మోదీ పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
#WATCH | Prime Minister Narendra Modi receives a warm welcome as he lands in Kazan, Russia. He is here to attend the 16th BRICS Summit, being held under the Chairmanship of Russia.
— ANI (@ANI) October 22, 2024
The Prime Minister is also expected to hold bilateral meetings with his counterparts from BRICS… pic.twitter.com/ATyEIRSXZa
#WATCH | Prime Minister Narendra Modi greets and interacts with members of the Indian diaspora as he arrives at Hotel Korston in Kazan, Russia. He is here to attend the 16th BRICS Summit, being held under the Chairmanship of Russia.
— ANI (@ANI) October 22, 2024
The Prime Minister is also expected to hold… pic.twitter.com/a2qW4zPLAZ
మరోవైపు ఈ సమావేశంలోనే ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక భేటీ కూడా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి గత నాలుగేళ్లుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలుకుతూ ఇరుదేశాలు కీలక గస్తీ ఒప్పందాన్ని చైనా మంగళవారం ధ్రువీకరించింది. ఈ విషయంపై ఇరుపక్షాలు చేసుకున్న తీర్మానాన్ని అమలు చేసేందుకు భారత్‌తో కలిసి చైనా పని చేస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి లిన్ జియాన్ పేర్కొన్నారు.
వివిధ అంశాలపై విస్తృత చర్చలు
అంతర్జాతీయ అభివృద్ధి ఎజెండాకు సంబంధించిన అంశాలపై చర్చలకు ముఖ్యమైన వేదికగా నిలుస్తున్న బ్రిక్స్‌లో సన్నిహిత సహకారానికి భారత్ విలువ ఇస్తుందని రష్యాకు వెళ్లేముందు ప్రధాని ఎక్స్ వేదిక తెలిపారు. రెండు రోజుల బ్రిక్స్ సదస్సులో వివిధ అంశాలపై విస్తృతమైన చర్చల కోసం ఎదురుచూస్తున్నానని మోదీ పేర్కొన్నారు. గత సంవత్సరం కొత్త సభ్యుల చేరికతో బ్రిక్స్ విస్తరణ కూటమి సమగ్రతను, ప్రపంచ శ్రేయస్సు కోసం ఎజెండాను చేర్చేందుకు తోడ్పడిందని ప్రధాని వెల్లడించారు. ప్రపంచ అభివృద్ధి అజెండా, వాతావరణ మార్పులు, ఆర్థిక సహకారం, సరఫరా గొలుసులను నిర్మించడం,సాంస్కృతిక అనుసంధానతను ప్రోత్సహించడం వంటి అంశాలపై బ్రిక్స్‌లో చర్చలు ఉంటాయన్నారు.
ఇక 'ప్రపంచాభివృద్ధి, భద్రత కోసం బహుళపక్షవాదాన్ని బలోపేతం చేయడం' ప్రధాన నినాదంగా ఈ ఏడాది బ్రిక్స్ సదస్సు జరగుతుంది. ఈ సమిట్‌లో సభ్య దేశాధినేతలు అందరూ పాల్గొంటున్నారు. అయితే బాత్రూమ్‌లో పడి తలకు గాయం కావడం వల్ల బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా సదస్సుకు వర్చువల్‌గా హాజరవుతున్నారు. బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికాతో బ్రిక్స్ కూటమి ఏర్పాటైంది. ఇప్పుడు దాన్ని విస్తరించి ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈలకూ సభ్యత్వం ఇచ్చారు. కూటమి విస్తరణ తర్వాత ఇదే తొలి శిఖరాగ్ర సదస్సు. ప్రధాని మోదీ రష్యా పర్యటన చేపట్టడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి.